- Telugu News Photo Gallery Cinema photos On the occasion of Rajamouli's birthday, let us recall some of the quotations he had said in the past.
Rajamouli Quotes: రాజమౌళికి పుట్టిరోజు శుభాకాంక్షలు.. జక్కన్న చెప్పిన జీవిత సత్యాలు ఇవే..
2001లో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అయ్యారు జక్కన్న. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈగ సినిమా వరకు ఒకటి.. బాహుబలితో కథ మొత్తం మారిపోయింది. ఈ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత అయన సొంతం. ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టారు. తెలుగు సినిమాకు మకుటంలేని మహారాజు రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Oct 10, 2023 | 5:46 PM

నేను అదృష్టాన్ని నమ్మను. ఫలితం ఏదైనా దానికి బాధ్యత వహించాలి. సినిమాకు సంబంధించి దర్శకుడే దేనికైనా బాధ్యత వహించాలి. ఇచ్చిన పని చేయలేదని ఇతరులను నిందించడానికి వీల్లేదు.

సినిమా కథ, పాత్రలకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. డబ్బు గురించి చివరగా ఆలోచిస్తాను. ఎలాంటి సినిమా తీయాలన్నది డబ్బు నిర్దేశించకూడదు.

సినిమాలను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలనే అనుకుంటాను. అయితే ఏవో కారణాలతో అది సాధ్యంకాదు.

నాకు పనిచేసిన సక్సెస్ మంత్ర మీకు పని చేయాలని లేదు, ఎవరి సక్సెస్ మంత్ర వాళ్లు క్రియేట్ చేసుకోవాలి

నువ్వు దాని వెనుక పరుగెత్తు.. అప్పుడు డబ్బు నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది

డైరెక్టర్లు ఎవరూ మనసులో ఉన్నది ఉన్నట్లు తెరపైన చూపించలేరు. బాహుబలి -2 విషయంలో నా మనసులో ఉన్నది ఉన్నట్లు దాదాపుగా తెరకెక్కించగలిగాను.

వాస్తవానికి హిందీ సినీ పరిశ్రమ నుంచి నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. ‘ఈగ’ మూవీ తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా ఆఫర్స్ వచ్చాయి.





























