Jabardasth: ‘బలగం’ వేణు బాటలో మరో జబర్దస్త్ కమెడియన్.. డైరెక్టర్‌గా మారనున్న ధన్‌రాజ్.. నిర్మాత ఎవరంటే?
వేణు బలగం సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే సుడిగాలి సుధీర్ ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించాడు. గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్, శాంతి కుమార్ కూడా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. మరికొందరు కూడా మెరవనున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో జబరస్త్ కమెడియన్ చేరాడు.
జబర్దస్త్.. ఎంతో మంది నటీనటులు తమ ట్యాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఈ కామెడీ షో ఒక చక్కని వేదికగా నిలిచింది. ఈ టీవీ షోతో పాపులర్ అయిన యాక్టర్స్ ఇప్పుడు సినిమాల్లోనూ సత్తా చాటుకున్నారు. డైరెక్టర్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వేణు బలగం సినిమాతో డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే సుడిగాలి సుధీర్ ఇప్పటికే నాలుగు సినిమాల్లో నటించాడు. గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్, శాంతి కుమార్ కూడా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు. మరికొందరు కూడా మెరవనున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో జబరస్త్ కమెడియన్ చేరాడు. స్టార్ కమెడియన్ ధన్ రాజ్ కూడా మెగా ఫోన్ పట్టనున్నారని సమాచారం. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా తరహాలోనే డైరెక్టర్ గా ఒక ఎమోషనల్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధనరాజ్ చెప్పిస్టోరీ నచ్చడంతో తన హోమ్ బ్యానర్ లోనే కమెడియన్‌కు ఛాన్స్ ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యారని సమాచారం. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఏకంగా సముద్రఖని లాంటి ప్రముఖ నటుడిని తీసుకునేందుకు సిద్ధమయ్యారట. దసరా పండగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే యోచనలో ఉన్నారట మేకర్స్. అక్టోబర్ 22న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
మొత్తానికి బలగం వేణు తరహాలోనే ధన్‌రాజ్ కూడా మెగా ఫోన్ పట్టడం ఖరారైందన సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా టాక్ నడుస్తోంది. ఇక ధన్‌రాజ్ విషయానికొస్తే.. రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందుల్లో అతను పోషించిన నాంపల్లి సంత్తి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలోనూ మెప్పించాడు. ఆ తర్వాత యువత, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, గోపాల గోపాల.. ఇలా మొత్తం 80కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. మధ్యలో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. ఆ మధ్యన ‘బుజ్జీ ఇలారా’ సినిమాతో హీరోగానూ మెప్పించాడు. నిర్మాతగానూ కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు.
ధన్ రాజ్ డ్యాన్స్ చూశారా?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.