Bigg Boss 7 Telugu: నాకు ఫైటర్ కావాలి.. తోలుబొమ్మ కాదు.. యావర్కు అన్నయ్య ధైర్యం..
యావు.. మేరా బచ్చా కైసే హూ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన తన అన్నయ్యను పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు యావర్. నేను బావున్నాను అన్నయ్య అంటూ తన అన్నయ్య కాళ్ల మీద పడి ఏడ్చేశాడు యావర్. ఇక ఇంటి సభ్యులందరితో ప్రేమగా మాట్లాడిన యావర్ అన్నయ్య.. గౌతమ్ కు థాంక్స్ చెప్పాడు. మీ అమ్మగారికి కూడా .. యావర్ అమ్మని బాగా మిస్ అవుతున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శివాజీని గట్టిగా పట్టుకొని.. అన్నా.. మీరు తనతో ఉన్నారు. కాబట్టి నాకు కూడా మీరు బ్రదర్ అంటూ
గత రెండు వారాలుగా బిగ్‍బాస్ హౌస్ లో యావర్ ఉన్నాడా ? అనే సందేహం కలుగుతుంది జనాలకు. మొదట్లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న యావర్.. ఇప్పుడు అంతగా ఆడడం లేదు. ఈ రెండు వారాలుగా టాస్కులలో అనుకున్నంతగా సత్తా చూపించలేకపోయాడు. అటు శివాజీతో గొడవ పడడం.. రతిక వెంటే ఉండడంతో ఆటపై ఫోకస్ తగ్గినట్లుగా తెలుస్తోంది. దీంతో యావర్ గ్రాఫ్ నెమ్మదిగా పడిపోయింది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం తన అన్నయ్య సుజా అహ్మద్ యావర్కు బూస్ట్ ఇచ్చే విషయాలు చెప్పాడు. ఫైటర్ కావాలి.. ఈ తోలుబొమ్మ నాకొద్దు.. గేమ్ పై మాత్రమే ఫోకస్ చేయ్యు అంటూ మోటివేట్ చేసి వెళ్లాడు. ఫ్యామిలీ వీక్ మొత్తం తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అవుతున్న యావర్కు ధైర్యమిచ్చి వెళ్లాడు. నిన్నటి ఎపిసోడ్లో అసలేం జరిగిందో తెలుసుకుందాం.
యావు.. మేరా బచ్చా కైసే హూ అంటూ ఇంట్లోకి అడుగుపెట్టిన తన అన్నయ్యను పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు యావర్. నేను బావున్నాను అన్నయ్య అంటూ తన అన్నయ్య కాళ్ల మీద పడి ఏడ్చేశాడు యావర్. ఇక ఇంటి సభ్యులందరితో ప్రేమగా మాట్లాడిన యావర్ అన్నయ్య.. గౌతమ్ కు థాంక్స్ చెప్పాడు. మీ అమ్మగారికి కూడా .. యావర్ అమ్మని బాగా మిస్ అవుతున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శివాజీని గట్టిగా పట్టుకొని.. అన్నా.. మీరు తనతో ఉన్నారు. కాబట్టి నాకు కూడా మీరు బ్రదర్ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు సుజా అహ్మద్.
ఇక ఆ తర్వాత యావర్తో ఒంటరిగా మాట్లాడుతూ తనకు ధైర్యమిచ్చాడు. నువ్వు ఫైటర్.. గుర్తుపెట్టుకో..ఆటలో టైగర్ పక్కకు ఉండకు.. దృష్టి పెట్టు. ఒక ఫైటర్ లా ఫైట్ చేయ్.. నాకు ఆ కప్పు కావాలి. ఇక వేరే ఏం వద్దు. ఈ మధ్య నీ ఆటను చూసి నేను కొంచం ఫీలయ్యాను. నువ్వు గెలవాలి. శివన్న ఉన్నాడుగా మంచివారు. చాలా బాగా గైడ్ చేస్తున్నారు. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్ నాకు మళ్లీ కావాలి. అందరి ముందు చెప్పావ్ కదా. ఫైటర్ లా ఫైట్ చేస్తా అని చెయ్.. నీ అమాయకత్వం..నీ ప్రేమ అసలు వదులుకోకు. చాలా ముందుకు వెళ్తావ్.. నువ్వు ఎక్కడా దారి మారకు.. నేను చెప్తున్నది పాటించు అంటూ తన తమ్ముడిని మోటివేట్ చేశారు. ఇక ఆ తర్వాత శివాజీతో మాట్లాడుతూ యావర్ కు అమ్మ ప్రేమ తెలియదు. నేను పెంచాను అంటూ చెప్పుకొచ్చారు. అందరూ గేమ్ పై ఫోకస్ గా ఉన్నారు. కానీ నువ్వు అందరి మాటలు పట్టుకుని తిరుగుతున్నావ్. ఇప్పుడు ఒక తోలు బొమ్మలా ఉన్నావ్. వేరే వారి మాటలు వింటూ అటు ఇటు తిరుగుతున్నావ్. జనాలు ఇష్టపడిన యావర్ లా ఉంటూ అంటూ చెప్పేసి వెళ్లారు సుజా అహ్మద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.