Brahmamudi, November 10th episode: ఆస్తి కోసం రుద్రాణి కన్నింగ్ ప్లాన్.. వీలునామా రాయించిన సీతా రామయ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్య దగ్గరకు కన్న కూతురు కాకపోయినా.. కన్న కూతుర్నిలా పెంచారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు అమ్మా అని సీతా రామయ్య అంటే.. ఇప్పుడు కాకపోయినా తర్వాత అంటారు. నేను పుట్టింటికి ఆశ్రయం కోసం వచ్చానని, ఈ ఇంట్లో అన్ని హక్కులు కల్పిస్తానని అన్నావు. కానీ నన్ను ఈ ఇంట్లో వాళ్లు ఒక మనిషిలా చీప్ గా చూస్తున్నారు నాన్నా. నాకూ నా కొడుక్కి కూడా ఈ ఇంటి వారసత్వం హక్కు కల్పించు చాలు అని అంటుంది రుద్రాణి. అంటే అని అడుగుతాడు సీతా రామయ్య. నువ్వు ఉన్నప్పుడే నన్ను ఈ ఇంట్లో పరాయిదానిలా..

Brahmamudi, November 10th episode: ఆస్తి కోసం రుద్రాణి కన్నింగ్ ప్లాన్.. వీలునామా రాయించిన సీతా రామయ్య!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 10, 2023 | 11:05 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో సీతా రామయ్య దగ్గరకు కన్న కూతురు కాకపోయినా.. కన్న కూతుర్నిలా పెంచారు. ఇప్పుడు ఎవరు కాదన్నారు అమ్మా అని సీతా రామయ్య అంటే.. ఇప్పుడు కాకపోయినా తర్వాత అంటారు. నేను పుట్టింటికి ఆశ్రయం కోసం వచ్చానని, ఈ ఇంట్లో అన్ని హక్కులు కల్పిస్తానని అన్నావు. కానీ నన్ను ఈ ఇంట్లో వాళ్లు ఒక మనిషిలా చీప్ గా చూస్తున్నారు నాన్నా. నాకూ నా కొడుక్కి కూడా ఈ ఇంటి వారసత్వం హక్కు కల్పించు చాలు అని అంటుంది రుద్రాణి. అంటే అని అడుగుతాడు సీతా రామయ్య. నువ్వు ఉన్నప్పుడే నన్ను ఈ ఇంట్లో పరాయిదానిలా చూస్తున్నారు. ఏదైనా నీకు జరగరానిది జరిగితే.. నాకు దిక్కు ఎవరు నాన్నా.. నువ్వు ఉండగానే నాకు జీవితాంతం ఏ లోటూ రాకుండా నా పేరున ఓ వంతు వాటా రాస్తే చాలు అని రుద్రాణి అడుగుతుంది. నాకు తెలుసు నువ్వు నాకు న్యాయం చేయవని.. కానీ అదేదో ఈ పేపర్స్ మీద ఉంటే చాలు. ఆస్తిలో సమాన హక్కు ఉంటే నాకు కూడా సమాన హక్కు ఉంటుందని సీతా రాయ్యకు పేపర్స్ ఇచ్చి వెళ్తుంది రుద్రాణి. ఇదంతా ధాన్య లక్ష్మి చూస్తుంది.

రాహుల్ తో కలిసి మందు కొట్టిన రుద్రాణి:

ఆ తర్వాత రాహుల్ దగ్గరకు వస్తుంది రుద్రాణి. అప్పటికే రాహుల్ మందు కొడుతూ ఉంటాడు. మంచి వాళ్లలా నటించడం చాలా కష్టం. మన లాంటి వాళ్లకు అనుభవంలోకి వస్తే కానీ తెలీదు. నెక్ట్స్ రుద్రాణి కూడా ఓ పెగ్ వేస్తుంది. మామ్ నేను హాల్ లోకి వచ్చినప్పుడల్లా మేక ముసుగు వేసుకోలేక చచ్చిపోతున్నాను. నిజమే నీకూ నాకూ ఈ ఇంట్లో ఎన్ని కష్టాలురా బాబూ.. అని రుద్రాణి అంటాడు. మరి ఇంతకీ ఆ ముసలోడు మనకు ఆస్తి రాసి ఇస్తాడా.. అని రాహుల్ అంటే.. రాయకుండా ఎక్కడికి పోతాడు. యమ ధర్మ రాజు ఎత్తుకు పోకుండా టోల్ గేట్ వేయనూ అని రుద్రాణి అంటుంది. మనం ఎంత నికృష్టంగా మాట్లాడుకుంటున్నాం అని రాహుల్ అంటే.. అవును మనల్ని ఎవరైనా ఇలా చూస్తే గుండె ఆగి చచ్చిపోతారని రుద్రాణి అంటుంది. మీ తాత ఆ కాలం మనిషి కాబట్టి.. మంచి ఫుడ్ తిని ఇన్నాళ్లూ బతికాడు. ఈ క్యాన్సర్ రాకుండా ఉంటే సెంచరీ క్రాస్ చేసేవాడేమో.. కానీ మనం అంత స్ట్రాంగ్ కాదు. ఉన్నప్పుడే లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని రుద్రాణి అంటుంది. మన వాటా మనకు రాగానే.. నా పెళ్లాన్ని వదిలించుకుని.. వరల్డ్ టూర్ చేయాలి. అదే నా డ్రీమ్ అని రాహుల్ అంటాడు. అన్నీ అవే నిదానంగా జరుగుతాయి డోంట్ వర్రీ రాహుల్ అని రుద్రాణి అంటుంది.

ఇవి కూడా చదవండి

వీలునామా రాయించేందుకు లాయర్ ని పిలిచిన సీతా రామయ్య:

ఇక ఆ తర్వాత కావ్య, ధాన్య లక్ష్మి ఉదయాన్నే అందరికీ టిఫిన్లు చేసి పెడుతుంది. ధాన్యలక్ష్మి ఇక అందర్నీ టిఫిన్ కి పిలుస్తుంది. అప్పుడే లాయర్ వచ్చి.. నాన్న గారు లేరా అని అడుగుతారు. నాన్న గారు గదిలోనే ఉన్నారు వెళ్లండి అని అంటాడు సుభాష్. నాన్న లాయర్ ని ఎందుకు పిలిచారు అని ప్రకాష్ అడగ్గా.. నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసురా అని సుభాష్ అంటాడు. ఈలోపు రుద్రాణి నా కోసమే నాన్న లాయర్ ని పిలిపించాడని రాహుల్ కి చెప్తుంది. ఆ తర్వాత ఇందిరా దేవిని కూడా బయటకు పంపించేస్తాడు సీతా రామయ్య. బయటకు వచ్చిన పెద్దావిడను అమ్మా లాయర్ ఎందుకు వచ్చాడు అని ప్రకాష్ అడుగుతాడు. మీ నాన్నే వెళ్లిపొమ్మన్నారు అని ఇందిరా దేవి చెప్తాడు. ఏముంది ఆస్తులు పంచడానికేమో అని రుద్రాణి అంటే.. ఆ నోటికి మంచి మాటలు రావా అని పెద్దావిడ అంటుంది. ఇక్కడ అందరి మనసుల్లో అదే ఉంది.. నేను బయట పడ్డాను. వీళ్లు పడలేదని రుద్రాణి అంటుంది.

కళ్యాణ్ కోసం కంగారు పడిన ధాన్య లక్ష్మి.. రాజ్ ఉన్నాడని ధైర్యం చెప్పిన ప్రకాష్:

ఇక లోపల లాయర్ తో వీలునామా రాయిస్తాడు సీతా రామయ్య. లోపల ఏం జరుగుతుందా అని బయట అందరూ షాక్ అవుతూంటారు. ఆ తర్వాత బయట కూర్చున్న ప్రకాష్ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తుంది ధాన్యలక్ష్మి. రుద్రాణికి కూడా సమాన వాటా రాస్తే.. తర్వాత మన కళ్యాణే నష్ట పోతాడని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్ ఎందుకు నష్ట పోతాడని ప్రకాష్ అంటాడు. అబ్బా అన్నీ విడమర్చి చెప్పాలా మీకు.. కళ్యాణ్ అసలే మెతక.. రుద్రాణి ఏమైనా చేసి మన అబ్బాయికి ఆస్తి రాకుండా చేస్తే తర్వాత ఇబ్బంది పడతాడు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అలా అయితే రాజ్ చూసుకుంటాడు కదా.. ఇప్పటి వరకూ ఈ ఇంట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా నేను ఎందుకు మాట్లాడలేదో తెలుసా.. మాట్లాడం చేత కాక కాదు.. అన్నయ్య ఉన్నాడని అన్నయ్యని నేను నమ్మాను. అన్నయ్య కూడా ఇంటిని చూసుకుంటున్నాడు. అలాగే రేపు కళ్యాణ్ కి కూడా అండగా రాజ్ నిలబడతాడు. రాజ్, కళ్యాణ్ ఇద్దరూ రామ, లక్ష్మణులా కలిసి ఉన్నారు. రాజ్ కోసం కళ్యాణ్.. మనల్ని కూడా వదులు కుంటాడని ప్రకాష్ అంటాడు. మీరు చెప్పింది నిజమేనండి. రాజ్ గురించి తెలిసి కూడా తొందర పడ్డానని ధాన్య లక్ష్మి అంటుంది. చూడు ధాన్యం.. ముము ఇంత పెద్దవాళ్లం అయిన తర్వాత కూడా ఈ రోజుకీ నాన్న మాటకే కట్టుబడి ఉన్నాం. నాన్న ఏ వీలునామా రాసినా దానికే కట్టుబడి ఉంటామని ప్రకాష్ అంటాడు.

వీలు నామా రాయించొద్దని చెప్పిన అపర్ణ.. న్యాయం నాకు తెలుసన్న సీతా రామయ్య:

మావయ్య గారూ లోపలికి రావచ్చా అని అపర్ణ అడిగితే.. రామ్మా అని పెద్దాయన అంటాడు. రుద్రాణి ఏవో కాగితాలు పట్టుకుని మీ దగ్గరకు వచ్చిందని తెలిసింది. నిజమేనా మావయ్య గారూ అని అపర్ణ అడుగుతుంది. అవును అని సీతా రామయ్య అంటాడు. ఏం మాట్లాడిందని పెద్దావిడ అడిగితే.. ఏం మాట్లాడి ఉంటుందోనని మీరు ఇంకా ఊహించలేదా అత్తయ్యా అని అపర్ణ అంటుంది. అవును అంటాడు పెద్దాయన. సాహసం చేసి నేను మీకో మాట చెప్దామని వచ్చాను మావయ్య గారూ. మన ఫ్యామిలీలో ఎప్పుడూ ఇలాంటి ఆపదలు రాలేదు. మీమ్మల్ని కాపాడటానికి ఎంత ఖర్చు అయినా పెట్టండి. మీ ఆరోగ్యం కోసం ఎంత అమ్మాల్సి వచ్చినా మీరు వెనకాడకండి. ఇది మీరద్దరూ కలిసి కలలు కన్న స్వప్న సౌధం. దుగ్గిరాల ఫ్యామిలీ అంటే చాలా మందికి ఆదర్శం. ఇప్పుడు మీ ఆరోగ్యానికి ఆసరాగా తీసుకుని, రుద్రాణి జాలి కథలు వినిపించి, తనకి తన కొడుక్కి వాటా కావాలని విప్లవం లేవదీస్తుంది. కాబట్టి ఒక వేళ లాయర్ తో మీరు వీలునామా రాయించాల్సి వస్తే మాత్రం దయ చేసి ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. రుద్రాణి వంతుకు ఆస్తిని రాసిచ్చినా.. రాహుల్ దాన్ని నిలబెట్టుకోలేడు. ఈ ఉమ్మడి ఆస్తిని ఉమ్మడిగానే ఉంచండి. వాటాలు మొదలైతే చీలికలు మొదలవుతాయి. ఎక్కువ, తక్కువ అనే సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇంట్లో అందరూ కలిసి ఉండేలా పెద్ద కోడిలిగా నేను చూసుకుంటానని అపర్ణ చెప్పి వెళ్లి పోతుంది. ఆ తర్వాత ఇందిరా దేవి కూడా సలహా ఇచ్చి వెళ్తుంది.

భోజనం చేయడానికి బెట్టు చేస్తోన్న రాజ్:

ఇక రాజ్ గదిలో పెద్దాయన కోసం డాక్టర్ని పిలిపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య భోజనం తీసుకుని వస్తుంది. నువ్వు ఏదైనా చేయగలవు అని రాజ్.. కావ్యని దెప్పిపొడుస్తాడు. భోజనం చేయండి అని కావ్య తీసుకొచ్చి ఇస్తుంది. నేను తినను అని రాజ్ అంటాడు. నా మీద కోపం అన్నం మీద చూపిస్తున్నారా అని కావ్య అంటే.. అవును అన్నం మీద అలిగితే తతిరగబడదు కదా. ఈ ఫ్యామిలీ గురించి నీకు ఆలోచన లేకపోయినా నేను ఆలోచించాలి కదా అని రాజ్ అంటాడు. మీరు నన్ను చాలా హార్ట్ చేస్తున్నారని కావ్య అంటుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.