Bigg Boss 7 Telugu: ‘మా బిడ్డను పెళ్లి చేసుకుంటానంటే రాహుల్‌ను ఇంటికి రమ్మన్నా.. కానీ’: రతిక తల్లిదండ్రులు
రతిక ఎంట్రీ, రీ ఎంట్రీల సంగతి పక్కన పెడితే.. హౌజ్‌లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదే.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం. ఎప్పుడైతే హౌజ్‌లో తన మాజీ ప్రియుడి గురించి కామెంట్స్ చేసిందో వెంటనే రాహుల్- రతికల ప్రైవేట్ ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటిని కావాలని షేర్ చేశారంటూ సింగర్ రాహుల్..
రతికా రోజ్.. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభం నుంచి ఈ పేరు బాగా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఈ అమ్మడు తన క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే హౌజ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ గేమ్స్, టాస్కుల్లో పార్టిసిపేట్ చేసింది. ఇదే క్రమంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లతో ఎంతో చనువుగా మెలిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే నామినేషన్స్ మొదలయ్యాయో తన అసలు స్వరూపం బయటపెట్టింది. పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పోడిచింది. అలాగే ప్రిన్స్ యావర్‌తోనూ గొడవలు పెట్టుకుంది. చిన్న విషయాలకు కూడా పెద్దగా రాద్ధాంతం చేయడంతో బుల్లితెర ప్రేక్షకులు ఆమెను తిరస్కరించాడు. తక్కువ ఓట్లు వేసి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు పంపించారు. అయితే ఐదో వారంలో ఎలిమినేట్ అయిన రతికను రీ ఎంట్రీ పేరుతో మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. అయితే రతిక ఎంట్రీ, రీ ఎంట్రీల సంగతి పక్కన పెడితే.. హౌజ్‌లో ఉన్నప్పుడు ఈ బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదే.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం. ఎప్పుడైతే హౌజ్‌లో తన మాజీ ప్రియుడి గురించి కామెంట్స్ చేసిందో వెంటనే రాహుల్- రతికల ప్రైవేట్ ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటిని కావాలని షేర్ చేశారంటూ సింగర్ రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రతిక సోదరి కూడా ఈ విషయంపై స్పందించింది. రాహులే తన అక్క ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించింది. తాజాగా రాహుల్- రతికల ప్రేమ వ్యవహారంపై రతిక తల్లిదండ్రులు రాములు, అనిత స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన వీరు తమ బిడ్డ టాప్ 5లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మా బిడ్డ ఎంతో కష్టపడి పైకొచ్చింది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది. పటాస్ షో చేస్తున్నప్పడే దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల ఫోన్ చేసి తాము తీయబోయే ‘ఈ జన్మ నీకే’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించమని రతికను అడిగారు. ఇందుకు మేము కూడా ఒప్పుకున్నాం. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఇదే సమయంలో యూట్యూబ్ కోసం రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి నా బిడ్డ కొన్ని పాటలు పాడింది. ఆ టైమ్‌లో వారిద్దరి గురించి చాలామంది తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపించింది. రాహుల్ నా రెండో కూతురు పెళ్లికి కూడా వచ్చాడు. రతికను పెళ్లి చేసుకుంటానంటే మాట్లాడాలని ఇంటికి కూడా పిలిచాను. అయితే ఆ తర్వాత అతను మళ్లీ టచ్‌లో లేకుండా పోయాడు’ అని చెప్పుకొచ్చారు రతిక తల్లిదండ్రులు.
తల్లితో రతికా రోజ్..
View this post on Instagram
తండ్రి రాములుతో బిగ్ బాస్ బ్యూటీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.