AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda OTT: సస్పెన్స్‌కు తెర.. రామ్‌ స్కంద ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా ఓటీటీ రిలీజ్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడింది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ త్వరలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. దీనిపై ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కంద సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Skanda OTT: సస్పెన్స్‌కు తెర.. రామ్‌ స్కంద ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Skanda Movie
Basha Shek
|

Updated on: Oct 28, 2023 | 7:57 AM

Share

రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా ఓటీటీ రిలీజ్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరపడింది. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ త్వరలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. దీనిపై ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్కంద సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట అక్టోబర్‌ 27నే రామ్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా స్కంద ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వాయిదా పడింది. అయితే ఇప్పుడు అధికారికంగా రామ్‌ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. నవంబర్‌ 2 నుంచి స్కంద సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ ప్రకటించింది. ‘యాక్షన్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లేందుకు స్కంద వచ్చేస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి ర్యాపో ర్యాంపేజ్ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా సెప్టెంబర్‌ 28న థియేటర్లలో రిలీజైన స్కంద సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఓవరాల్‌గా బాక్సాఫీస్‌ రూ. 50 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

స్కంద సినిమాలో రామ్‌ డబుల్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు యూత్‌ ఫుల్‌ అండ్‌ లవ్‌ స్టోరీల్లోనే ఎక్కువగా నటించిన ఉస్తాద్‌ స్కంద సినిమాలో మొదటిసారి ఊర మాస్‌ హీరోగా కనిపించాడు. శ్రీలీలతో పాటు బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ సెకెండ్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే శ్రీకాంత్‌, ప్రిన్స్‌, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్‌, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ సెన్సేషన్‌ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించిన స్కంద సినిమాకు ఎస్‌. థమన్‌ స్వరాలు అందించారు. మరి థియేటర్లలో రామ్‌ స్కంద సినిమాను మిస్‌ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో ఈ సీన్లు ఎలా తీశారు?
VFX, CGI టెక్నాలజీ లేని రోజుల్లో ఈ సీన్లు ఎలా తీశారు?
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు