BRO Movie: దసరా స్పెషల్‌.. టీవీలో పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల ‘బ్రో’.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ మొదటి సారి కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్‌. సముద్రఖని తెరకెక్కించిన ఈ మెగా మల్టీ స్టారర్‌లో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలుగా నటించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది.మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటించడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది

BRO Movie: దసరా స్పెషల్‌.. టీవీలో పవన్‌ కల్యాణ్‌, తేజ్‌ల 'బ్రో'.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?
Bro The Avatar Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 08, 2023 | 7:00 AM

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ మొదటి సారి కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్‌. సముద్రఖని తెరకెక్కించిన ఈ మెగా మల్టీ స్టారర్‌లో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ కథానాయికలుగా నటించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది.మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటించడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అలాగే పవన్‌ వింటేజ్ లుక్స్‌, సాంగ్స్‌, యాక్షన్‌ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్‌ నెట్‌ ఫ్లిక్స లో స్ట్రీమింగ్‌ కు రాగా అక్కడ కూడా సూపర్‌ రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కొన్ని రోజుల పాటు టాప్‌ ట్రెండ్‌లో నిలిచింది బ్రో మూవీ. ఇక ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్‌ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 15న జీ తెలుగు ఛానెల్‌లో సాయంత్రం 6 గంటలకు బ్రో సినిమా ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను జీ తెలుగు ఛానెల్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ బ్రో సినిమాను నిర్మించారు. తమిళ్‌ హిట్‌ మూవీ వినోదయ సిత్తంను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించారు డైరెక్టర్ సముద్రఖని. రోహిణీ, బ్రహ్మానందం, సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌, అలీ రెజా, తనికెళ్ల భరణి, పృథ్వీరాజ్‌, శ్రీనివాస రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. మరి థియేటర్లలో, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న బ్రో బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

జీ తెలుగులో మామా అల్లుళ్ల హంగామా

దసరా పండగకు ముందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!