Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్‏ను పాటబిడ్డ ఎలిమినేట్ కానున్నాడా ?.. ఎవరు వెళ్లిపోతారని మీరు అనుకుంటున్నారు ?..

గత వారం నయని పావని ఎలిమినేట్ కాగా.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు టేస్టీ తేజా, పూజా మూర్తి, అశ్విని, గౌతమ్, భోలే షావలి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. అయితే అందులో ఎవరు వెళ్లనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నామినేషన్స్ ప్రక్రియలో శోభా శెట్టి, ప్రియాంక వర్సెస్ భోలే షావలి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్‏ను పాటబిడ్డ ఎలిమినేట్ కానున్నాడా ?.. ఎవరు వెళ్లిపోతారని మీరు అనుకుంటున్నారు ?..
Bhole Shavali
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2023 | 1:02 PM

ఉల్టా పుల్టా అన్నట్టుగానే.. బిగ్‌బాస్‌ సీజన్ 7 మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏడో వారం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతుంది. ఫన్నీ టాస్కులతో అలరించిన బిగ్‌బాస్‌ .. ఇప్పుడు హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టే పనిలో పడ్డాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో కెప్టెన్ ఎవరో కావాలో తమలో తామే ఎంచుకోవాలని ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఏడో వారం వీకెండ్ దగ్గరకొచ్చేస్తుంది. గత వారం నయని పావని ఎలిమినేట్ కాగా.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు టేస్టీ తేజా, పూజా మూర్తి, అశ్విని, గౌతమ్, భోలే షావలి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. అయితే అందులో ఎవరు వెళ్లనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నామినేషన్స్ ప్రక్రియలో శోభా శెట్టి, ప్రియాంక వర్సెస్ భోలే షావలి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భోలే నోరు జారి బూతు మాట్లాడడంతో ప్రియాంక, శోభా రెచ్చిపోయారు.

చివరకు భోలేను చూస్తూ థూ అంటూ సీరియస్ అయ్యింది ప్రియాంక. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ తర్వాత ఓటింగ్ ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోలింగ్స్ చూస్తే ఈ వారం భోలే షావలి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్స్ తర్వాత ప్రియాంక, శోభాకు అనేకసార్లు భోలే సారీలు చెప్పారు. కానీ వారిద్దరూ అతడితో మాట్లాడేందుకు అస్సుల సుముఖత చూపించడం లేదు. కానీ ఉన్నట్లుండి భోలే ఓటింగ్ పెరిగింది. దీంతో అతడు నాలుగో స్థానానికి చేరినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఓటింగ్ చూస్తే ఈ వారం డేంజర్ జోన్ లో పూజా మూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. మరో బ్యూటీ అశ్విని సైతం డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె హౌస్ లో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నామినేషన్స్ సమయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యింది. దీంతో అసలు అశ్వినికి బిగ్ బాస్ గేమ్ అర్థం కావడం లేదంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్ కు ఎక్కువగానే ఓటింగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈవారం అమర్ దీప్ కు మంచి ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం. ఆ తర్వాత తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తోన్న తేజకు ఓటింగ్ పెరిగిందని తెలుస్తోంది. ఇక గౌతమ్ సైతం సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు భోలే షావలి, పూజా మూర్తి, అశ్వినిలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ వారం హౌస్ నుంచి భోలో షావలి ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నారా ?.. లేదా సేవ్ అవుతాడని భావిస్తున్నారా ?అనేది ఈ కింద టీవీ9 ట్విట్టర్ ద్వారా ఓటు వేసి మీ నిర్ణయాన్ని తెలపండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.