Brahmamudi, October 27th episode: స్వప్న ఉత్తిత్తి కడుపు పోగొట్టేందుకు రుద్రాణి, రాహుల్ ప్లాన్.. టెన్షన్ లో కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న సీమంతం కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు దుగ్గిరాల ఫ్యామిలీ. అయితే ఈలోపు స్వప్న కడుపు గురించి నిజం చెప్పాలని అనుకుంటుంది కావ్య. కానీ ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి, అపర్ణ, కనకం సంతోషం చూసి ఆగిపోతుంది. ఈలోపు రుద్రాణి.. స్వప్న కడుపు పోగొట్టాలని ప్లాన్ చేస్తుంది. స్వప్నకి అబార్షన్ కావాలని రాహుల్, రుద్రాణిలు ప్లాన్ చేస్తారు. అబార్షన్ ట్యాబ్లెట్స్ తెప్పించి.. తనతో వేయించాలని రాహుల్ కి చెప్తుంది. స్వప్న సీమంతం అయిన తర్వాత పుట్టింటికి వెళ్తే.. మనం చేయాల్సిందేమీ ఉండదు. కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలని..

Brahmamudi, October 27th episode: స్వప్న ఉత్తిత్తి కడుపు పోగొట్టేందుకు రుద్రాణి, రాహుల్ ప్లాన్.. టెన్షన్ లో కావ్య!
Brahmamudi
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2023 | 8:00 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న సీమంతం కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు దుగ్గిరాల ఫ్యామిలీ. అయితే ఈలోపు స్వప్న కడుపు గురించి నిజం చెప్పాలని అనుకుంటుంది కావ్య. కానీ ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి, అపర్ణ, కనకం సంతోషం చూసి ఆగిపోతుంది. ఈలోపు రుద్రాణి.. స్వప్న కడుపు పోగొట్టాలని ప్లాన్ చేస్తుంది. స్వప్నకి అబార్షన్ కావాలని రాహుల్, రుద్రాణిలు ప్లాన్ చేస్తారు. అబార్షన్ ట్యాబ్లెట్స్ తెప్పించి.. తనతో వేయించాలని రాహుల్ కి చెప్తుంది. స్వప్న సీమంతం అయిన తర్వాత పుట్టింటికి వెళ్తే.. మనం చేయాల్సిందేమీ ఉండదు. కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత టైమ్ చూసి దాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. కావ్యని దోషిని చేస్తే సరిపోతుందని అనుకుంటారు రాహుల్, రుద్రాణిలు.

ఇందులో నా తప్పులేదు.. నన్ను క్షమించు కృష్ణ: కావ్య

ఇక దేవుడి దగ్గరకు వచ్చి కావ్య బాధ పడుతుంది. అక్క కాపురం నిలబెట్టాలా.. అందరి ఆనందం పోగొట్టాలా అని ఆలోచిస్తున్నా. ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలో అర్థంకాక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నా. ఏది ఎలా జరగాలని ఉంటే.. అలాగే జరుగుతుంది. ఇందులో నా తప్పేం లేదని నమస్కారం చేస్తుంది. ఇక కళ్యాణ్, అప్పూలు అనామిక ఇంటికి వస్తారు. కళ్యాణ్ వంట చేస్తూంటాడు. ఈలోపు అప్పూ వచ్చి.. ఇక్కడికి వచ్చి నువ్వు వంట చేస్తున్నావేంటిరా భయ్, వాళ్ల అమ్మానాన్నలు లేరా అని అడుగుతుంది. లేదు బ్రో వాళ్ల అమ్మా నాన్నలు ఫంక్షన్ కు వెళ్లారు. అందుకే నన్ను పిలిచిందని కళ్యాణ్ అంటాడు. నీకు వంట చేయడం రాదు అన్నావ్ కదా.. మరి ఎలా చేస్తున్నావ్ అని అడుగుతుంది అప్పు. అందుకే నిన్ను పిలిచా అంటాడు కళ్యాణ్.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ చేత వంటి చేయిస్తున్న అనామిక.. కుళ్లుకుంటున్న అప్పు:

మరి ఆవిడకు రాదా వంట అని అనామిక అనగా.. రాదు అప్పూ ఎప్పుడూ ట్రై కూడా చేయలేదని అంటుంది అనామిక. మరి పెళ్లైయ్యాక అని అప్పు అడిగితే.. అక్కడ పని వాళ్లు ఉంటారని అనామిక చెప్తుంది. వాళ్లను నమ్ముకుంటే రిస్క్ కదా అని అప్పు అంటే.. అందుకే కళ్యాణ్ కి నేర్పిస్తున్నా అని అనామిక అంటుంది. నేర్పించడం లేదు వాడుకుంటున్నావ్.. ఇప్పుడే ఇలా ఉందంటే.. రేపు పెళ్లి అయ్యాక ఆయన పరిస్థితి ఏంటో అని అప్పూ మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ చేసిన వంటని టేస్ట్ చేసిన అనామిక.. బాలేదని అని చెప్తుంది. ఇక వీళ్లిద్దర్నీ తిట్టుకుంటుంది అప్పు.

ప్లాన్ ప్రకారం స్వప్న చేత జ్యూస్ తాగించిన రాహుల్, రుద్రాణిలు:

ఇక రుద్రాణి, రాహుల్ లు ప్లాన్ ప్రకారం జ్యూస్ లో ట్యాబ్లెట్ కలుపుతారు. రాహుల్.. స్వప్న దగ్గరికి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు. కానీ స్వప్న మాత్రం నేను బత్తాయి జ్యూస్ తాగను నాకు ఇష్టం ఉండదని చెబుతుంది. దీంతో రాహుల్ కి, రుద్రాణికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నీ కోసం ఎంతో కష్టపడి చేశాను ప్లీజ్ తాగు అని రాహుల్ అంటే.. నేను తాగను అని స్వప్న అంటుంది. ఎందుకంత బలవంతం చేస్తున్నావ్.. వద్దని అంటున్నా కదా అని స్వప్న అంటే.. అప్పుడే వచ్చిన కనకం తాగి తీరాలి. అల్లుడు గారు అంత ప్రేమతో తీసుకొస్తే తాగడానికి నీకేంటే బాధ అని కనకం అంటే.. అమ్మా ఆ జ్యూస్ నాకు ఇష్టం ఉండదు. ఏదైనా తాగాల్సిందే అని కనకం అంటుంది. స్వప్న వద్దంటున్నా.. కనకం కావాలని బలవంతంగా తాగిస్తుంది.

మళ్లీ డ్రామా స్టార్ట్ చేసిన కావ్య.. తల పట్టుకున్న రాజ్:

ఇక గదిలోకి వచ్చిన కావ్య.. మళ్లీ రాజ్ తో కావాలని ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ ఆయింట్మెంట్ పట్టుకోవడం చూసి.. డ్రామా స్టార్ట్ చేస్తుంది. మీరు కావాలనే నా నడుమును టచ్ చేయాలని చూస్తున్నారా అని కావ్య అంటుంది. ఇంకా టైమ్ ఉండగానే మీరు చిలిపి పనులు మొదలు పెట్టేసారు. ఇక్కడేం లేదా.. నువ్వేం అంత ఫీల్ అయిపోవాల్సిన పని లేదు. ఇక కావ్య ఏదోదే మాట్లాడుతూ ఉంటుంది. చాలు నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్.. నాకు తల నొప్పిగా ఉండి రాసుకుంటున్నా.. ఆపు ఇక నీ డ్రామాలు అని అంటాడు రాజ్. ఇక రాజ్ వద్దంటున్నా.. రాజ్ కి బామ్ రాస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ పడుకుంటారు. కానీ ఏవండీ నిద్ర రావడం లేదంని రాజ్ ని నిద్ర లేపుతుంది. ఈలోపు కరెంట్ పోతుంది. రాజ్ సెల్ ఫోన్ కోసం వెతుక్కుంటూ.. కావ్య నడుం పై చేయి వేస్తాడు. ఇదే వంకతో కావ్య మళ్లీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. కానీ రాజ్ కావ్య నోరు మూయించేసి పడుకుంటాడు.

ఆదమరిచి నిద్రపోతున్న స్వప్న.. డౌట్ లో రాహుల్:

ఇక స్వప్న నిద్రపోతూ ఉంటుంది. కానీ రాహుల్ మాత్రం ఏంటి? దీనికి ఎలాంటి పెయిన్స్ రావడం లేదని అంటాడు. స్వప్నని నిద్ర లేపి ఏమైనా కావాలా అని అడుగుతాడు. నాకు డైమెండ్ నెక్లెస్ కావాలి తీసుకొస్తావా.. అని స్వప్న జోక్ వేస్తుంది. అది కాదు.. నీకు వంట్లో అంతా బాగానే ఉందా అని అడుగుతాడు రాహుల్. అసలు నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని స్వప్న అంటుంది. అది కాదు నువ్వు నిద్రలో మూలుగుతున్నావ్ అని రాహుల్ అంటాడు. అంటే నువ్వు నిద్ర పోకుండా నన్ను గమనిస్తూ కూర్చున్నావా.. అని స్వప్న అడుగుతంది. ఇక చిరాకుతో నీకేం అవుతుందే.. నాకే ఏమైనా అవుతుంది అని చెప్పి పడుకుంటాడు రాహుల్. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!