- Telugu News Photo Gallery Cricket photos KL Rahul Has Extends A Helping Hand To An Economically Poor Girl Shruti Kulavi In Dharwad
KL Rahul: ‘నీ మీద గౌరవం పెరిగిందయ్యా రాహుల్’.. పేద బాలిక చదువు కోసం టీమిండియా క్రికెటర్ ఏం చేశాడో తెలుసా?
నిత్యం క్రికెట్‌లో బిజీగా ఉండే రాహుల్.. ఓ విద్యార్థికి చదువు కోసం ఆర్థిక సాయం చేసి చాలా మంచి పనిచేశాడంటూ అభిమానులు, నెటిజన్లు టీమిండియా క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చాడు. భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పుడు, రాహుల్ విరాట్ కోహ్లీతో కలిసి అజేయంగా 97 పరుగులు చేసి సిడిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Updated on: Oct 10, 2023 | 9:56 PM

టీమిండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టాప్ క్లాస్ ఫామ్‌తో ఆకట్టుకుంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. కాగా ఆటతోనే తన సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. పేదరికంతో బాధపడుతోన్న ఓ విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

నిరుపేద జీవితం గడుపుతున్న ఓ పేద విద్యార్థినికి టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ సహాయం చేశారు. ధార్వాడలోని సిద్దేశ్వర్ కాలనీకి చెందిన హనుమంతప్ప, సుమిత్ర దంపతుల కుమార్తె సృష్టి భవిష్యత్తులో డాక్టర్ కావాలని కలలు కంది. అయితే ఆ బాలిక కలకు పేదరికం అడ్డంకిగా మారింది.

ఈ కుటుంబం పడుతున్న కష్టాలను తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్ ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను సంప్రదించాడు. అమ్మాయి ఆర్థిక కష్టాలను టీమిండియా క్రికెటర్ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన రాహుల్ ఆ అమ్మాయి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేశాడు.

దీపకా గాంకర్, అనితా గాంకర్ నేతృత్వంలో 1996లో ప్రారంభమైన గ్లోబల్ ఎక్సలెన్స్ స్కూల్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ పాఠశాలలో సృష్టి కులవి చదువుకోవడానికి రాహుల్ ఆర్థికంగా సహకరించారు. ఇది మా పాఠశాలకు, మనకు గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ మాలాశ్రీ నయ్యర్ చెప్పుకొచ్చారు.