- Telugu News Photo Gallery Cinema photos Kollywood Star Heroes Increased Remunerations, Know Who Is In First Place
Kollywood: అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన తమిళ తంబీలు.. హయ్యెస్ట్ తీసుకునేది ఎవరంటే ??
ఒక్క సినిమాకు 200 కోట్ల రెమ్యునరేషనా..? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..? మరీ జోక్ కాకపోతే ఒక్క సినిమాకు 200 కోట్లేంటి బాసూ అనుకోవచ్చు కానీ తమిళ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. రజినీ, విజయ్ రేంజ్ డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. అసలన్ని కోట్లు వాళ్లకెలా ఇస్తున్నారు..? నిర్మాతలకెలా వర్కవుట్ అవుతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. హీరోల రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ పెరిగింది అంటే ఏమో అనుకున్నాం కానీ తమిళంలో ఒక్కో సినిమాకు 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు విజయ్, రజినీకాంత్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 10, 2023 | 9:14 PM

ఒక్క సినిమాకు 200 కోట్ల రెమ్యునరేషనా..? డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా..? మరీ జోక్ కాకపోతే ఒక్క సినిమాకు 200 కోట్లేంటి బాసూ అనుకోవచ్చు కానీ తమిళ ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది. రజినీ, విజయ్ రేంజ్ డబుల్ సెంచరీ క్రాస్ చేసింది. అసలన్ని కోట్లు వాళ్లకెలా ఇస్తున్నారు..? నిర్మాతలకెలా వర్కవుట్ అవుతుంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

హీరోల రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ పెరిగింది అంటే ఏమో అనుకున్నాం కానీ తమిళంలో ఒక్కో సినిమాకు 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారు విజయ్, రజినీకాంత్.

అడగడానికేం.. వాళ్లెంతైనా అడుగుతారు కానీ నిర్మాతలు కూడా ఇస్తున్నారు చూడండి అది కదా అసలు విషయం. తమిళంలో మాత్రమే ఈ మార్కెట్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. కారణం వాళ్ళ ఓవర్సీస్ బిజినెస్ ప్లస్ నాన్ థియెట్రికల్ రైట్స్.

తమిళ సినిమాలకు తెలుగుతో పోలిస్తే ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువ. లియోకు విదేశాల నుంచే 190 కోట్లు వస్తే.. జైలర్‌కు దాదాపు 150 కోట్లకు పైగానే వచ్చాయి. మన సినిమాలకు ఫారెన్ మార్కెట్ మహా అయితే 40 కోట్లు అంతే. మరోవైపు ఓటిటి, డిజిటల్, ఆడియో, శాటిలైట్ ఇవన్నీ ఎక్కువ బిజినెస్ చేస్తాయి. సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అయితే.. నాన్ థియెట్రికల్ నుంచే 150 కోట్లు వచ్చేస్తున్నాయి.

అన్నింటికీ మించి తమిళ దర్శకులు ఎంత పెద్ద సినిమానైనా ఆర్నెళ్లలోపే పూర్తి చేస్తున్నారు. గత రెండేళ్లలో 400 కోట్లకు పైగా వసూలు చేసిన జైలర్, లియో, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాల వర్కింగ్ డేస్ 100 నుంచి 150 రోజుల లోపే ఉన్నాయి. దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. తద్వారా బడ్జెట్ తగ్గుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్నాకే.. హీరోలకు 200 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు తమిళ నిర్మాతలు.





























