Subha Shree: బాయ్‌ ఫ్రెండ్‌ లేడు.. ఆ స్టార్‌ హీరోతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది: బిగ్‌ బాస్‌ బ్యూటీ శుభశ్రీ

ప్రముఖ బుల్లితెర రియాలిటి షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఆరో వారంలోకి ప్రవేశించింది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్‌ బయటకు వెళ్లిపోయారు. అలాగే మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌ వైల్డ్‌ కార్డ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కాగా ఐదో వారంలో శుభశ్రీ రాయగురు బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌ కంటే ముందు కొన్ని తెలుగు సినిమాల్లో మెరిసిందీ అందాల తార.

Subha Shree: బాయ్‌ ఫ్రెండ్‌ లేడు.. ఆ స్టార్‌ హీరోతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది: బిగ్‌ బాస్‌ బ్యూటీ శుభశ్రీ
Subha Shree
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2023 | 5:37 PM

ప్రముఖ బుల్లితెర రియాలిటి షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఆరో వారంలోకి ప్రవేశించింది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్‌ బయటకు వెళ్లిపోయారు. అలాగే మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌ వైల్డ్‌ కార్డ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టారు. కాగా ఐదో వారంలో శుభశ్రీ రాయగురు బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌ కంటే ముందు కొన్ని తెలుగు సినిమాల్లో మెరిసిందీ అందాల తార. 2022లో రుద్రవీణ అనే ఓ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శుభ శ్రీ డెవిల్‌ (తమిళ్‌), కథ వెనుక కథ, అమిగోస్‌, సందేహం వంటి సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ షోలోకి అడుగు పెట్టిందో తనకు మంచి క్రేజ్‌ వచ్చింది. హౌజ్‌లో ఉన్న ఐదు వారాలు తన అందంతో బిగ్‌బాస్‌ షోకు మంచి గ్లామర్‌ తీసుకొచ్చింది. అలాగే తన చలాకీ మాటలతో ఆడియెన్స్‌ను అలరించింది. దీంతో టాప్‌-5లో ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ఐదో వారం నుంచే ఎలిమినేట్‌ అయ్యింది. ఇది అభిమానులను, నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. కాగా బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసిన శుభ శ్రీ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది.

‘మాది ఒడిషానే అయినా తెలుగు నేర్చుకుంటున్నా. మొదట తెలుగు బాగా వచ్చేది కాదు. అయితే కష్టపడి నేర్చుకున్నా. ఎల్‌ఎల్‌బీ కూడా చదివాను. మోడలింగ్‌లో అడుగుపెట్టి 2020లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలిచాను. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టాలీవుడ్ హీరోల్లో విజయ్‌ దేవరకొండతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది. అలాగే పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ అన్నా నాకు చాలా ఇష్టం. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. అలాగే నాకెవరూ బాయ్‌ ఫ్రెండ్స్‌ లేరు. ఇక సినిమా ఇండస్ట్రీలో నాకెలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం నాకు ఎదురువ్వలేదు. అయితే కొన్ని ఈవెంట్లలో కొందరు నన్ను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక మా ఫ్యామిలీ అంతా లాయర్సే. నాన్నగారు జడ్జిగా పని చేస్తున్నారు. నాకు ఒక్క అక్క, తమ్ముడు ఉన్నారు. అక్కా సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్. తమ్ముడు లా చదువుతున్నాడు. ఇక నేను కూడా ఎల్‌ఎల్‌బీ చదివాను’ అని చెప్పుకొచ్చింది శుభ శ్రీ.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ లో శుభ శ్రీ ప్రయాణం సాగిందిలా…

అమి గోస్ సినిమాలో శుభ శ్రీ రాయగురు..

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి