Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ కంటే బడా ఆఫర్‌ కొట్టేసిన సుబ్బు.. పవన్ కల్యాణ్‌ ఓజీ సినిమాలో శుభశ్రీ

శుభ శ్రీ రాయగురు.. బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభానికి ముందు ఈ అందాల తార గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఎప్పుడైతే హౌజ్‌లోకి అడుగుపెట్టిందో ఈ ముద్దుగుమ్మ చాలా మందికి ఫేవరెట్‌ అయ్యింది. తన క్యూట్‌ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌కు గ్లామర్‌ లుక్‌ను తీసుకొచ్చింది. టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేసింది. అయితే అనూహ్యంగా ఐదో వారమే

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌ కంటే బడా ఆఫర్‌ కొట్టేసిన సుబ్బు.. పవన్ కల్యాణ్‌ ఓజీ సినిమాలో శుభశ్రీ
Subhasree Rayaguru, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2023 | 8:54 AM

శుభ శ్రీ రాయగురు.. బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభానికి ముందు ఈ అందాల తార గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఎప్పుడైతే హౌజ్‌లోకి అడుగుపెట్టిందో ఈ ముద్దుగుమ్మ చాలా మందికి ఫేవరెట్‌ అయ్యింది. తన క్యూట్‌ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ హౌజ్‌కు గ్లామర్‌ లుక్‌ను తీసుకొచ్చింది. టాస్కుల్లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేసింది. అయితే అనూహ్యంగా ఐదో వారమే ఎలిమినేట్ అయి హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటోన్న శుభశ్రీ ఒక గోల్డెన్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ సినిమాలోనే ఛాన్స్‌ దక్కించుకుంది. ఆయన నటిస్తోన్న ఓజీ సినిమాలో సుబ్బు ఓ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సినిమా సెట్‌లో సందడి చేసింది సుబ్బు. డైరెక్టర్‌ సుజిత్‌తో కలిసి ఫొటోలు దిగింది. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘నాకెంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో నటిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. పవర్‌ స్టార్ అభిమానిగా నా సంతోషం మాములుగా లేదు. నాలో ఉన్న ట్యాలెంట్‌ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ సుజీత్ సార్‌, డీవీవీ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక అనుక్షణం నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తోన్న నా ఆడియెన్స్‌కు స్పెషల్‌ థ్యాంక్స్‌’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది శుభ శ్రీ.

ప్రస్తుతం శుభ శ్రీ షేర్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు, ఫాలోవర్లు సుబ్బుకు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ‘బిగ్‌ బాస్‌ కంటే పెద్ద ఆఫర్‌ కొట్టేశావ్‌ సుబ్బు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఒడిశాలో పుట్టిపెరిగిన శుభ శ్రీ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎల్ఎల్బీ కోర్సు పూర్తిచేసి లాయర్ అయిన శుభశ్రీ మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా గెలిచింది. 2022లో రుద్రవీణ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. అమిగోస్, కథ వెనక కథ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఏకంగా పవన్‌ కల్యాణ్‌ సినిమాలోనే ఛాన్స్‌ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

శుభ శ్రీ రాయగురు పోస్ట్ ఇదే..

బిగ్ బాస్ లో సుబ్బు..

బిగ్ బాస్ రీ ఎంట్రీ ఛాన్స్ వచ్చినా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.