Rashmika: వైరల్‌ వీడియోపై స్పందించిన రష్మిక.. టెక్నాలజీ మిస్‌ యూజ్‌పై..

నటి రష్మిక మందనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. బ్లాక్‌ యోగా సూట్‌లో రష్మిక బోల్డ్‌ లుక్‌లో ఈ వీడియోలో కనిపించింది. అయితే ఇందులో ఉంది నిజంగా రష్మిక కాదు.. డీప్‌ ఫేక్‌ అనే సాంకేతికతో రూపొందించిన వీడియోను రూపొందించి నెట్టింట షేర్ చేశారు...

Rashmika: వైరల్‌ వీడియోపై స్పందించిన రష్మిక.. టెక్నాలజీ మిస్‌ యూజ్‌పై..
Rashmika
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 06, 2023 | 3:29 PM

టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. ఎన్నో రకాల కొత్త అప్లికేషన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాయ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ ఉదంతమే తాజాగా వెలుగులోకి వెచ్చింది.

నటి రష్మిక మందనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. బ్లాక్‌ యోగా సూట్‌లో రష్మిక బోల్డ్‌ లుక్‌లో ఈ వీడియోలో కనిపించింది. అయితే ఇందులో ఉంది నిజంగా రష్మిక కాదు.. డీప్‌ ఫేక్‌ అనే సాంకేతికతో రూపొందించిన వీడియోను రూపొందించి నెట్టింట షేర్ చేశారు.

దీంతో ఈ ఫేక్‌ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఇలాంటి ఫేక్‌, మార్ఫింగ్ వీడియోల‌పై లీగ‌ల్‌గా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై బాలీవుడ్‌ అగ్ర హీరో అమితాబ్‌ బచ్చన్‌ కూడా స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోల‌ను క్రియేట్ చేసే వారిపై లీగ‌ల్‌గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ అమితాబ్‌ ట్వీట్ చేశారు. రష్మికకు మద్ధతిస్తూ అమితాబ్‌ చేసిన ట్వీట్ సైతం నెట్టింట వైరల్‌ అయ్యింది.

Rashmika Mandanna

ఇదిలా ఉంటే తాజాగా ఈ సంఘటనపై నటి రష్మిక మందన్న కూడా స్పందించించారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ విషయమై రష్మిక స్పందిస్తూ.. ‘నెట్టింట వైరల్‌ అవుతోన్న డీప్‌ఫేక్‌ వీడియో గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు కేవలం నాకు మాత్రమే కాకుండా, టెక్నాలజీ మిస్‌ యూజ్‌ కారణంగా బాధపడే వారందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రోజు నాకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒకవేళ నేను స్కూల్‌ లేదా కాలేజీ వయసులో ఉన్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగి ఉంటే ఎలా ఎదుర్కునేదాన్ని అనే ఊహకూడా రావడం లేదు. ఇలాంటి సంఘటనల పట్ల అందరిలో అవగాహన పెంచాల్సి అవసరం ఉంది’ అని రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..