Brahmamudi, October 24th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో పని మనిషి రచ్చ.. నన్ను పిచ్చిదాన్ని చేయొద్దని బాధ పడిన అపర్ణ!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. పని మనిషిని తిరిగి పనిలో పెట్టినందుకు ఇంట్లో రచ్చ కొనసాగుతూ ఉంటుంది. పని మనిషిని ఇంట్లోకి తీసుకు రావడంతో ఆవేశంలో ఊగిపోతుంది అపర్ణ. దానికి తోడు మధ్యలో పుల్లలు పెడుతుంది రుద్రాణి. ఇక ఇందిరా దేవి కూడా రుద్రాణిని పట్టుకుని చెడా మడా వాయించేస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని వీడు చేసిన పనిని ఇంత వంకరగా చూస్తారేంటి? ఏనాడైనా వంటగదిలో అడుగు పెట్టిన మొహమేనా అది? అని ఇందిరా దేవి ఫైర్ అవుతుంది. అపర్ణ.. రాను రాను రుద్రాణి మందరలా మారిపోయి..

Brahmamudi, October 24th episode: దుగ్గిరాల ఫ్యామిలీలో పని మనిషి రచ్చ.. నన్ను పిచ్చిదాన్ని చేయొద్దని బాధ పడిన అపర్ణ!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 24, 2023 | 11:02 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. పని మనిషిని తిరిగి పనిలో పెట్టినందుకు ఇంట్లో రచ్చ కొనసాగుతూ ఉంటుంది. పని మనిషిని ఇంట్లోకి తీసుకు రావడంతో ఆవేశంలో ఊగిపోతుంది అపర్ణ. దానికి తోడు మధ్యలో పుల్లలు పెడుతుంది రుద్రాణి. ఇక ఇందిరా దేవి కూడా రుద్రాణిని పట్టుకుని చెడా మడా వాయించేస్తుంది. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని వీడు చేసిన పనిని ఇంత వంకరగా చూస్తారేంటి? ఏనాడైనా వంటగదిలో అడుగు పెట్టిన మొహమేనా అది? అని ఇందిరా దేవి ఫైర్ అవుతుంది. అపర్ణ.. రాను రాను రుద్రాణి మందరలా మారిపోయి.. ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఈ మందర మాటలకు నువ్వు ఇన్ఫులెన్స్ కావద్దు. ఏ మన కొడుక్కి ఇంట్లో నిర్ణయం తీసుకునే హక్కు లేదా? లేదంటే వాడు భార్యను కష్టపడి చూసుకోవడం నీకు నచ్చడం లేదా? అని సుభాష్ అంటాడు.

రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ.. షాక్ లో రుద్రాణి:

నేను ఏమన్నాను.. నాకు ఒక మాట చెప్పి చేసి ఉంటే సరిపోది కదా అని అన్నాను అని అపర్ణ అంటుంది. సారీ మమ్మీ నువ్వు అర్థం చేసుకుంటావ్ అనుకున్నా అని రాజ్ అంటాడు. రాజ్ నీకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని నేను అనడం లేదు.. కానీ ఈ రుద్రాణి లాంటి వాళ్లు కూడా గొంతెత్తి మాట్లాడే అధికారం కల్పించద్దు అని చెబుతున్నా. అని అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మా మధ్య గొడవ జరిగితే అందరికన్నా ఎక్కువ ఆనంద పడేది నువ్వేనని నాకు తెలీనంత అమాయకురాలిని నేనే కాదు అని అపర్ణ.. రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈలోపు మేఖైల్ ని బెయిల్ పై విడుదల చేయడానికి డబ్బులు కావాలని ఎవరికో ఫోన్ చేసి అడుగుతూంటాడు రాహుల్. ఇదంతా రుద్రాణి వింటుంది. ఏంటి రాహుల్ మళ్లీ ఏం చేశావ్? అని రాహుల్ ని అడుగుతుంది రుద్రాణి. దేని గురించి మమ్మీ అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు రాహుల్. నా దగ్గర నటించకు నేను నీ కన్న తల్లిని.. మొన్న నగల విషయంలో కూడా స్వప్న అబద్ధం చెప్పి నిన్ను సేవ్ చేసింది. అంత డబ్బు నీకు ఎందుకు కావాల్సి వచ్చింది? అని రాహుల్ ని అడుగుతుంది రుద్రాణి. మమ్మీ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు ఇది చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నేను చూసుకుంటా అని రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇవి కూడా చదవండి

స్వప్న చేత బలవంతంగా ట్యాబ్లెట్స్ మింగించిన కనకం:

ఇక బెడ్ రూమ్ లో కూర్చొని మొబైల్ లో గేమ్ ఆడుతూ ఉంటుంది స్వప్న. అప్పుడే వచ్చిన కనకం.. ఏంటి నువ్వేమన్నా చిన్న పిల్లవా.. ట్యాబ్లెట్స్ వేసుకో అని అంటుంది స్వప్న. నిన్ను చూసుకోవడం తప్ప నాకు ఇంకేం పనులు ఉంటాయ్.. ముందు ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెబుతుంది కనకం. అమ్మ ఏంటి ఇలా తగులుకుంది. ఇప్పుడు ఇవి వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఆలోచిస్తుంది స్వప్న. ఇక గదిలోకి వచ్చిన కావ్య.. మీరు చేసిన పనేంటి? అని అడుగుతుంది. పని మనిషి శాంత గురించా.. అని రాజ్ అడుగుతాడు. శాంత ప్లేస్ లో వేరే ఒకరు వచ్చి ఉంటే పర్వాలేదు కానీ.. అత్తయ్య గారికి తప్పుగా అనిపించిందని కావ్య అనగా.. ఎందుకు అని రాజ్ అడుగుతాడు. ఎందుకేంటి ఆవిడకు నచ్చకనే కదా పనిలోనుంచి తీసేశారు.. ఇప్పుడు మీరు ఆవిడను పర్మిషన్ తీసుకోకుండా పనిలోకి పెట్టుకుంటే నా తప్పు కాదా అని కావ్య అంటుంది.

నన్ను నలుగురిలో పిచ్చిదాన్ని చేయకు.. బాధ పడిన అపర్ణ:

శాంతాని పనిలోనుంచి పంపించేయండి అని కావ్య అనగా.. ఇంట్లో పనంతా చేయాలంటే నీకు కష్టం అవుతుంది కదా అని రాజ్ అంటాడు. కానీ రాజ్ కావ్యని కన్విన్స్ చేస్తాడు. ఇక రాజ్ ప్రేమను అనుమానిస్తుంది కావ్య. ఇక కనకం చీరల్ని కత్తిరించినందుకు.. రుద్రాణిని ఒక రేంజ్ లో తిడుతుంది కనకం. ఆ తర్వాత రుద్రాణి చీరల్ని కత్తెరతో కట్ చేసేస్తుంది. ఆ తర్వాత అపర్ణ దగ్గరకు వస్తాడు రాజ్. కానీ అపర్ణ రాజ్ ని ఎగతాళి చేస్తుంది. నన్ను అర్థం లేని స్థాయికి వెళ్లిపోయావ్. నువ్వు కూడా భార్య రాగానే మారిపోయావ్. అది కాదు మమ్మీ కళావతి ఒక్కర్దే పని చేసుకుంటుంది కదా పని మనిషిని రప్పించా.. అని రాజ్ అనబోతే.. చూసిన నీకే అలా ఉంటే.. 25 ఏళ్లుగా ఆ పని చేస్తున్న నాకు తెలీదా? అని అపర్ణ అంటుంది. తెలిసి కూడా మరి ఎందుకు వద్దు అంటున్నావ్ మమ్మీ అని రాజ్ అనగా.. తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయాలి అనే నువ్వు.. నీ భార్యకు వేస్తే తప్పేంటి. నేను వేస్తే అది నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది. నువ్వు మారావా లేక నేను మారానా అని అపర్ణ రాజ్ ని నిలదీస్తుంది. నన్ను నలుగురిలో పిచ్చిదాన్ని చేయకు అని అపర్ణ బాధ పడుతుంది. రాజ్ చెబుతున్నా.. అపర్ణ ఇక వినిపించుకోదు.

కాస్ట్ లీ శారీస్ చిరిగిపోయాయని బాధ పడిన రుద్రాణి:

గదిలోకి వస్తుంది రుద్రాణి. వచ్చేసరికి కనకం బెడ్ మీద పడుకుంటుంది. చీరలన్నీ కత్తిరించి పడేసినా ఇక్కడే ఉంటుందని అపర్ణ నెత్తి కొట్టుకుంది. ఆ తర్వాత స్నానం చేయడానికి లోపలికి వెళ్తుంది రుద్రాణి. ఆ తర్వాత కింద పడిపోయిన చీరని లోపల పెట్టబోతే అవి చిరిగిపోయి ఉంటాయి. అవి చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. ఇక నిద్రలోనుంచి లేచి చూస్తుంది కనకం. నా కాస్ట్ లీ చీరలన్నీ చిరిగిపోయాయి అని రుద్రాణి చెప్పబోతే.. అయ్యో అనుకున్న ఇది దాని పనే అని అంటుంది. ఆ మాయదారి ఎలుకనే కొట్టేసిందని అంటుంది కనకం. కనకం అని గట్టిగా అరుస్తుంది రుద్రాణి. ఇక్కడ నేను పిల్లిలా దాని కోసం వేయిట్ చేస్తున్నా.. ఈసారి వస్తే దాన్ని కొట్టి.. పరలోకానికి వెళ్తుందని కనకం అంటుంది. మా వదిన చీరలకంటే.. నావే ఎక్కువ రేటు ఉంటాయని బాధ పడుతుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి బాధ పడుతూ వెళ్తుంది రుద్రాణి.

అపర్ణ మాటలకు బాధ పడుతున్న రాజ్.. ఎగతాళి చేస్తున్న అంతరాత్మ:

నెక్ట్స్ ప్రకాష్ తిన్నది అరక్క.. అటూ ఇటూ నడుస్తూ ఉంటాడు. ఈలోపు ధాన్య లక్ష్మి పిలిచి.. బెడ్ రూమ్ అటు కాదు ఇటు అని చెప్తుంది. నాకు తెలుసు.. కాస్త అలా బయటకు వాకింగ్ కి వెళ్దాం అని చెప్తాడు. సరే అని ఇంటి చుట్టూ తిరుగుతాడు ప్రకాష్. ఆ తర్వాత బెడ్ రూమ్ లో కూర్చున్న రాజ్.. తల్లి అపర్ణ మాటలను గుర్తుకు తెచ్చుకుని బాధ పడతాడు. ఈలోపు రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి.. రాజ్ ని ఎగతాళి చేస్తాడు. అంతే ఈరోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!