Brahmamudi, October 26th episode: నిజం చెప్పేయబోతున్న కావ్య.. స్వప్న ఏం చేయబోతుంది?

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ ని పడుకోనివ్వకుండా కావ్య సెల్ ఫోన్ లో ఎక్కువగా సౌండ్ పెట్టి నిద్రపోతుంది. దీంతో సెల్ ఫోన్ ఆప్ చేయడం కోసం రాజ్ తిప్పలు పడతాడు. ఈలోపు కావ్య లేచి పెద్దగా కేకలు పెడుతుంది. కాసేపు ఇద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటారు. ఆ తర్వాత కావ్య నవ్వుతూ నిద్ర పోతుంది. ఇక అప్పూ కళ్యాణ్, అనామికలను తలుచుకుని బాధ పడుతుంది. ఈలోపు కళ్యాణే ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ అని అనగా.. మీ ఇంటి ముందు నుల్చున్నా.. అని అంటుంది. నేను, అనామిక దిగిన ఫోటోస్ ఉన్నాయి కదా.. వాటిల్లో మంచి ఫోటోలు ఏవో సెలక్ట్ చేసి..

Brahmamudi, October 26th episode: నిజం చెప్పేయబోతున్న కావ్య.. స్వప్న ఏం చేయబోతుంది?
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Oct 26, 2023 | 11:49 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో రాజ్ ని పడుకోనివ్వకుండా కావ్య సెల్ ఫోన్ లో ఎక్కువగా సౌండ్ పెట్టి నిద్రపోతుంది. దీంతో సెల్ ఫోన్ ఆప్ చేయడం కోసం రాజ్ తిప్పలు పడతాడు. ఈలోపు కావ్య లేచి పెద్దగా కేకలు పెడుతుంది. కాసేపు ఇద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటారు. ఆ తర్వాత కావ్య నవ్వుతూ నిద్ర పోతుంది. ఇక అప్పూ కళ్యాణ్, అనామికలను తలుచుకుని బాధ పడుతుంది. ఈలోపు కళ్యాణే ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ అని అనగా.. మీ ఇంటి ముందు నుల్చున్నా.. అని అంటుంది. నేను, అనామిక దిగిన ఫోటోస్ ఉన్నాయి కదా.. వాటిల్లో మంచి ఫోటోలు ఏవో సెలక్ట్ చేసి.. నాకు పంపించు అని అంటాడు. ఇక ఈ ఫొటోస్ చూసిన అప్పు.. వాటిని డిలీట్ చేస్తుంది.

అనామిక, కళ్యాణ్ ఫొటోలను ఎందుకు డిలీట్ చేస్తున్నావ్ అప్పు: కృష్ణమూర్తి

ఇది గమనించిన కృష్ణమూర్తి బాగానే ఉన్నాయి కదా.. వాటిని ఎందుకు డిలీట్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. దీంతో అప్పూ ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత అప్పూ పెద్దమ్మ వచ్చి.. డిలీట్ చేయాల్సి ఫోటోలు కాదే.. నీ మనసులో ఉన్న ఇష్టాన్ని అని చెప్తుంది. కళ్యాణ్ పై నీ ఇష్టాన్ని దూరం చేసుకుంటే.. ఫోన్ లో ఎన్ని ఫొటోలు ఉన్నా ఏమీ కాదని చెప్తుంది. చిరాకుతో అక్కడి నుంచి వెళ్లి పోతుంది అప్పు. ఈ సీన్ కట్ చేస్తే దుగ్గిరాల ఫ్యామిలీ.. స్వప్న సీమంతం కోసం ముహుర్తం పెట్టించడం కోసం పంతులు గారిని పిలించి అందరూ హాల్ లో కూర్చుంటారు. ఈలోపు వచ్చిన రుద్రాణి.. ఏంటి అందరూ హాల్ లో కూర్చున్నారు. పొద్దున్నే పంతుల్ని పిలిపించారు. కళ్యాణ్ పెళ్లి కోసం ముహుర్తం పెట్టిస్తున్నారా? అని అడుగుతంది. కళ్యాణ్ పెళ్లికి ముహుర్తం పెట్టించాలంటే.. అనామిక పేరెంట్స్ కూడా ఉండాలి కదా రుద్రాణి.. ఇది నీ కోడలు సీమంతం కోసం.. ఎప్పుడు చేయాలో ముహుర్తం చూస్తున్నామని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

స్వప్న సీమంతం కోసం ముహుర్తం పెట్టించిన ఇందిరా దేవి:

ఈలోపు పంతులు గారు ముహుర్తం పెట్టి చెప్తారు. రేపే సీమంతం అంటే కష్టం కదా అత్తయ్య.. చాలా పనులు ఉంటాయి కదా అని అపర్ణ అంటే.. మమ్మీ ఏం పనులు ఉంటాయో చెప్పండి.. మేమందరం ఉన్నాం కదా అన్నీ ఇన్ టైమ్ లోనే ఫినిష్ చేస్తాను అని చెప్తాడు రాజ్. ఇదంతా చూస్తున్న రుద్రాణి కంగారు పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి.. స్వప్నని ఇక్కడి నుంచి వెళ్లకుండా చేయాలి అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఏంటి రుద్రాణి మాట్లాడటం లేదని ఇందిరా దేవి అంటే.. అసలు నీ కోడలి సీమంతం గురించి మాట్లాడాల్సింది నువ్వు కదా అని అపర్ణ దేవి కూడా అంటుంది. అందరూ నిర్ణయం తీసుకున్నాక.. నాదేముందిలే వదినా.. నాకంత విలువ ఇచ్చేవాళ్లే అయితే పంతులు గారిని పిలిపించడానికి ముందే నాకు చెప్పేవాళ్లు. ఇలా అంతా అయిపోయాక కాదని రుద్రాణి అంటుంది. మరోవైపు ఇదంతా చూసి కావ్య, స్వప్న కంగారు పడుతూంటారు.

కడుపు విషయంలో నిజం చెప్పేస్తానన్న కావ్య:

కావ్య ఏంటి? అంత కోపంగా చూస్తుంది.. నాకు కడుపు లేదన్న విషయం చెప్పేస్తుందేంటి? అని స్వప్న మనసులో అనుకుంటుంది. ఈలోపు అమ్మా కావ్య.. మీ అక్క సీమంతం ఎలా జరిపిస్తావో నీ ఇష్టం. నీ చేతుల మీదగానే మొత్తం జరగాలని ఇందిరా దేవి అంటుంది. అక్కకి కడుపు లేదన్న విషయం చెప్పేయడమే మంచిదని కావ్య మనసులో అనుకుంటుంది. పండగలకే తన టాలెంట్ అంతా బయట పెట్టింది.. మరి తన అక్క సీమంతం అంటే చెలరేగి పోతుందని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్య సమాధానం ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఈలోపు అపర్ణా దేవి ఏంటి ఇంత మంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అని అడిగితే.. దాని గురించే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని కావ్య అంటుంది.

నిజం చెప్పబోతున్న కావ్యని.. లాక్కెళ్లిన స్వప్న:

కావ్య నిజం చెప్పబోతుంటే.. ఈలోపు స్వప్న అడ్డుకుంటుంది. చీర సెలక్ట్ చేద్దూవ్ పదా అని కావ్యని బలవంతంగా తీసుకెళ్తుంది. ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా? అని స్వప్న.. కావ్యని అడుగుతుంది. అంత మంది నీ మీద ప్రేమ చూపిస్తూ నీ సంతోషం కోసం సీమంతం చేయాలని అంతలా ఆశ పడుతున్నారు. వాళ్లను మోసం చేయడం కరెక్ట్ కాదు.. అందుకే నిజం చెప్పేస్తాను. అక్కా ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినిపించుకోను. ఇప్పటివరకూ వింటూనే వచ్చాను. ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావని అందర్నీ పిలిచి చెప్పబోతున్నారు. ఇది ఎంత పెద్ద మోసమో నీకు తెలీడం లేదని కావ్య అంటుంది. మోసం అని అరుస్తున్నావ్.. కానీ నిజం చెప్పిన తర్వత జరిగే దాన్ని నువ్వు ఎందుకు ఊహించలేక పోతున్నావ్ అని స్వప్న అంటే.. ఏం జరగబోతుంది అక్క.. తిడతారు పడు.. కానీ ఆ తర్వాత కోడలిగా ఒప్పుకుంటారు అని కావ్య అంటే.. అది మాత్రం జరగదు. ఇప్పటికే మా అత్తయ్య ఎప్పుడెప్పుడు తప్పు చేస్తానా.. ఇంట్లో నుంచి పంపించడానికి చూస్తుంది. ఇప్పుడు నాకు కడపు లేదని తెలిస్తే.. ఈ ఇంటి నుంచి తరిమేస్తుందని స్వప్న అంటుంది.

నా జీవితం నాశనం అవుతుంది కావ్య అర్థం చేసుకో: స్వప్న

అప్పుడు వేరు ఇప్పుడు వేరని కావ్య అంటే.. అని నువ్వు అనుకుంటున్నావ్.. కానీ జరిగేది వేరు.. నా కాపురమే కాదు నా జీవితమే నాశనం అవుతుందని స్వప్న అంటుంది. కానీ ఆ తర్వాత అయినా కష్టం కదా అక్కా అని కావ్య అడిగితే.. అందుకే ఈ నాటకాన్ని ముగిస్తా అని స్వప్న చెబుతుంది. సీమంతం అయినా తర్వాత అమ్మా వాళ్ల ఇంటికి వెళ్తాను కదా.. అక్కడ ఏదో ఒకటి చేసి అబార్షన్ అయ్యిందని నమ్మిస్తాను అని చెప్తుంది స్వప్న. అంటే మరో మోసం చేస్తావా అని కావ్య అంటే.. అది మోసం కాదని అంటుంది స్వప్న. నువ్వు చేసిందంతా తెలిసన రోజు ఇరుక్కుపోతావే అని కావ్య చెప్తుంది. కావ్య ప్లీజ్ అర్థం చేసుకో.. ఈ సారికి నేను చెప్పేది విను అని స్వప్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. నీ గురించి నాకు బాగా తెలుసు అక్క నీకు అవసరం అయితే కాళ్లు పట్టుకుంటావ్ లేదంటే మొహం కూడా చూడవు అని అంటుంది కావ్య. ఆ తర్వాత కావ్యని ఎలాగోలా కన్విన్స్ చేస్తుంది స్వప్న. ఆ తర్వాత కావ్య దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా నిజం చెప్పాలని అనుకుంటుంది. ఈలోపు ఇందిరా దేవి, అపర్ణ, ధాన్య లక్ష్మి, కనకం అందరూ సీమంతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..