Bigg Boss 7 Telugu: తేజ మైండ్ గేమ్ అదరగొట్టేశాడు.. కెప్టెన్ కావాలంటే తెలివితేటలు ఉండాల్సిందే..
ఆడే ప్రతి గేమ్ లో ఎవరు గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారని బిగ్బాస్ తెలిపాడు. అలాగే లాస్ట్ వచ్చినవారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారని చెప్పాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. మొదట కొన్ని రకాల వస్తువులను కంటెస్టెంట్లకు చూపిస్తారు. అవి నీటిలో వేస్తే తేలుతాయో లేక మునుగుతాయో సరిగ్గా గెస్ చేయాలన్నమాట. తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా టేస్టీ తేజ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక వచ్చారు. ఇక ఈ గేమ్ లో గౌతమ్ వస్తువులను చూపిస్తూ
బిగ్బాస్ 8వ వారం నామినేషన్స్ ఎంత రసవత్తరంగా జరిగాయో చూశాం. సోమవారం, మంగళవారం రెండు రోజులు హౌస్ లో నామినేషన్స్ హీట్ కొనసాగింది. ఇక ఎప్పటిలాగే నామినేషన్స్ లో బూతులు మాట్లాడుతూ.. నిజాంగానే కొట్టుకుంటారా ?.. అనేట్టుగా ఒక్కొక్కరు పర్ఫామెన్స్ చేశారు. ఇక ఇప్పుడు హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీపడుతున్నారు హౌస్మేట్స్. అయితే ఎప్పటిలాగే ఫిజికల్ గేమ్ కాకుండా.. మైండ్ గేమ్ ఇచ్చారు బిగ్బాస్. శారీరకంగానే కాదు.. మానసికంగానూ హౌస్మేట్స్ ఎంత చురుగ్గా ఆడేలా టాస్కు పెట్టాడు బిగ్బాస్. ముఖ్యంగా ఈ టాస్కులో తేజ అదరగొట్టేశాడు. తన కామెడీ టైమింగ్తో ఎప్పుడూ అలరించే తేజ.. టైమ్ వచ్చినప్పుడు మాత్రం తానేంటో నిరూపించుకుంటున్నాడు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఆడే ప్రతి గేమ్ లో ఎవరు గెలుస్తారో వారు ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడే కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారని బిగ్బాస్ తెలిపాడు. అలాగే లాస్ట్ వచ్చినవారు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకుంటారని చెప్పాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. మొదట కొన్ని రకాల వస్తువులను కంటెస్టెంట్లకు చూపిస్తారు. అవి నీటిలో వేస్తే తేలుతాయో లేక మునుగుతాయో సరిగ్గా గెస్ చేయాలన్నమాట. తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా టేస్టీ తేజ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక వచ్చారు. ఇక ఈ గేమ్ లో గౌతమ్ వస్తువులను చూపిస్తూ మునుగుతుందా లేక తేలుతుందా అని అడగ్గా.. ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
View this post on Instagram
ముందుగా ఫైవ్ స్టార్ చాక్లెట్, ఐస్ ముక్క, శనక్కాయ, పుచ్చకాయ, స్ర్పైట్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాస్ ఇలా రకరకాల వస్తువులను నీటిలో వేసి చూపించారు. ఈ టాస్కులో ఎక్కువగా రాంగ్ ఆన్సర్స్ చెప్పి ప్రియాంక, శోభా గేమ్ నుంచి ఔట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత అమర్, తేజ ఇద్దరూ పోటీ పడగా.. రెండు ప్రశ్నలు అడగ్గా.. తేజ రెండూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పగా.. అమర్ ఒకటి ఆన్సర్ చెప్పాడు. ఇక ఆ తర్వాత బజర్ మోగింది. అయితే గౌతమ్ విన్నర్ ఎవరనేది డిసైడ్ చేయకుండా.. ఇంకో రౌండ్ పెట్టాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తేజ రియాక్ట్ అవుతూ బజర్ మోగితే గేమ్ అయిపోయిందని అర్థం.. ఇప్పుడు నీ డెసిషన్ ప్రకారం ఎవరు గెలిచారో చెప్పలేకపోతే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఇచ్చుకో అది నీ డెసిషన్ అంటూ పాయింట్ టూ పాయింట్ మాట్లాడాడు తేజ. ఇక ఆ తర్వాత అమర్ మాట్లాడుతూ.. బజర్ కొట్టినాక ఆడితే నీకేమైన నొప్పా నాకు అర్థం కాదన్నాడు. మొత్తానికి మైండ్ గేమ్ లో మాత్రం తేజ ఎప్పుడూ అదరగొట్టేస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.