Varun Tej- Lavanya Tripathi: అప్పుడు నిహారిక.. ఇప్పుడు లావణ్య… మెగా పెళ్లిళ్లలో అదే స్పెషల్ ..

రీసెంట్ గా గాండీవధారి అర్జున్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్. ఇక లావణ్య కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేసింది. మిస్టర్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఈ జంట ప్రేమించుకుంటూ ఉన్నారు. కానీ వీరి రిలేషన్ గురించి ఎక్కడా బయట పెట్టలేదు.

Varun Tej- Lavanya Tripathi: అప్పుడు నిహారిక.. ఇప్పుడు లావణ్య... మెగా పెళ్లిళ్లలో అదే స్పెషల్ ..
Varun Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 31, 2023 | 12:35 PM

వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా గాండీవధారి అర్జున్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక లావణ్య కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాలు చేశారు. మిస్టర్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ఈ జంట ప్రేమించుకుంటూ ఉంది. కానీ వీరి రిలేషన్ గురించి ఎక్కడా బయట పెట్టలేదు. ఎట్టకేలకు ఈ ఇద్దరు పెళ్లిపీటలెక్కుతున్నారు. అయితే లావణ్య కూడా మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది. అదేంటంటే..

వరుణ్, లావణ్య పెళ్లి సందడి ఎం,మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకలు హుషారుగా జరుగుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ , లావణ్య ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకున్నారు. వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే లావణ్య కూడా గతంలో నిహారిక చేసిన అదే పని ఇప్పుడు చేస్తుంది.

గతంలో మెగా ఫ్యామిలిలో నిహారిక పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో ఆమె  తల్లి చీరను తన పెళ్లిలో కట్టుకుంది.ఇప్పుడు లావణ్య కూడా అదే పని చేస్తుంది. తన తల్లి చీరను లెహంగాలా మార్చి తన పెళ్లి వేడుకలో ధరించనుంది. పెళ్లి హల్దీ వేడుకలో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారు. పెళ్ళికి మాత్రం ఇలా తన తల్లి చీరను కేప్ లెహంగాలా మార్చి ధరించనుంది లావణ్య. ఇక వరుణ్ , లావణ్య వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. ఆతర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసే రిసెప్షన్ లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..