Bigg Boss 7 Telugu: అర్జున్ ఫిజికల్ ఎటాక్.. ఎగిరిపడ్డ అశ్విని.. సందీప్ ఆట ముచ్చట్లు ఏంటో..
ఇక ఇప్పుడు మూడో టాస్కులో భోలే షావలి, అశ్విని, సందీప్ మాస్టర్, అర్జున్ తలపడ్డారు. ముందు రెండు టాస్కులు బుర్రకు పదునుపెట్టే టాస్కులు ఇచ్చిన బిగ్బాస్...ఇప్పుడు మూడో టాస్క్ మాత్రం ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ మూడో టాస్కులో తనకంటే బలవంతులైన ముగ్గురు అబ్బాయిలతో పోటీ పడింది అశ్విని. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అర్జున్, సందీప్, బోలే షావలితో గట్టిగానే పోటీపడింది. గేమ్ విషయానికి వస్తే.. తలకు స్పాంచీ హెల్మెట్ ధరించి దానితో వాటర్ నింపాల్సి ఉంటుంది.
బిగ్బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం కెప్టెన్సీ పోరు మరింత రసవత్తరంగా సాగుతుంది. వరుసగా ఇంట్రెస్టింగ్ టాస్కులు ఇస్తూ కెప్టెన్సీ పోటీదారులయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక, పల్లవి ప్రశాంత్ ఇద్దరూ కెప్టెన్సీ పోటీదారులుగా టాస్కులు గెలిచారు. ఇక ఇప్పుడు మూడో టాస్కులో భోలే షావలి, అశ్విని, సందీప్ మాస్టర్, అర్జున్ తలపడ్డారు. ముందు రెండు టాస్కులు బుర్రకు పదునుపెట్టే టాస్కులు ఇచ్చిన బిగ్బాస్…ఇప్పుడు మూడో టాస్క్ మాత్రం ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ మూడో టాస్కులో తనకంటే బలవంతులైన ముగ్గురు అబ్బాయిలతో పోటీ పడింది అశ్విని. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే అర్జున్, సందీప్, బోలే షావలితో గట్టిగానే పోటీపడింది. గేమ్ విషయానికి వస్తే.. తలకు స్పాంచీ హెల్మెట్ ధరించి దానితో వాటర్ నింపాల్సి ఉంటుంది.
సమయానుసారంగా షవర్ నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ నీటిని తాము ధరించిన స్పాంచీలలో పట్టి.. తమకు కేటాయించిన బౌల్ ను నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే కెప్టెన్ గా ఉన్న అర్జున్ ఈ వారంలోనూ పోటీపడ్డాడు. ఇక షవర్ నుంచి నీళ్లు వస్తున్న సమయంలో నలుగురు పోటీపడ్డారు. ఈ క్రమంలోనే అందరికంటే ఎక్కువగా హైట్, బలంగా ఉన్న అర్జున్ తోటివారిని పక్కకు తోసి పారేశాడు. తనకు ఎదురొచ్చిన వాళ్లను చేతులతో పక్కను నెట్టేశాడు. దీంతో అశ్విని ఎగిరిపడింది. అయితే ఆమెను పైకి లేపే ప్రయత్నం మాత్రం ఏ ఒక్కరు చేయలేదు. సంచాలక్ గా ఉన్న శివాజీ తనకున్న ఒక చేతితో ఆమెను పైకి లేపి సాయమందించారు.
View this post on Instagram
ఇక ఆ తర్వాత ఎప్పటిలాగే సందీప్ అమర్ దీప్ దగ్గర కూర్చొని ఆట ముచ్చట్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. ఆ పిల్లను ఎలా తోసేశాడు చూశారు కదా.. ఇలా మెడ పట్టి తోసేస్తున్నాడు అంటూ నీతులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక అదే సమయంలో వాష్ రూంలో అర్జున్ శివాజీతో మాట్లాడుతూ.. ఏంటీ మాఫియా మొత్తం వ్యతిరేకం అయిపోయింది. ఇంతకుముందు నో మాస్టర్ అనేవారు..ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారు అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.