Brahmamudi, October 25th episode: టుడే ఎపిసోడ్ ఫుల్ కామెడీ.. డైరెక్ట్ గా కావ్య హింట్లు ఇచ్చినా.. పట్టించుకోని రాజ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. ఇంకెన్నాళ్లు.. కళావతిపై ప్రేమను దాస్తావు అని అంటాడు. నేను ఎక్కడ ప్రేమించాను అని రాజ్ అనగా.. మన అమ్మ పర్మిషన్ తీసుకోకుండా.. కళావతి కోసం మన పని మనిషిని తీసుకొచ్చావ్ చూడు అని అంతరాత్మ అనగా.. అందులో ప్రేమ ఎక్కడ కనిపించింది అని రాజ్ అడుగుతాడు. మరి దోమ కనిపించిందా.. అని అంతరాత్మ అంటే.. మానవత్వం కనిపించిందని రాజ్ అంటాడు. మన్నూ మశానం కాదూ అని అంతరాత్మ ఎక్కిరిస్తుంది. ఏడిచినట్టు ఉంది. రేయ్ ఎన్నాళ్లు ఆత్మ వంచన చేసుకుంటావ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది. ఇంకెన్నాళ్లు.. కళావతిపై ప్రేమను దాస్తావు అని అంటాడు. నేను ఎక్కడ ప్రేమించాను అని రాజ్ అనగా.. మన అమ్మ పర్మిషన్ తీసుకోకుండా.. కళావతి కోసం మన పని మనిషిని తీసుకొచ్చావ్ చూడు అని అంతరాత్మ అనగా.. అందులో ప్రేమ ఎక్కడ కనిపించింది అని రాజ్ అడుగుతాడు. మరి దోమ కనిపించిందా.. అని అంతరాత్మ అంటే.. మానవత్వం కనిపించిందని రాజ్ అంటాడు. మన్నూ మశానం కాదూ అని అంతరాత్మ ఎక్కిరిస్తుంది. ఏడిచినట్టు ఉంది. రేయ్ ఎన్నాళ్లు ఆత్మ వంచన చేసుకుంటావ్.. గుడి ముంద బెగ్గర్ కూర్చున్నట్టు.. నీ చుట్టూ ఇగో వైఫై తిరుగుతూ ఉంది. దాన్ని పక్కకు పెడితే.. నువ్వు కళావతితో ఎంత ప్రేమలో ఉన్నావో తెలిసిపోతుంది అని అంతరాత్మ అనగా.. రాజ్ ప్రేమించడం లేదు.. లేదు అని గట్టిగా అరుస్తాడు. ఈలోపు కావ్య వచ్చి ఏం లేదు అని అడుగుతుంది. రాజ్ కళ్లు తెరుచుకుని చూస్తే అంతరాత్మ వెళ్లిపోతుంది. గాలి లేదు అని రాజ్ చెప్పగా.. ఫ్యాన్ లేదా వేసుకోవచ్చుగా అని కావ్య వేస్తుంది.
హనీ మూన్ కి వెళ్దామన్న కావ్య.. టెన్షన్ లో రాజ్:
ఇక ఆ తర్వాత కావ్య కావాలనే మాట్లాడుతూ కాసేపు రాజ్ ఆటపట్టిస్తుంది. రాజ్ మాత్రం చిరాకుగా ఉంటాడు. కానీ కావ్య మాత్రం రాజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. పెళ్లాంపై చేయి వేయడానికి కూడా సోమరితనం అని అంటుంది. ఈలోపు ఒక బుక్ తీసుకొచ్చి ప్రేమ యాత్రలకు వెళ్లాల్సిన ప్లేస్ లు అని చూపిస్తుంది. ప్రేమే లేదు ఇక యాత్రలకు ఎందుకు అని రాజ్ అంటాడు. ఇది తాతయ్య ఇచ్చారు.. సరేలే నేను తాతయ్యతో చెప్తాను అని అంటుంది కావ్య. ఏయ్ ఏమని చెప్తావ్.. ప్రేమ లేదని అని కావ్య అనగా.. అంటే ఇప్పుడు లేదని నీళ్లు నములుతూ ఉంటాడు రాజ్. అంటే వయసు అయిపోయేదాకా ఆగాలా.. గడువు అయిపోయేదాకా ఆగాలి కదా అని రాజ్ అంటాడు. మనల్ని హనీ మూన్ కి వెళ్లమని అంటున్నారు అని కావ్య అంటే.. పెళ్లైన ఇన్ని రోజులకా అని రాజ్ అంటాడు. నేను కూడా అదే అడిగాను.. ఎవర్ని అని రాజ్ అనగా.. తాతయ్యని అని కావ్య అంటుంది. ఏమన్నారని రాజ్ అనగా.. కడుపుతో ఉన్నవాళ్లే వెళ్తున్నారు.. మీకేమైంది అని అన్నారని కావ్య చెప్తుంది. దీంతో రాజ్ తల కొట్టుకుంటాడు.
రాజ్ గదికి వచ్చిన ఇందిరా దేవి.. టెన్షన్ లో పరుపు కింద పడేసిన రాజ్:
ఇక ఆ తర్వాత కావ్య తన పరుపు వేసుకుని పడుకుంటుంది. ఈలోపు ఇందిరా దేవి వచ్చి పిలుస్తుంది. ఏయ్ నాన్నమ్మ పిలుస్తుంది అని రాజ్ టెన్షన్ పడతాడు. ఏయ్ పరుపు తీసేయ్.. తీసేయ్.. నాన్నమ్మ చూస్తుందని రాజ్ అంటే.. నాకు ఓపిక లేదని కావ్య.. పక్క సర్దుతుంది. నానమ్మ చూస్తే కొంపలు అంటుకుంటాయని కావ్యని పక్కకు నెట్టి.. పరుపు తీసుకెళ్లి కింద పడేస్తాడు రాజ్. ఈ లోపు కావ్య వెళ్లి పాలు తీసుకుంటుంది. ఆ తర్వాత నేను ఎక్కడ పడుకోవాలి అని కావ్య అంటే.. పరుపు మీద పడుకో.. అంటాడు రాజ్. అయితే నా పరుపు నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని కావ్య అంటుంది. పరుపు కోసం కిందకు చూస్తాడు రాజ్. అక్కడ బాబాయ్ మీద పడుతుంది. దీంతో రాజ్ కంగారుగా కిందకు వెళ్తే.. అక్కడ రుద్రాణి, ధాన్య లక్ష్మి, రుద్రాణి, ఇందిరా దేవి కూర్చుని ఉండి.. ప్రకాష్ కోసం టెన్షన్ పడతారు. వాళ్లను చూసి.. టెన్షన్ పడతాడు రాజ్.
ప్రకాష్ మీద పరుపు పడేసిన రాజ్.. అయోమయంలో ఉన్న ప్రకాష్:
ఈలోపు రుద్రాణి జోక్స్ వేస్తూ ఉంటుంటి. అప్పుడే కిందకు వచ్చిన రాజ్ ని బాబాయ్ ని చూశావా అని అపర్ణ అడిగితే.. ఇందాక భోజనాల దగ్గర చూశాను. ఏడవకు పిన్నీ.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూస్తానని అంటాడు రాజ్. ఈలోపు ప్రకాష్ దగ్గరకు వెళ్లిన రాజ్.. బాబాయ్ లేగు.. సరిగ్గా నేను పరుపు కింద పడేసే టైమ్ లోనే నువ్వు వచ్చి దాని కింద పడుతున్నావ్.. ఏంటో అని రాజ్ బాధ పడుతూ ఉంటాడు. లేచాక పరుపు ఎక్కడిది అంటే ఏం చెప్పాలి అని అంటాడు. ఏం చెప్పాలి అని పక్కన పడేస్తాడు పరుపు. ఇక ప్రకాష్ ని ఎంత లేపినా లేవడు. ఆ తర్వాత కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద కొడితే లేస్తాడు ప్రకాష్. ఇక ప్రకాష్ ని లోపలికి తీసుకొస్తాడు రాజ్. ఎక్కడికి వెళ్లారని అడిగితే స్వర్గానికి అని సమాధానం చెప్తాడు ప్రకాష్. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏమైందిరా అని ఇందిరా దేవి అని అడగ్గా.. వాకింగ్ కి అని వెళ్లి గార్డెన్ లో నిద్ర పోతున్నాడని రాజ్ చెప్తాడు. ఇక ధాన్య లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది.
రాజ్ ని ఓ ఆట ఆడుకుంటూ.. బుర్ర తినేసిన కావ్య:
ఆ తర్వాత గదిలోకి వచ్చిన రాజ్ ని ఇంత సేపు ఎక్కడికి వెళ్లారని కావ్య అడిగితే.. ఆ.. స్వర్గానికి అని చెప్తాడు రాజ్.. ఏంటి అని కావ్య షాక్ అవుతుంది. ఏది నా పరుపు ఏది అని కావ్య అడుగుతుంది. చుట్టీ చుట్టీ బయట పడేసానని రాజ్ అంటాడు. అదేమో బాబాయ్ నెత్తిన పడింది.. హాల్లో ఎవరు చూసినా ప్రమాదమే అందుకే పక్కన పడేసాను అని రాజ్ చెప్తాడు. హా హా.. మీ అంతరార్థం మొత్తం అర్థమైందని కావ్య అంటుంది. మీరు పరుపు పడేస్తే నేను ఖచ్చితంగా మీ పక్కనే పడుకుంటాననే కదా.. మీరు ఆ పని చేశారు అని కావ్య అంటుంది. ఆ తర్వాత కావ్య కావాలనే ఓవరాక్షన్ చేస్తుంది. ఇక ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ జరుగుతూ ఉంటుంది. కావాలనే రాజ్ బుర్ర తినేస్తుంది కావ్య.