OTT : ఓటిటి వచ్చాక థియెట్రికల్ బిజినెస్ దెబ్బ తిందా..? అసలు విషయం ఏంటంటే..
మీడియం రేంజ్ సినిమాలైతే కేవలం ఓటిటి ప్లస్ డబ్బింగ్ రైట్స్‌తోనే బయటపడిపోతున్నాయి.. వాటికి థియెట్రికల్ కలెక్షన్లు బోనస్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటిటి వరంగా మారింది. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారు. దాంతో నిర్మాతలకు వద్దన్నా డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమాలు కొనడంతో ఓటిటి సంస్థలకి కూడా భారీ దెబ్బలే పడుతున్నాయి.
ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు.. ఓటిటి వచ్చాక థియెట్రికల్ బిజినెస్ దెబ్బ తిందా..? ఒకప్పుడు థియెట్రికల్ కలెక్షన్స్‌పై ఆధారపడే నిర్మాతలంతా ఇప్పుడు ఓటిటిపై ఆశలు పెంచుకుంటున్నారా..? దానికి వచ్చే రేట్ కోసమే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారా..? నిర్మాతల అత్యాశతో ఓటిటి మార్కెట్ కూడా డేంజర్ జోన్‌లోకి వెళ్లిందా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
అసలు కంటే కొసరు ముఖ్యం అన్నట్లు మారిపోయిందిప్పుడు మన సినిమాల పరిస్థితి. థియేటర్ నుంచి వచ్చే వసూళ్ల కంటే.. డిజిటల్ నుంచి వచ్చే రికవరీ నిర్మాతలకు ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదేమో..? మీడియం రేంజ్ సినిమాలైతే కేవలం ఓటిటి ప్లస్ డబ్బింగ్ రైట్స్‌తోనే బయటపడిపోతున్నాయి.. వాటికి థియెట్రికల్ కలెక్షన్లు బోనస్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటిటి వరంగా మారింది. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారు. దాంతో నిర్మాతలకు వద్దన్నా డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సినిమాలు కొనడంతో ఓటిటి సంస్థలకి కూడా భారీ దెబ్బలే పడుతున్నాయి. ఈ మధ్య భోళా శంకర్, లైగర్, ఏజెంట్, కస్టడీ, శాకుంతలం లాంటి డిజాస్టర్స్ ఓటిటిలోనూ అండర్ పర్ఫార్మ్ చేసాయని లెక్కలు చెప్తున్నాయి.
పెద్ద సినిమాలన్నీ విడుదలకు ముందే ఓటిటి రైట్స్ అమ్మేస్తుంటారు నిర్మాతలు. ఒక్కో సినిమాకు కనీసం 50 నుంచి 100 కోట్ల వరకు డీల్ కుదుర్తుంది. రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి దర్శకులైతే రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే అంత రేట్ పెట్టి కొన్నా కూడా ఓటిటిలోనూ తక్కువ వ్యూస్ వస్తున్నాయనేది ప్రధానమైన కంప్లైంట్. హిట్టైన అన్ని సినిమాలకూ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో వ్యూవర్ షిప్ ఉంటందనుకోవడం కూడా పొరపాటే. థియేటర్స్‌లోనే ఎక్కువ చూసుంటారు కాబట్టి ఓటిటిలో చూసేది తక్కువే. ఇక డిజాస్టర్స్ అక్కడే చూడకపోతే ఇంట్లో ఏం చూస్తారు చెప్పండి..? మొత్తానికి ఓటిటి మార్కెట్ సరిగ్గా వాడుకుంటే ఓకే.. అలా కాకుండా దానిపైనే డిపెండ్ అయితే మాత్రం ఫ్యూచర్‌లో అదీ డేంజర్ జోన్‌లోకి వెళ్ళడం ఖాయం.