- Telugu News Photo Gallery Cinema photos Actress Kangana Ranaut Participates In Navratari Dandia night Ahmedabad, Photos Goes Viral
Kangana Ranaut: నవరాత్రి ఉత్సవాల్లో కంగనా.. ట్రెడిషినల్ లుక్‌లో తళుక్కుమన్న బ్యూటీ.. ఫొటోస్ చూశారా?
ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ అహ్మదాబాద్‌లోని దాండియా ఉత్సవాల్లో సందడి చేసింది. అలాగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా శారీ లుక్‌లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది కంగనా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Updated on: Oct 16, 2023 | 9:34 PM

ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ అహ్మదాబాద్‌లోని దాండియా ఉత్సవాల్లో సందడి చేసింది. అలాగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా శారీ లుక్‌లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది కంగనా. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

కాగా కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం తేజస్ విస్తృతంగ ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్‌లో బిజీగా ఉంటోన్న ఆమె తాజాగా అహ్మదాబాద్ గర్భా వేడుకల్లో సందడి చేసింది.

కంగనా తన సినిమా ప్రమోషన్ కోసం ఇటీవల అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడ ఆమె నవరాత్రి వేడుకల్లో పాల్గొంది. అలాగే దాండియా నైట్‌లో కూడా పాల్గొంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఈ సందర్భంగా అందమైన పసుపు-గులాబీ రంగు లెహంగాలో కనిపించింది కంగానా. అలాగే ఆమె ధరించిన పొడవాటి అందమైన చెవిపోగులు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

తేజస్ చిత్రంలోని మొదటి పాట 'జాన్ దా' అక్టోబర్ 15న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కంగనా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఫైటర్ పైలట్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ అక్టోబర్ 8 న విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.