Samantha: ‘సిటాడెల్’ సిరీస్ కోసం సామ్ అంత తీసుకుందా ?.. సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సామ్ మాత్రం కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత గమనిస్తూ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఆమె నటించిన సిరీస్ సిటాడెల్. ఇందులో స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Samantha: 'సిటాడెల్' సిరీస్ కోసం సామ్ అంత తీసుకుందా ?.. సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2023 | 5:13 PM

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంత. సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సామ్ మాత్రం కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత గమనిస్తూ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత ఆమె నటించిన సిరీస్ సిటాడెల్. ఇందులో స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ కోసం సామ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ వినిపిస్తుంది.

ఇండస్ట్రీలో అనేక హిట్స్ ఖాతాలో వేసుకున్న తర్వాత సామ్ ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’ సాంగ్ కోసం ఆమెకు సుమారు రూ. 5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్న సిటాడెల్ కోసం సామ్ తన రెమ్యునరేషన్ పెంచిందని టాక్ వినిపిస్తోంది. ఈ సిరీస్ లో నటించినందుకు ఆమె రూ.10 కోట్లు పారితోషికాన్ని తీసుకుందని బీటౌన్ లో రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ ను ఆంథోనీ రస్సో, జో రస్సో , మైక్ లారోకా నిర్మించారు. ఈ అమెరికన్ స్పై థ్రిల్లర్ సిరీస్ కు రీమేక్ గా రూపొందించిన సిటాడెల్ ప్రముఖ ఓటీటీ మాధ్యామం అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా నటించారు. ఇండియన్ వెర్షన్‌లో వరణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఆమె నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ అందుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. ఈ మూవీ తర్వాత సామ్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తన హెల్త్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!