Shehnaaz Gill: ఫుడ్ పాయిజన్‏‏తో ఆసుపత్రి పాలైన బిగ్‏బాస్ బ్యూటీ.. ఆందోళనలో అభిమానులు..

కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో కీలకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం 'థ్యాంక్యూ ఫర్ కమింగ్' అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న షెహనాజ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజనింగ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించింది షెహనాజ్.

Shehnaaz Gill: ఫుడ్ పాయిజన్‏‏తో ఆసుపత్రి పాలైన బిగ్‏బాస్ బ్యూటీ.. ఆందోళనలో అభిమానులు..
Shehnaaz Gill
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 10, 2023 | 3:30 PM

హిందీలో బిగ్‏బాస్ 13 సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది షెహనాజ్ గిల్. అమాయకత్వం.. చిలిపితనంతో అడియన్స్ ఫేవరెట్ కంటెస్టెంట్‏గా పాపులారిటీని సంపాదించుకుంది. అదే సమయంలో దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లాతో షెహనాజ్ స్నేహంతో మరింత ఫేమస్ అయ్యింది. మోడలింగ్ ద్వారా కెరీర్ ఆరంభించిన షెహనాజ్.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీలో కీలకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న షెహనాజ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజనింగ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో అభిమానులతో ముచ్చటించింది షెహనాజ్.

ఫుడ్ పాయిజన్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో షెహనాజ్ చేరారు. ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమా సహా నిర్మాత రియా కపూర్ కొకిలాబెన్ ఆసుపత్రిలో షెహనాజ్‏ను పరామర్శించింది. షెహనాజ్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆసుపత్రి నుండి ఆమె వీడియోలు ఆన్‌లైన్‌లో వైరలవుతున్నాయి. అనిల్ కపూర్, రియా కపూర్ , బాలీవుడ్ సినీ ప్రముఖులు షెహనాజ్ ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఆసుపత్రి బెడ్ పై నుంచే షెహనాజ్ ఇన్ స్టాలో లైవ్ సెషన్ లో షెహనాజ్ మాట్లాడుతూ.. అందరికి సమయం వస్తుంది.. పోతుంది. ఇది నా విషయంలో జరిగింది. ఇది మళ్లీ వస్తుంది. నేను ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. శాండివిచ్ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లుగా వైద్యులు గుర్తించారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక షెహనాజ్ లైవ్ సెషన్ లో అనిల్ కపూర్ స్పందిస్తూ.. ‘నమస్తే షెహనాజ్.. మీరు ముంతాజ్ లాగా ఉన్నారు. తదుపరి ముంతాజ్ మీరే. అందరూ సినిమా చూస్తున్నారు. అభినందిస్తున్నారు’. అంటూ కామెంట్ చేశారు. థ్యాంక్యూ ఫర్ కమింగ్‌లో రుషి కల్రాగా షెహనాజ్ నటించింది. ఇందులో భూమి పెడ్నేకర్, షిబానీ బేడీ, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.