Nayanthara: అక్కడ లేడీ సూపర్ స్టార్ దశ తిరిగినట్టే.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో నయనతార !..
డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టేసింది. దీంతో బీటౌన్‌లో నయనతారకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లే తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం బీటౌన్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్టులో నయన్ ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో నార్త్ లో నయన్‌కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టేసింది. దీంతో బీటౌన్‌లో నయనతారకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లే తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం బీటౌన్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్టులో నయన్ ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి సినిమాపై ఉన్న ప్రేమ గురించి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఆయన ‘బైజు బావ్రా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కీలకపాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లుగా సమాచారం. అయితే సినిమా కథ విని తనకు నచ్చిందని అన్నారు. ఈ ఏడాది మార్చిలో భన్సాలీ ఆఫీసు దగ్గర నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి కనిపించింది. అది బైజు బావ్రా సినిమా కోసమే అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం మాత్రం రాలేదు. 1952లో విజయ్ భట్ ‘బైజు బావ్రా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో భరత్ భూషణ్-మీనా కుమారి నటించారు. ఈ సినిమా కథ బైజు అనే వ్యక్తి ఆధారంగా సాగుతుంది. సంగీత పోటీలో తాన్‌సేన్‌ను ఓడించాలని పందెం వేసే బైజు కథ ఇది. ఆ చిత్రానికి ఇది రీమేక్ అని అంటున్నారు.
View this post on Instagram
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన చివరి చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఆ తర్వాత ఆయన నుంచి మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం ఓ పాత్ర ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం నయనతార ‘మన్నంగట్టి’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘సిన్స్ 1960’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి యూట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.