Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: డిజిటల్ ఇండియా విజయానికి ఇదే సంకేతం.. రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ‘సెంచరీ’ మ్యాచ్..

ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన పుట్టిన రోజు నాడే కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.. 49వ వన్డే సెంచరీతో సచిన్‍ అత్యధిక వన్డే శతకాల రికార్డును సమం చేశాడు. అయితే, క్రికెట్ ప్రపంచంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోనుంది. కోహ్లీ పుట్టినరోజు నాడు సెంచరీ చేయడం.. కోట్లాది మంది ఈ మ్యాచ్ ను వీక్షించడం డిజిటల్ ఇండియా సక్సెస్‌ను మరోసారి నిరూపించింది.

Ashwini Vaishnaw: డిజిటల్ ఇండియా విజయానికి ఇదే సంకేతం.. రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ‘సెంచరీ’ మ్యాచ్..
Ashwini Vaishnaw Virat Kohli
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2023 | 8:19 AM

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా.. భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల భారీ తేడాతో సఫారీ జట్టును భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు విజృంభించటంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్‍లో అజేయంగా వరుసగా ఎనిమిదో విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకెళ్తోంది. అయితే.. ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన పుట్టిన రోజు నాడే కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.. 49వ వన్డే సెంచరీతో సచిన్‍ అత్యధిక వన్డే శతకాల రికార్డును సమం చేశాడు. అయితే, క్రికెట్ ప్రపంచంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చిరస్థాయిగా నిలిచిపోనుంది. కోహ్లీ పుట్టినరోజు నాడు సెంచరీ చేయడం.. కోట్లాది మంది ఈ మ్యాచ్ ను వీక్షించడం డిజిటల్ ఇండియా సక్సెస్‌ను మరోసారి నిరూపించింది. భారత్ టెక్నాలజీ రంగంలో ఎలా దూసుకెళ్తుందో మరోసారి గుర్తుచేసిందంటూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. అతి తక్కువ ధరతో కూడిన డేటా ఇంటర్నెట్‌కు యాక్సెస్.. భారత్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చేసిందంటూ అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రాకముందు.. వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి.. 2011 లో ప్రపంచకప్.. 2023లో ప్రపంచకప్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరిస్తూ కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు. ఆదివారం నాటి ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌ను ఇంటర్నెట్‌లో వీక్షించిన వారి సంఖ్య 4 కోట్ల 40 లక్షలకు చేరుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండగా.. మొబైల్ లో 4 కోట్ల 40 లక్షల మంది వీక్షించడం డిజిటల్ ఇండియా విజయానికి స్పష్టమైన సంకేతమంటూ పేర్కొన్నారు.

అశ్విని వైష్ణవ్ పోస్ట్ చూడండి..

ఇంటర్నెట్‌కు యాక్సెస్, అతి తక్కువ ధరతో కూడిన డేటా భారత్ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చేసింది. 2011లో భారతదేశం క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. భారతదేశం ఆటను చూడటానికి టీవీ షోరూమ్‌ల వెలుపల ప్రజలు గుమిగూడడం మాకు గుర్తుంది. ఇప్పుడు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ప్రజలు మొబైల్ ఫోన్‌లలో ఆన్‌లైన్‌లో క్రికెట్ చూస్తున్నారు. ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించారు.. ఈ సమయంలో 4.4 కోట్ల ఏకకాల వీక్షణలు డిజిటల్ ఇండియా విజయానికి స్పష్టమైన సంకేతం. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా దార్శనికత.. డిజిటల్ విభజనను తగ్గించడం.. అందరికీ సులభమైన యాక్సెస్‌ను అందించడం.. ఈరోజు మనం జట్టుగా గెలిచాం. టీమ్ ఇండియా, టీమ్ డిజిటల్ ఇండియా.. అంటూ అశ్వినీ వైష్ణవ్ సందేశాన్ని షేర్ చేశారు.

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..