Mama Machindra OTT: రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’.. ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ప్రముఖ కమెడియన్‌ అండ్‌ రైటర్‌ అయిన హర్ష వర్ధన్‌ ఈ సినిమాతో మొదటిసారిగా మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సుధీర్‌ బాబును ఏకంగా మూడు పాత్రల్లో చూపించి పెద్ద సాహసమే చేశాడు హర్ష వర్ధన్‌. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి

Mama Machindra OTT: రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న సుధీర్ బాబు 'మామా మశ్చీంద్ర'.. ఎప్పుడు, ఎక్కడంటే?
Maama Mascheendra Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2023 | 8:18 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్‌ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ప్రముఖ కమెడియన్‌ అండ్‌ రైటర్‌ అయిన హర్ష వర్ధన్‌ ఈ సినిమాతో మొదటిసారిగా మెగా ఫోన్‌ పట్టుకున్నాడు. డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సుధీర్‌ బాబును ఏకంగా మూడు పాత్రల్లో చూపించి పెద్ద సాహసమే చేశాడు హర్ష వర్ధన్‌. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన మామా మశ్చీంద్ర జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరోగా సుధీర్‌ బాబు న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కినా కథలో దమ్ము లేకపోవడం, ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అందుకే థియేటర్‌లో విడుదలైన రెండు వారాల గ్యాప్‌లోనే మామా మశ్చీంద్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అక్టోబర్‌ 20 నుంచి మామా మశ్చీంద్ర సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడీ సినిమా మరో ఓటీటీలోకి కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలోనూ మామా మశ్చీంద్ర స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది.

‘మామా మశ్చీంద్ర’ సినిమాలో తెలుగమ్మాయి ఇషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. హర్ష వర్ధన్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, అజయ్‌, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ రావు ఈ సినిమాను నిర్మించారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ముగ్గురు భిన్న‌మైన వ్య‌క్తుల క‌థ‌తో మామా మ‌శ్చీంద్ర సినిమా తెరకెక్కింది. ఆస్తి కోసం పరుశురామ్‌ (సుధీర్‌ బాబు) తన అసిస్టెంట్ దాసు (హర్ష వర్ధన్‌) సహాయంతో తన సొంత చెల్లెలిని చంపాలనుకుంటాడు. కానీ అతని ప్లాన్‌ వర్కవుట్ కాదు. ఇది జరిగిన చాలా ఏళ్లకు పరశురామ్ పోలికలతోనే దుర్గ, డీజే (సుధీర్‌ బాబు) అతనికి తారసపడతారు. మరి పరశురామ్‌తో వారికి ఉన్న రిలేషన్‌ ఏంటి? పరశురామ్ కూతురు (ఈషారెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని)లతో వారికి ఉన్న సంబంధమేంటో తెలుసుకోవాలంటే మామా మశ్చీంద్ర సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!