Leo Movie: లియో సెన్సార్ రివ్యూ అదిరిపోయిందిగా..! సినిమా ఎలా ఉండనుందంటే.
ఖైదీ,మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న లోకేష్ ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అక్టోబర్ 19 ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు లోకేష్. ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ చేస్తూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాకు ఖాదీ సినిమాను లింక్ చేశాడు.

ప్రస్తుతం మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఏది అంటే టక్కున చెప్పే పేరు లియో. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఖైదీ,మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న లోకేష్ ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అక్టోబర్ 19 ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు లోకేష్. ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ చేస్తూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాకు ఖాదీ సినిమాను లింక్ చేశాడు. అలాగే విక్రమ్ సినిమా చివరిలో హీరో సూర్యను మెయిన్ విలన్ గా చూపించాడు.
ఇక ఇప్పుడు లియో సినిమాకు విక్రమ్ సినిమాకు లింక్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే లియో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు లియో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రన్‌టైన్ 2 గంటల 44 నిమిషాలు అని తెలుస్తోంది. సినిమాలో చిన్న చిన్న మార్పులు సూచించారట సెన్సార్ సభ్యులు. అలాగే ఈసినిమా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని. సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని సమాచారం. లియో సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్, ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఇక లియో సినిమాతో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడు అనిరుధ్. ముఖ్యంగా హీరోల ఎలివేషన్స్ లో అనిరుధ్ దుమ్మురేపుతాడు. తాజాగా అనిరుధ్ షేర్ చేసిన ట్వీట్ లియో పై అంచనాలు పెంచేసింది. లియో అవుట్ పుట్ బాగా వచ్చిందని, థియేటర్స్ లో సినిమా అదిరిపోతుంది అంటున్నారు అనిరుధ్.
అనిరుధ్ ట్విట్టర్
#Leo 🔥🔥🔥🔥🔥💥💥💥💥💥🏆🏆🏆🏆🏆
— Anirudh Ravichander (@anirudhofficial) October 9, 2023
అనిరుధ్ ట్విట్టర్
Tamil: https://t.co/d0vqpvC8bI
Telugu: https://t.co/YoE5Z50eTW
Kannada: https://t.co/98iNHGJM8j
— Vijay (@actorvijay) October 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.