AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nassar: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిర్మాత దిల్‌ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా విలక్షణ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. నాజర్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న మహబూబ్ భాషా (94) మంగళవారం (అక్టోబర్ 10) తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి..

Actor Nassar: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూత
Actor Nassar
Srilakshmi C
|

Updated on: Oct 10, 2023 | 9:24 PM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నిర్మాత దిల్‌ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా విలక్షణ నటుడు, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. నాజర్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న మహబూబ్ భాషా (94) మంగళవారం (అక్టోబర్ 10) తీవ్ర ఆశ్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్‌మలైలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. మెహబూబ్ భాషా మృతి విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నాజర్‌ తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెహబూబ్ భాషా అంత్యక్రియలు చెంగల్పట్టులో రేపు నిర్వహించనున్నట్లు సమాచారం.

కాగా నటుడు నాజర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరియం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా.. నటించి మెప్పించాడు. ప్రస్తుతం సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళం భాషల్లోని దాదాపు స్టార్ హీరోల అందరి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా బాహబలి చిత్రంలో రానా తండ్రి బిజ్జాల దేవాగా కీలక పాత్ర పోషించిన ఆయన ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. ఇలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో నాజర్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ధనుశ్ నటిస్తోన్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇక నటుడు నాజర్‌కు కెరీర్‌ తొలినాళ్ల నుంచి మాబూబ్ బాషానే అండగా నిలిచారు. సినిమాల్లోకి వెళ్తానని ఆయన అభిరుచిని తండ్రికి తెలిపినప్పుడు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా.. ఎంత కష్టమైన నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని వెన్ను తట్టి ప్రోత్సహించినట్లు నాజర్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. సినిమాల్లో అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నప్పుడు కూడా తండ్రి మాబూబ్ భాషానే సర్దిచెప్పి మళ్లీ సినిమాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారట. తండ్రి ప్రోత్సాహం తోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఎన్నోసార్లు నాజర్ చెప్పారు. ఇక తండ్రి మరణంతో కృంగిపోయిన నాజర్ త్వరలోనే మామూలు వ్యక్తిగా మారాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి