సోషల్ మీడియాలో యూత్‌ని ఎలా ఎంగేజ్ చేయొచ్చో జాన్వీ, మాళవికకు బాగా తెలుసు. వెకేషన్ ఫొటోలు, బీచ్ వ్యూస్, బికినీస్, అల్ట్రా గ్లామరస్ ఫొటోషూట్‌లంటూ ఓ రేంజ్‌లో గ్లామర్ స్టిల్స్ షేర్ చేస్తుంటారు వీరిద్దరూ. వాళ్లను సోషల్ మీడియాలో పాలో అవుతున్న వారు తెలుగు సినిమాలు చేస్తే చూడాలని ఉందని బోలెడన్ని సార్లు రిక్వెస్టులు పెట్టారు. ఫ్యాన్స్ మాటల్ని సీరియస్‌గా పట్టించుకున్న జాన్వీ కపూర్ తన అభిమాన హీరో తారక్‌తో ఎన్టీఆర్ 30లో జోడీ కడుతున్నారు.