Bigg Boss 7 Telugu: షాకిస్తోన్న బిగ్‌ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్‌.. లిస్టులో టాప్‌ కంటెస్టెంట్స్‌

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఏడో సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఉల్టా పుల్టా అంటూ ఆరంభం నుంచి ఊదరగొట్టిన నాగార్జున అందుకు తగ్గట్టుగానే ఎలిమినేట్‌ అయిన రతికా రోజ్‌ను మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమెను ఎవరూ నామినేట్‌ చేయకుండా స్పెషల్‌ పవర్స్‌ కూడా ఇచ్చాడు. ఇక ఎప్పటిలాగే ఎనిమిదో వారం నామినేషన్స్‌ కూడా హోరా హొరీగా నడిచాయి

Bigg Boss 7 Telugu: షాకిస్తోన్న బిగ్‌ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్‌.. లిస్టులో టాప్‌ కంటెస్టెంట్స్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 26, 2023 | 1:25 PM

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో ఏడో సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఉల్టా పుల్టా అంటూ ఆరంభం నుంచి ఊదరగొట్టిన నాగార్జున అందుకు తగ్గట్టుగానే ఎలిమినేట్‌ అయిన రతికా రోజ్‌ను మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమెను ఎవరూ నామినేట్‌ చేయకుండా స్పెషల్‌ పవర్స్‌ కూడా ఇచ్చాడు. ఇక ఎప్పటిలాగే ఎనిమిదో వారం నామినేషన్స్‌ కూడా హోరా హొరీగా నడిచాయి. హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఎనిమిదో వారం నామినేషన్‌ ప్రక్రియ విషయానికొస్తే.. ఎప్పటిలాగే ఒక్కొక్కరు ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా కారణాలను చెప్పి వారి ఫొటోలను మంటల్లో కాల్చివేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ- శోభా శెట్టిల మధ్య పెద్ద వాగ్యుద్దమే నడిచింది. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌- గౌతమ్‌ కృష్ణలు ఒకరినొకరు తిట్టుకున్నారు.

ఇక గతవారంలో బూతులతో తిట్టుకున్న భోలే షావళి- ప్రియాంక జైన్‌ ఈ వీక్‌లోనూ గొడవ పడ్డారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా వాగ్వాదానికి దిగడంతో నామినేషన్స్ హోరాహోరీగా నడిచాయి. కాగా సోషల్‌ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఎనిమిదో వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్‌ అయ్యారని తెలిసింది. శివాజీ, ప్రియాంక జైన్‌, అమర్ దీప్‌ చౌదరి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్ కృష్ణ, భోలే షావలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 12 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. అందులో కెప్టెన్‌ హోదాలో అంబటి అర్జున్‌, శోభా శెట్టి, టేస్టీ తేజా, అశ్విని శ్రీ, సందీప్‌ మినహా అందరూ నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌ నుంచి నామినేట్‌ కాకుండా తప్పించుకుంటోన్న సందీప్‌ మాస్టర్‌ ఎనిమిదో వారం కూడా నామినేషన్స్‌లోకి రాలేదు. అదృష్టానికి ఆధార్‌ కార్డులా ఉన్న ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ ఎక్కువ వారాలు నామినేట్‌ కాని కంటెస్టెంట్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. వీళ్లతో పాటు రీఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కు స్పెషల్‌ పవర్స్‌ ఉండడంతో ఎవరూ ఆమెను నామినేట్‌ చేయడానికి వీల్లేదు.

ఇవి కూడా చదవండి

నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌజ్ లో రచ్చ ..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మళ్లీ భోలే వర్సెస్ ప్రియాంక..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..