AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: వాళ్లిద్దరిలో నేను మునిగిపోయేలా ఉన్నాను సర్.. అమర్ దీప్ రియాలైజేషన్..

ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్ ఇచ్చి మళ్లీ స్నేహితుల మధ్య ఫిట్టింగ్ పెట్టే పనిలో పడ్డారు. సరదాగా ఓ చిన్న ఆట ఆడదాం. నేను ఇద్దరి పేర్లు చెబుతాను.. ఆ ఇద్దరిని పడవలో పెట్టాలి అని చెప్పారు నాగార్జున. గౌతమ్ తో గేమ్ స్టార్ట్ చేసిన నాగ్.. ముందుగా అర్జున్, ప్రియాంక ఫోటోలను బోటుపై పెట్టమన్నారు. నీ బోట్ మునిగిపోయే పరిస్థితి వస్తే ఎవరిని నీటిలోకి తోసేస్తావు.. ఎవర్ని బోట్లో ఉంచుతావు ?..

Bigg Boss 7 Telugu: వాళ్లిద్దరిలో నేను మునిగిపోయేలా ఉన్నాను సర్.. అమర్ దీప్ రియాలైజేషన్..
Amardeep
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2023 | 1:23 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 అప్పుడే ఎనిమిదో వారం ఎలిమినేషన్ సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే హౌస్ నుంచి బయటకు వచ్చారు. బిగ్‏బాస్ హిస్టరీలోనే ఇలా జరగడం ఇది మొదటిసారి. కానీ ఫర్ ఏ ఛేంజ్ అనుకున్నారేమో కానీ.. అతి తక్కువ ఓటింగ్ వచ్చిన శోభాను కాదని సందీప్ మాస్టర్ ను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. శనివారం ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. సండే ఫన్ డే వచ్చేసింది. ఈరోజు హౌస్మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించేందుకు సిద్ధమయ్యారు నాగ్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఒక్కొక్కరికి పడవ గేమ్ ఇచ్చి మళ్లీ స్నేహితుల మధ్య ఫిట్టింగ్ పెట్టే పనిలో పడ్డారు. సరదాగా ఓ చిన్న ఆట ఆడదాం. నేను ఇద్దరి పేర్లు చెబుతాను.. ఆ ఇద్దరిని పడవలో పెట్టాలి అని చెప్పారు నాగార్జున. గౌతమ్ తో గేమ్ స్టార్ట్ చేసిన నాగ్.. ముందుగా అర్జున్, ప్రియాంక ఫోటోలను బోటుపై పెట్టమన్నారు. నీ బోట్ మునిగిపోయే పరిస్థితి వస్తే ఎవరిని నీటిలోకి తోసేస్తావు.. ఎవర్ని బోట్లో ఉంచుతావు ?.. అని అడిగాడు నాగ్. ఇది చాలా కష్టమంటూనే అర్జున్ ను నీటిలోకి తోసేస్తాను.. ప్రియాంకను బోట్ లో ఉంచుతాను. ఎందుకంటే ఆమెతో బాండింగ్ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అర్జున్ వచ్చేసి అమర్ ను నీటిలోకి తోసేస్తాను.. ఎందుకంటే ఇకనుంచైన ఎవరి హెల్ప్ లేకుండా ఏదైనా తనంతట తానే చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక ఆ తర్వాత అమర్ వచ్చేసి.. ప్రియాంక, శోభా ఫోటోలను పెట్టి.. నేను మునిగిపోయేలా ఉన్నాను సార్ అని అన్నాడు. దీంతో హౌస్మేట్స్ అంతా నవ్వేస్తారు. ఇక తర్వాత యావర్, శివాజీ, రతిక ఫోటోలు పెట్టి ఏదో ఆలోచిస్తుండగా.. అంతగా ఏం ఆలోచిస్తున్నావని అర్జున్ అనగానే.. షో తర్వాత జరిగేది అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ఇక యావర్ రతిక ఫోటోను తీసి శివాజీ ఫోటను బోట్ లో పెట్టాడు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక తేజ వచ్చి.. యావర్, శోభాల ఫోటోలను బోట్ పై పెట్టి.. వీళ్లపై నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పు అనడంతో శోభా ఫోటోను తీసేస్తాడు. దీంతో నీకు ఉందిలే అంటూ సెటైర్ వేశాడు నాగ్. భోలే నామినేషన్లలో ఉన్న ప్రశాంత్ ను బయటకు తీసుకురా అని చెప్పడంతో.. ఏ పేరు లేకుండా ఒక రైతు బిడ్డగా వచ్చి మంచి బీజం ఏర్పర్చుకున్నాడు సర్ అంటూ చెప్పుకొచ్చాడు. శివాజీ యావర్ ఫోటోను తీసుకుని నేను ఇంట్లో ఉననా లేకపోయినా.. వీడ్ని ఫైనల్లో చూడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇక ఈరోజు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.