Mark Antony: ఇట్స్ అఫీషియల్.. ‘మార్క్ ఆంటోనీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
యాక్షన్, హాస్యం, నాటకీయత కలగలిసిన ఈ చిత్రానికి తమిళ్ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ యాక్షన ఎంటర్టైనర్ భారీగానే వసూళ్లు రాబట్టింది. తమిళంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. అంతలోనే ఓటీటీలోకి రాబోతుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అక్టోబర్ రెండవ వారంలో విడుదల కాబోతుందని రూమర్స్ వినిపించాయి.
కోలీవుడ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఇందులో హీరో విశాల్.. SJ సూర్య ద్విపాత్రాభినయంలో నటించారు. సెప్టెంబర్ 15, 2023న థియేటర్‌లో తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. యాక్షన్, హాస్యం, నాటకీయత కలగలిసిన ఈ చిత్రానికి తమిళ్ అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తీసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీగానే వసూళ్లు రాబట్టింది. తమిళంలో దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. అంతలోనే ఓటీటీలోకి రాబోతుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అక్టోబర్ రెండవ వారంలో విడుదల కాబోతుందని రూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడదే విషయంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ వంటి ప్రముఖ ప్రతిభావంతులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఎస్ వినోద్ కుమార్ నిర్మించగా.. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
a laughter fest taking you beyond the dimensions of time! 🕰️#MarkAntonyOnPrime, Oct 13 pic.twitter.com/GmGjSfoku9
— prime video IN (@PrimeVideoIN) October 10, 2023
ఒక ఫోన్ ద్వారా గతంలోని వ్యక్తులతో మాట్లాడే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. టైమ్ ట్రావెల్ కథకు మాస్ టచప్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. తెలుగులో అంతగా క్లిక్ అవ్వకపోయినా.. తమిళంలో మాత్రం హిట్ అందుకుంది. అటు హిందీలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ ఖాతాలో వేసుకున్నారు విశాల్.
Absolutely delighted to share the landmark 25th day of the Mega Blockbuster #MarkAntony running in theatres near you.
Feeling ecstatic that you all loved the movie & entered the #WorldOfMarkAntony every passing day since 15th Sep.
Thanking each & everyone of you and credits to… pic.twitter.com/gem9yMbEbm
— Vishal (@VishalKOfficial) October 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.