AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటుంది’.. శివాజీ పంచ్.. శోభా వర్సెస్ తేజ..

తాజాగా విడుదలైన ప్రోమోలో తేజ వర్సెస్ శోభా.. గట్టిగానే ఫైట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ సహనంగా.. ఎంటర్టైన్ చేస్తూ కనిపించే తేజ.. శోభాపై పెద్ద పెద్దగా అరిచేశాడు. 'ఏయ్ పోవే.. పద్దాకలా అరుస్తావ్.. హే పో లోపలికి' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మొదటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం శోభాకు మించి ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ అరిచేశాడు తేజ.

Bigg Boss 7 Telugu: 'ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటుంది'.. శివాజీ పంచ్.. శోభా వర్సెస్ తేజ..
Bigg Boss 7 Telugu 2nd Prom
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2023 | 7:13 PM

Share

కెప్టెన్సీ కంటెండర్ కోసం వరుసగా ఇంట్రెస్టింగ్ టాస్కులు ఇస్తున్నాడు బిగ్‏బాస్. ఈరోజు విడుదలైన మొదటి ప్రోమోలో ఫిజికల్ కాకుండా మైండ్ గేమ్ ఇచ్చాడు. నీటిలో ఏది తేలుతుంది ? ఏది మునుగుతుంది ? అంటూ కొన్ని వస్తువులను పంపించాడు. ఇక ఫస్ట్ ప్రోమో చూస్తే తేజ వర్సెస్ అమర్ దీప్, గౌతమ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తేజ వర్సెస్ శోభా.. గట్టిగానే ఫైట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ సహనంగా.. ఎంటర్టైన్ చేస్తూ కనిపించే తేజ.. శోభాపై పెద్ద పెద్దగా అరిచేశాడు. ‘ఏయ్ పోవే.. పద్దాకలా అరుస్తావ్.. హే పో లోపలికి’ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. మొదటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం శోభాకు మించి ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ అరిచేశాడు తేజ. అసలు ప్రోమోలో ఏం జరిగిందంటే ?. బిగ్‏బాస్ మారథాన్ లో భాగంగా బిగ్‏బాస్ కంటెస్టెంట్లకు మరో టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం కంటెస్టెంట్స్ డబ్బాలు సెట్ చేయాల్సి ఉంటుంది.

కానీ బాక్సులను సెట్ చేసేందుకు వాటిని ఏమాత్రం పైకి లేపకూడదు. అలా ఎత్తకుండా ఒక కలర్ బాక్సు కింద మరో కలర్ వచ్చేలా రూబిక్స్ క్యూబ్ సెట్ చేసినట్లుగా చేయాలి. ఇందులో ప్రశాంత్, యావర్, గౌతమ్, రతిక పోటీ పడ్డారు. అయితే ముందుగా కేవలం 10 సెకన్స్ లోపే ప్రశాంత్ బాక్సులను సెట్ చేసి గంట కొట్టేశాడు. ఆ తర్వాత యావర్ సెట్ చేశాడు. ఇక మూడో స్థానంలో గౌతమ్ నిలవగా.. బజర్ మోగే సమయానికి సైతం సెట్ చేయలేకపోయింది రతిక. అయితే గేమ్ అయిపోయిన తర్వాత రతికను నవ్వించే ప్రయత్నం చేశాడు తేజ.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఆ సమయంలో తేజ మాట్లాడిన మాటలను ప్రోమోలో చూపించలేదు కానీ.. తేజ మాటలకు మాత్రం శోభా రెచ్చిపోయింది. పర్సనల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టి అలా అన్నాడు.. ప్రతిదానికి అలా అనడం ఏంటీ అంటూ వెళ్లిపోయింది. ఓడిపోయాడు అనే మాట నా నుంచి వచ్చిందా అంటూ రతికను తేజ అడుగుతుంటే నేను విన్నాను తేజ అంటూ శోభా చెప్పుకొచ్చింది. దీంతో సహనం కోల్పోయిన తేజ.. ‘హే పోవే అమ్మ.. పద్దాకలా వచ్చి అరుస్తావ్.. హే పో లోపలికి.. సంబంధం లేకుండా అరుస్తావ్ ఏంటీ.. ప్రతిసారి నాకు ఇదేంటీ’ అంటూ అరిచేశాడు. దీంతో తిరిగి వచ్చిన శోభా.. వచ్చి రా మాట్లాడదాం నువ్వు ఏమన్నావో అంటూ పంచాయతీకి పిలిచింది.

లేదు పో అంటూ తేజ లోపలికి వెళ్తుంటే భయంతో పోతున్నావ్ అంటూ రెచ్చగొట్టింది శోభా. దీంతో ఏమి లేనిదాన్ని పెద్దది చేయకు అని తేజ అంటే ఎందుకు వెళ్లిపోతున్నావ్ అంటూ సాగదీసింది శోభా. నేను ఏమన్నానో రతికతో చెప్పించు అంటూ తేజ అనగా.. అటుగా వచ్చిన శివాజీని చూస్తు ఏంటన్నా ఇది ప్రతిదానికీ.. నేనేదో రతికతో సరదాగా అంటే దాన్ని ఇష్యూ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో.. సర్వత్రా వర్జయేత్.. ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటుంది.. వదిలేసేయండి అంటూ కౌంటరిచ్చాడు శివాజీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం