Pragathi Exotic Nursery: విదేశీ మొక్కలతో మంత్రముగ్ధులను చేస్తున్న ప్రగతి ఎగ్జోటిక నర్సరీ.. వీడియో

Pragathi Exotic Nursery: విదేశీ మొక్కలతో మంత్రముగ్ధులను చేస్తున్న ప్రగతి ఎగ్జోటిక నర్సరీ.. వీడియో

Anil kumar poka

|

Updated on: Nov 06, 2023 | 8:45 AM

విభిన్న రకాల మొక్కలతో హైదరాబాద్‌ శివారులో ఏర్పాటైన నర్సరీ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రగతి ఎగ్జోటిక పేరుతో సమతా మూర్తి అవరణలో అతి పెద్ద నర్సరీని రూపొందించారు కర్ణాటక ప్రాంతానికి చెందిన కుమార స్వామి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల వద్ద ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. నర్సిరీలోని మొక్కలను చూసేందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

విభిన్న రకాల మొక్కలతో హైదరాబాద్‌ శివారులో ఏర్పాటైన నర్సరీ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రగతి ఎగ్జోటిక పేరుతో సమతా మూర్తి అవరణలో అతి పెద్ద నర్సరీని రూపొందించారు కర్ణాటక ప్రాంతానికి చెందిన కుమార స్వామి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల వద్ద ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. నర్సిరీలోని మొక్కలను చూసేందుకు ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుత వాతావరణానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన నర్సరీలో వర్టికల్‌ గార్డెనింగ్‌, టెర్రస్‌ గార్డెనింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల మొక్కలన్నింటినీ ఒకేచోట చూసిన జనం సంబరపడిపోతున్నారు. మొక్కలను పెంచడం అంటే తనకు చాలా ఇష్టమని అందుకే వివిధ దేశాల నుండి అనేక రకాలైన, ఖరీదైన మొక్కలను తెచ్చి విక్రయిస్తునట్లు తెలిపారు నర్సరీ నిర్వాహకుడు కుమారస్వామి. తన వద్ద సాదారణ మొక్క నుండి చాలా ఖరీదైన మొక్కలు ఉన్నాయని తెలిపారు.100 రూపాయలు మొదలుకుని 24 లక్షలు ధర పలికే మొక్క సైతం తన దగ్గర ఉందని అన్నారు. వందల ఏళ్ళనాటి మొక్కలు సైతం ఉన్నట్లు వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.