Bigg Boss 7 Telugu: మరీ ఇలా తయారయ్యవేంటీ శోభా.. మోనితను మించిపోయావ్..

రోజు రోజుకు శోభా ప్రవర్తన మరింత దారుణంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ వారం రోజులలో శోభా హాస్ లో వాళ్లను టార్చర్ చేస్తుందనే చెప్పాలి. అనవసర విషయాల్లో కల్పించుకుని పెద్ద గొడవ చేస్తుంది. అందరి మీదకు నోరేసుకొని పడిపోతుంది. దీంతో శోభా దెబ్బకు హౌస్ మొత్తం అల్లాడిపోతుంది. అటు తన సీరియల్ బ్యాచ్‏తో ఉంటూనే వారితోనే గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇక మొన్నటివరకు తేజతో స్నేహంగా ఉన్న తేజకు నిన్నటి ఎపిసోడ్ లో చుక్కలు చూపించింది. రతికతో మాట్లాడుతుండగా ఎంటరై లొల్లి పెట్టుకుంది.

Bigg Boss 7 Telugu: మరీ ఇలా తయారయ్యవేంటీ శోభా.. మోనితను మించిపోయావ్..
Shobha Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 27, 2023 | 9:59 AM

బిగ్‏బాస్ సీజన్ 7లో రతిక తర్వాత అత్యంత ఎక్కువ నెగిటివిటీని సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారంటే శోభా శెట్టి మాత్రమే. మొదట్లో ఇంటి సభ్యులతో ఎంతో సన్నిహితంగా ఉంటూనే.. తనను నామినేట్ చేస్తే మాత్రం నానా హంగామా చేసేది. కార్తీక దీపం మోనిత ఆవహించినట్లుగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేస్తుంటుంది. రోజు రోజుకు శోభా ప్రవర్తన మరింత దారుణంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ వారం రోజులలో శోభా హాస్ లో వాళ్లను టార్చర్ చేస్తుందనే చెప్పాలి. అనవసర విషయాల్లో కల్పించుకుని పెద్ద గొడవ చేస్తుంది. అందరి మీదకు నోరేసుకొని పడిపోతుంది. దీంతో శోభా దెబ్బకు హౌస్ మొత్తం అల్లాడిపోతుంది. అటు తన సీరియల్ బ్యాచ్‏తో ఉంటూనే వారితోనే గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇక మొన్నటివరకు తేజతో స్నేహంగా ఉన్న తేజకు నిన్నటి ఎపిసోడ్ లో చుక్కలు చూపించింది. రతికతో మాట్లాడుతుండగా ఎంటరై లొల్లి పెట్టుకుంది. అమర్ గురించి మాట్లాడొద్దు.. ఎమోషన్స్ అంటూ కావాలని కంటెంట్ క్రియేట్ చేసింది. శోభా దెబ్బకు అల్లాడిపోయిన తేజ.. చివరకు కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. దీంతో శోభాకు ఏమైంది ?.. సైకోలా బిహేవ్ చేస్తుందంటూ తిట్టిపోస్తున్నారు అడియన్స్. ఇక భోలే పట్ల శోభా ప్రవర్తన గురించి చెప్పక్కర్లేదు. గౌరవం, మర్యాద ఇవేమీ లేకుండా ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకుంటుంది. మళ్లీ తనకే రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ మొసలి కన్నీళ్లు కారుస్తుంది.

అన్నం తింటున్నావా ?. ఇంకేమైనా తింటున్నావా ? నువ్వు అసలు మనిషివేనా ? బుద్దిలేదు నీకు ? నువ్వు కనిపిస్తే టీవీలు పగలగొట్టేస్తా అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంది. భోలే ఒక్కసారి పొరపాటున నోరు జారి బూతు మాట్లాడినందుకు అతడిని ప్రతిసారి దారుణంగా అవమానిస్తున్నారు ఈ సీరియల్ హీరోయిన్స్ ప్రియాంక, శోభా. భోలే ఏం చేసినా తప్పే.. అతను మాట్లాడినా.. గేమ్ ఆడినా, ఆడకపోయినా.. అన్నింటిని తప్పుగానే చూస్తున్నారు. కానీ అదే నామినేషన్స్ సమయంలో తమ సీరియల్ బ్యాచ్ దోస్తులు అమర్ దీప్, సందీప్ రెచ్చిపోయి బూతులు మాట్లాడుతున్నా అవేం పట్టనట్లుగా కూర్చుండిపోయారు. దీంతో ఇప్పుడు శోభా, ప్రియాంక ప్రవర్తనపై అడియన్స్‏కు పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. ముఖ్యంగా రోజు రోజుకి శోభా వింత ప్రవర్తన మితిమీరిపోతుండడంతో ప్లీజ్ బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేయండంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

నిజానికి శోభా ఆరో వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది. సోషల్ మీడియాలో అన్ని పోలింగ్స్ లోనూ శోభాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది. కానీ ఆమెను సేవ్ చేసి జన్యూన్ గా ఆడుతున్న నయని పావని బయటకు పంపించేశారు. ఇక గత వారం సైతం ఆమెను ఎలిమినేట్ చేయాలనుకున్న ఆమె స్థానంలో పూజాను పంపించారు. కానీ ఈసారి ఎలాగైనా శోభాను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అడియన్స్. ఇప్పటివరకు అన్ని ఓటింగ్స్ లో ఆమెకు తక్కువ ఓటింగ్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే.. నిన్నటి ఎపిసోడ్ లో శోభా కన్నింగ్ ఆలోచన గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

హౌస్ లో కాఫీ కోసం శివాజీ ఏ రేంజ్ లో గొడవ పెట్టుకున్నాడో తెలిసిందే. చివరకు బిగ్ బాస్ అతడికి కాఫీ పొడి పంపించాల్సి వచ్చింది. అయితే ఆ కాఫీ పొడిని శివాజీ తను మాత్రమే కాకుండా అడిగిన వారికి ఇస్తున్నారు. శోభా ఒకటి రెండు సార్లు అడిగినా ఇచ్చేశాడు. కానీ అదేం పట్టించుకోకుండా కాఫీ పొడి కోసం శివాజీ ఎలిమినేట్ అయితే బాగుండూ.. నాకు కాఫీ వస్తుందంటూ తన సెల్ఫీష్ ఆలోచన బయటపెట్టింది. తేజతో మాట్లాడుతూ.. నాకు కాఫీ పొడి కావాలి అని అడగ్గా.. శివాజీ దగ్గర ఉందో లోదో అంటూ బదులిచ్చాడు. ఉంది నిన్న రతికకు ఇచ్చాడు అని చెప్పుకొచ్చింది శోభా. నువ్వు అడుగు అని తేజ అనగా.. నాకు ఇచ్చాడు శనివారానికి దాచుకున్నాను. ఈ వారం అతను ఎలిమినేట్ అయితే నాకు నార్మల్ కాఫీ వస్తుంది అంటూ పిచ్చి పిచ్చిగా వాగేసింది. శోభా కన్నింగ్ ఆలోచన విని నోరెళ్లబెట్టాడు తేజ. మొత్తానికి కావాలని కంటెంట్ కోసం చేస్తుందో లేదో కానీ రోజు రోజుకు శోభా ప్రవర్తన చూసి మాత్రం జనాలు ఆమెను తెగ తిట్టుకుంటున్నారు. కార్తీకదీపంలో మోనితను మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో