Bigg Boss 7 Telugu:మనోడు ఏం మారలే.. సేమ్ టూ సేమ్ అలాగే..! దిమాక్‌తో అబ్బురపరిచిన రైతు బిడ్డ
ప్రతీ సారి టాస్క్ ఏంటో చెప్పాక.. ఎవరు ఈ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తారో నిర్ణయించుకోండంటూ.. సభ్యులకు చెప్పే బిగ్ బాస్.. ఈసారి మాత్రం కాస్త ఉల్టా పుల్టాగా రూల్ పెట్టాడు. టాస్క్ ఏంటో చెప్పకుండా.. మొదటి టాస్క్‌లో నలుగురుకి అవకాశం ఉంటుందని... ఆ నలుగురు ఎవరో.. కెప్టెన్ సమక్షంలో నిర్ధారించుకోండంటూ.. చెబుతాడు. అయితే బిగ్ బాస్ అలా చెప్పాడో లేదో.. ఇలా తాను ఆడతానంటూ.. పొలోమని సీన్ మధ్యలోకి వచ్చి హంగామా చేస్తాడు అమర్..
సీజన్ ఒకటే కానీ.. ఏడే కానీ.. బిగ్ బాస్ చూస్తూ.. ఫాలో అవుతున్న వారికి ఆ షో ఫార్మాట్ ఇట్టే తెలిసిపోతుంది. ఏ వారం ఏం అవుతుందో.. దేనికి సంబంధించిన టాస్కులు జరుగుతాయో… అనే దానిపై ఓ అవగాహన వచ్చేస్తుంది. ఆదివారం అంటే… ఎలిమినేషన్ అని, సోమవారం అంటే నామినేషన్స్ అని.. అదే మంగళవారమో.. లేక బుధ వారమో అంటే.. నయా కెప్టెన్సీ టాస్క్ షురూ అవుతుందనే క్లారిటీ.. ఉంటుంది. ఇక తాజాగా ఈ ఆర్డర్లోనే సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో.. ఇవ్వాళ్టి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెడర్స్ టాస్క్ మొదలైపోయింది.
మండే నామినేషన్స్‌లో రగిలిన నామినేషన్స్ హీట్.. హౌస్‌లో ఇంకా కంటిన్యూ అవుతున్న వేళ… బుధవారం అంటే 53వ ఎపిసోడ్‌లో రసవత్తర పోరుకు రంగం సింద్దం అయింది. ఇంటి సభ్యుల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టుగా.. ఉంది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే.. మరుసటి వారం కెప్టెన్ గా ఒకరిని ఎన్నుకోవడం కోసం బీబీ మారథాన్ పెట్టనున్నట్టు చెబుతాడు బిగ్ బాస్. అందులో భాగంగా నయా టాస్కులను సభ్యుల మధ్య పెడతామంటూ క్లారిటీ ఇస్తాడు.
హౌస్‌లో ఉన్న ఆటగాళ్లందరిలో ఎవరైతే.. టాస్కుల్లో తమను తాము ప్రూఫ్ చేసుకుంటారో.. వారే.. కెప్టెన్సీ కంటెడర్స్‌గా.. కెప్టెన్సీ టాస్క్‌లో ముందుకు వెళతారని.. చివరగా పెట్టే టాస్కుతో… ఒకరు విజేతగా నిలుస్తారని చెబుతాడు బిగ్ బాస్. అలా ఫైనల్లో గెలిచిన వారే కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను ధరించి.. బిగ్ బాస్ కెప్టెన్ అవుతాడని చెబుతాడు. ఇక అందుకోసం టాస్కుల ప్రక్రియ మొదలు పెడతాడు.
అయితే ప్రతీ సారి టాస్క్ ఏంటో చెప్పాక.. ఎవరు ఈ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తారో నిర్ణయించుకోండంటూ.. సభ్యులకు చెప్పే బిగ్ బాస్.. ఈసారి మాత్రం కాస్త ఉల్టా పుల్టాగా రూల్ పెట్టాడు. టాస్క్ ఏంటో చెప్పకుండా.. మొదటి టాస్క్‌లో నలుగురుకి అవకాశం ఉంటుందని… ఆ నలుగురు ఎవరో.. కెప్టెన్ సమక్షంలో నిర్ధారించుకోండంటూ.. చెబుతాడు.
దీంతో ఎప్పటిలానే.. అమర్ నేను ఆడతా అంటూ.. ఎగసెగసి పడతాడు. అమర్‌కు తోడు.. తన బెస్ట్ ఫ్రెండ్ శోభ కూడా.. మొదటి టాస్క్ అడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ కెప్టెన్ భోళె కు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. దీంతో మరో సారి తనలోని అపరిచితుడిని బయట పెడతడు అమర్. పోయిన వారం అవసరం లేదని కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ను శివాజీకి ఇచ్చిన వాడికి.. ఈ వారం అది అవసరమా అన్నట్టు మాట్లాడుతాడు. భోళెతో మాటల యుద్ధానికి దిగుతాడు. బోళె కూడా ఎప్పటిలాగే.. అటు అమాయకపు మాటలతో… తిక తిక వేషాలతో అమర్‌కు ఆన్సర్ ఇవ్వలేక సైలెంట్ అయిపోతాడు. దీంతో ఫస్ట్ టాస్క్ కోసం.. ప్రియాంక, శోభ, అమర్, తేజ ఫైనల్ అవుతారు.
వీళ్ల డిస్కషన్ తర్వాత సీన్లోకి వచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్సీ కంటెండర్స్ ఎన్నిక కోసం జరిగే ఫస్ట్ టాస్క్.. మైండ్ గేమ్‌కు సంబంధించిందని చెబుతాడు. రిజెల్ట్ ఏంటో గెస్ చేయాలని… అంటాడు. ఈ గేమ్‌లో భాగంగా.. నలుగురు పార్టిసిపెంట్స్‌కు కొన్ని వస్తువులు చూపిస్తానని.. అందులో ఏది మునుగుతుందో.. తేలుతుందో చెప్పాలని చెబుతాడు.
ఇక టాస్క్‌లో భాగంగా.. నలుగురు కంటెస్టెంట్స్ ప్రియాంక, శోభ, అమర్, తేజ పోడియం ముందు ఓ ఎక్వెరియంను ఏర్పాటు చేసిన బిగ్ బాస్.. అక్కడే ఉన్న బాక్సులో నుంచి.. ఒక్కో వస్తువును తీసి.. అది నీటిలో మునుగుతుందో.. లేదో కంటెస్టెంట్స్‌ను అడగాలని గౌతమ్‌కు చెబుతాడు. ఇక కంటెస్టెంట్స్ వారి పోడియం మీదున్న కార్డ్ బోర్తును… వారి ఆన్సర్ అనుగుణంగా.. సింక్ అయితే సింక్ వైపు.. ఫ్లోట్ అయితే ఫ్లోటింగ్ వైపు జరపాలని చెబుతాడు,
ఇక రసవత్తరంగా సాగిన ఈ టాస్కులో… ప్రియాంక 11 పాయింట్స్ సాధించి కెప్టెన్సీ కంటెడర్స్ టాస్క్‌లో ముందుకు వెళుతుంది. శోభ 10 పాయింట్లతో తాను కూడా.. కెప్టెన్సీ పోరులో బతికే ఉంటుంది. ఇక తేజ, అమర్ 8 పాయింట్స్‌తో టై అయిపోతారు. దీంతో వీరి మధ్య జిరిగిన కంటిన్యూ టాస్కులో.. తేజు విన్నర్ అవుతాడు. ఎప్పటిలానే.. తన తిక మక మైండ్‌తో అమర్ లూస్ అవుతాడు. టాస్క్ ముందు ఏ రేంజ్లో ఆడతా అంటూ… ఎగిరి పడతాడో… గేమ్ తర్వాత .. అందులో ఓటమి తర్వాత అంతలా ఢీలా పడతాడు.
దీంతో షరా మామూలుగానే.. శోభ, ప్రియాంక అమర్ చూట్టూ చేరి తనను ఓదార్చే పని పెట్టుకుంటారు. వారి ఓదార్పు చూసిన అమర్ మరింతగా ఏడుస్తాడు. తను దేనికి పనికిరానని.. అంటూనే.. కావాలనే తనను తొక్కేస్తన్నారని నాన్ సింక్ మాటలు మాట్లాడతాడు.
ఇక బీబీ కెప్టెన్సీ మారథాన్ రెండో టాస్క్‌లో .. ప్రశాంత్, ప్రిన్స్ , అమర్ , గౌతమ్‌లు పోటీకి దిగుతారు. వీరికి క్యూబిక్స్ సెట్ చేయమని..బయట ఉన్న క్యూబ్‌కు ఎమ్టీ బాక్సులో దూర్చి పజిల్ పూర్తి చేయమని చెబుతాబు. ఇక ఈ టాస్క్‌లో అందర్నీ షాక్ చేస్తూ… చాకచక్యంగా.. గేమ్‌ను చాలా తొందరగా ఫినిష్ చేస్తారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. దీంతో హౌస్‌లో ఉన్న సభ్యులందర్నీ షాక్ అయ్యేలా చేయడమే కాదు.. నేరుగా కెప్టెన్సీ కంటెడర్‌గా ఎన్నికవుతాడు. ఆ తరువాత యావర్ తన పజిల్ ఫినిష్ చేస్తాడు. ఇక చివరగా రతిక ఫినిష్ చేయడంతో.. తను అమర్ లాగే.. గేమ్ నుంచి బయటికి వస్తుంది.
ఇక అమర్ పరిస్థితి ఇలా ఉంటే.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌తో ఎంట్రి ఇచ్చిన అశ్విన కూడా.. తన ఆటను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టే కనిపిస్తుంది. ఎంత సేపు… తనను వాళ్లు ఇలా అన్నారు.. తనతో వీళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారని.. బోళెకు.. అమర్‌కు చెప్పడమే తప్పా… గేమ్‌లో పార్టిసిపేషన్ మాత్రం పెంచుకోలేకుండా ఉంది.
మరో పక్క శివాజీ తన సపోర్ట్స్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. మొదట ప్రశాంత్తో మొదలైన తన టీం… తర్వాత ప్రిన్స్ వరకు చేరించి. ఇక తాజాగా ఎపిసోడ్ చూస్తుంటే.. తేజ, రతిక , గౌతమ్,బోళె కూడా ఈయన టీంలో జాయిన్ అయినట్టు అనిపిస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే..! హౌస్‌లో కాస్త ఎంటర్‌టైనర్ గా పేరున్న తేజ.. శోభపై సీరియస్ అవుతాడు. క్యూబికల్ టాస్క్‌లో రతిక ఓడిపోగా… ఆఫ్టర్ టాస్క్ అమర్‌లా తిండి మానేసి.. బిగ్ బాస్‌ను రిక్వెస్ట్ చేయు అంటూ.. ఏదో కామెడీ చేస్తాడు. అది కాస్తా శోభ చెవిన పడడంతో .. దాన్ని ఓసీన్‌గా చేసే ప్రయత్నం చేస్తుంది శోభ. దీంతో ఆమెపై ఓ రేంజ్‌లో ఎగిరి దునికినంత పని చేస్తాడు తేజ.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..