Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జనసేనలో చేరిన ‘మొగలి రేకులు’ హీరో సాగర్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ఎక్కడినుంచంటే?

2021లో షాదీ ముబారక్‌ సినిమాతో మళ్లీ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు సాగర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ విడుదల చేసిన సినిమా అప్పట్లో మంచి విజయం సాధించాడు. దీంతో సాగర్‌ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాడని చాలా మంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. షాదీ ముబారక్‌ మూవీ తర్వాత అసలు స్క్రీన్‌పై కనిపించలేదీ ఫ్యామిలీ యాక్టర్‌

Pawan Kalyan: జనసేనలో చేరిన 'మొగలి రేకులు' హీరో సాగర్‌..  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ఎక్కడినుంచంటే?
Pawan Kalyan, Actor Sagar
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2023 | 4:34 PM

మొగలి రేకులు సీరియల్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాగర్‌. ఇందులో అతను పోషించిన ఆర్కే నాయుడు పాత్రతో ఒక్క సారిగా ఫ్యామిలీ యాక్టర్‌గా ఫేమస్‌ అయిపోయాడు. అంతకు ముందు చక్రవాకం సీరియల్‌తోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఉదయ్ కిరణ్‌ మనసంతా నువ్వే, ప్రభాస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్‌ పోషించాడు. ఇక 2016లో సిద్ధార్థ సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు సీరియల్స్‌, సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. మధ్యలో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అనే ఓ సినిమాలో తళుక్కున మెరిశాడు. అయితే 2021లో షాదీ ముబారక్‌ సినిమాతో మళ్లీ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు సాగర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ విడుదల చేసిన సినిమా అప్పట్లో మంచి విజయం సాధించాడు. దీంతో సాగర్‌ సినిమాల్లోనే కంటిన్యూ అవుతాడని చాలా మంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. షాదీ ముబారక్‌ మూవీ తర్వాత అసలు స్క్రీన్‌పై కనిపించలేదీ ఫ్యామిలీ యాక్టర్‌. కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు సాగర్‌తో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చినా ఆయన తిరస్కరించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ది హండ్రెడ్‌ అనే ఓ సినిమాలో సాగర్‌ నటిస్తున్నాడు. సోషల్‌ మీడియాలోనూ దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసుకుంటున్నాడీ ఫ్యామిలీ యాక్టర్‌.

ప్రస్తుతం కొన్ని టీవీ షోల్లోనూ గెస్ట్‌గా కనిపిస్తోన్న సాగర్‌ తాజాగా జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సాగర్‌కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. తన స్వస్థలమైన పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పవన్‌ కల్యాణ్‌ను కలిశారు సాగర్‌. అనంతరం ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ‘పవర్‌ఫుల్ లీడర్ పవన్ కల్యాణ్‌ అన్నను కలిశాను. తద్వారా ఈరోజును ఎంతో అద్భుతంగా మొదలుపెట్టాను. ఎంతో వినయపూర్వకమైన, నిరాడంబరమైన వ్యక్తితో కొంత సమయాన్ని గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది. పీకే అన్నతో అద్భుతమైన భేటీ జరిగిందని భావిస్తున్నాను’ అని అప్పట్లో రాసుకొచ్చాడు సాగర్‌. దీంతో అప్పట్లోనే సాగర్‌ రాజకీయాల్లోకి అడుగుపెడతారని ప్రచారం జరిగింది. ఇప్పుడీ ఊహాగానాలను నిజం చేస్తూ జనసేనలో చేరారీ ఫ్యామిలీ యాక్టర్‌.

ఇవి కూడా చదవండి

సాగర్ కు జనసేన కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

 పవన్ కల్యాణ్ తో నటుడు సాగర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..