Adipurush: టీవీలో ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ రాముడి అవతారంలో ప్రేక్షకులను కనువిందు చేసిన సినిమా ఆదిపురుష్‌. రామాయణం మహా కావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ మూవీలో కృతి సనన్ సీతగా కనిపించింది. లంకేశుడిగా బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీఖాన్‌ నటించాడు. సన్నీ సింగ్‌ లక్ష్మణుడు, దేవ్‌దత్తా నాగే హనుమంతుడి పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో జూన్‌ 16న థియేటర్లలో రిలీజైన ఆదిపురుష్‌ ప్రేక్షకులను

Adipurush: టీవీలో ప్రభాస్‌ 'ఆదిపురుష్‌'.. ఏ ఛానెల్‌లో ఎప్పుడు టెలికాస్ట్‌ కానుందంటే?
Adipurush Movie
Follow us
Basha Shek

|

Updated on: Oct 22, 2023 | 3:47 PM

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ రాముడి అవతారంలో ప్రేక్షకులను కనువిందు చేసిన సినిమా ఆదిపురుష్‌. రామాయణం మహా కావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ మూవీలో కృతి సనన్ సీతగా కనిపించింది. లంకేశుడిగా బాలీవుడ్ స్టార్‌ హీరో సైఫ్ అలీఖాన్‌ నటించాడు. సన్నీ సింగ్‌ లక్ష్మణుడు, దేవ్‌దత్తా నాగే హనుమంతుడి పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో జూన్‌ 16న థియేటర్లలో రిలీజైన ఆదిపురుష్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా కథ రామాయణానికి భిన్నంగా ఉందన్న కామెంట్లు, విమర్శలు వినిపించాయి. అలాగే మూవీలోని వీఎఫ్‌క్స్‌, డైలాగుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వివాదాలెన్నీ ఉన్నా బాక్సాఫీస్‌ వద్ద ఆదిపురుష్‌ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. సుమారు రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ప్రభాస్‌ క్రేజ్‌ దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజైన చాలా రోజులకు ఓటీటీలో వచ్చిన ఆదిపురుష్‌ ఇక్కడ మాత్రం భారీ వ్యూస్‌ సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగైన ఈ మైథలాజికల్ మూవీకి ఆదరణ బాగానే వచ్చింది.

థియేటర్లలో రిలీజైన  నాలుగు నెలల తర్వాత బుల్లి తెరపై..

థియేటర్లలో, ఓటీటీలో హిట్‌గా నిలిచిన ఆదిపురుష్‌ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘ఆదిపురుష్’ వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ప్రముఖ టీవీ ఛానెల్‌ స్టార్‌ మా ఆదిపురుష్‌ శాటిలైట్‌ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఆదివారం అంటే అక్టోబర్‌ 29 న సాయంత్రం 5.30 గంటలకు ప్రభాస్‌ సినిమాను టెలికాస్ట్‌ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. కాగా టీ సిరీస్‌ బ్యానర్‌ పై భూషణ్‌ కుమార్‌, క్రిష్ణన్‌ కుమార్‌ నిర్మించిన ఆది పురుష్‌ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా రిలీజ్‌ చేశాయి. సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించగా, అజయ్‌ అతుల్‌, సంచిత్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లు, ఓటీటీలో అదరగొట్టిన ఆదిపురుష్‌ బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

స్టార్ మా లో సందడి చేయనున్న ఆదిపురుష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!