Brahmamudi, November 11th episode: రాజ్ చేత అన్నం తినిపించిన కావ్య.. ధైర్యం చేసి వీలునామా చింపేసిన రాజ్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అన్నం తినమని చెబుతుంది కావ్య. కానీ రాజ్ మాత్రం వినిపించుకోడు. కావ్యని హార్ట్ చేస్తాడు. కానీ కావ్య మాత్రం తెలివిగా అన్నం అక్కడ పెట్టి వెళ్లి పోతుంది. ఇక కావాలనే ధాన్య లక్ష్మీతో కలిసి కావ్య ప్లాన్ వేస్తుంది. అపర్ణ బయటకు రాగానే కావ్య, ధాన్య లక్ష్మిలు ప్లాన్ స్టార్ట్ చేసేస్తారు. ఏంటి చిన్న అత్తయ్య మీరు అనేది.. మీరు ఈ పని చేయగలరా అని కావ్య అంటే.. ఏ నేను ఎందుకు చేయలేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అన్నం తినమని చెబుతుంది కావ్య. కానీ రాజ్ మాత్రం వినిపించుకోడు. కావ్యని హార్ట్ చేస్తాడు. కానీ కావ్య మాత్రం తెలివిగా అన్నం అక్కడ పెట్టి వెళ్లి పోతుంది. ఇక కావాలనే ధాన్య లక్ష్మీతో కలిసి కావ్య ప్లాన్ వేస్తుంది. అపర్ణ బయటకు రాగానే కావ్య, ధాన్య లక్ష్మిలు ప్లాన్ స్టార్ట్ చేసేస్తారు. ఏంటి చిన్న అత్తయ్య మీరు అనేది.. మీరు ఈ పని చేయగలరా అని కావ్య అంటే.. ఏ నేను ఎందుకు చేయలేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నా.. ఈ పని చేయలేనా అని ధాన్య లక్ష్మి అంటుంది. అపర్ణ వాళ్ల వైపు చూస్తూ అక్కడే నిలబడి వింటుంది. మీరే కాదు మా అత్తయ్య వచ్చినా కూడా తిని పించలేరు. మా ఆయన అంత కోపంగా ఉన్నారని కావ్య అంటుంది. అయ్యో ఎంత మాట అన్నావ్ కావ్య. ఏం అనుకున్నావ్ మా అక్కయ్య గురించి. రాజ్ తన మాట వినడని ఎలా అంటావ్ అని ధాన్య లక్ష్మి అంటుంది. ఏంటి? ఏమైంది? రాజ్ ఏం చేశాడని వచ్చి అపర్ణ.. ధాన్య లక్ష్మిని అడుగుతంది. కావ్య చెప్పబోతుంటే.. అపర్ణ అడ్డుకుంటుంది. అప్పుడు ధాన్య లక్ష్మి చెబుతూ.. రాజ్ భోజనం చేయడం లేదంట. కావ్య తీసుకెళ్తే వద్దు అని అంటున్నాడని చెప్తుంది. చేయాల్సిన తప్పులు చేసేసి.. ఇప్పుడు వెళ్లి దణ్ణం పెడతా.. అన్నం పెడతా అంటే ఎవరు వింటారని అపర్ణ అంటే.. నేను వినమన లేదు అత్తయ్యా.. తినమన్నాను అని కావ్య జోక్స్ వేస్తుంది. దానికి అపర్ణ ఉరిమి చూస్తుంది.
అపర్ణను రెచ్చగొట్టేందుకు కావ్య, ధాన్య లక్ష్మి ప్లాన్:
కావ్య చెప్పింది నిజమే.. వాడు ఎవరు చెప్పినా వినడు.. ఒక్క నా మాట తప్ప అని అపర్ణ అంటుంది. అయ్యయ్యో వద్దు అత్తయ్యా ఆయన చాలా కోపంగా ఉన్నారని కావ్య అంటుంది. అని నేనూ చెప్పాను అక్కా.. కానీ రాజ్ ఇప్పుడున్న టైమ్ లో ఎవరి మాటా వినడని ఛాలెంజ్ చేస్తుంది. అక్కా ఈ రోజు రాజ్ చేత ఎలా అయినా అన్నం తినిపించి.. కావ్య ఆలోచన తప్పని ప్రూవ్ చేయాలి అక్క అని ధాన్య లక్ష్మి అంటుంది. ఇక రెచ్చి పోయిన తింగరి అపర్ణ.. భోజనం తీసుకుని రాజ్ దగ్గరకి వెళ్తుంది. మరో వైపు రాజ్ ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అది చేసింది నేను తినడం ఏంటి? అని అనుకుంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి రాజ్ అని పిలుస్తుంది. ఆ కళావతి వచ్చి ఇస్తే తినలేదని.. నీ చేత ఇచ్చి పంపించిందా ఏంటి? అని రాజ్ అంటాడు. నాకు ఒకరు చెప్పాలా రాజ్.. నా కొడుకు గురించి నాకు తెలీదా అని అపర్ణ అంటే.. ఆ కళావతి మొహం చూస్తేనే నాకు తినబుద్ధి కావడం లేదని రాజ్ అంటాడు. ఈ మాటలన్నీ దొంగ చాటుగా కావ్య, ధాన్య లక్ష్మి వింటారు.
రాజ్ కి గోరు ముద్దలు తినిపించిన అపర్ణ:
కావ్య చేసింది నేను తినను అని రాజ్ అంటే.. అని ఎవరు చెప్పారు.. నీ కోసం నేనే కష్ట పడి చేశాని అపర్ణ అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కి గోరు ముద్దలు తినిపిస్తుంది అపర్ణ. ఇది చూసిన కావ్య, ధాన్య లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కావ్యని పొగడ్తలతో ముంచెత్తుతుంది ధాన్య లక్ష్మి. అన్నం శుభ్రంగా తినేసి పడుకుంటాడు. బయటకు వచ్చిన అపర్ణ.. ధాన్య లక్ష్మీ ఇక్కడ ఎవరో ఛాలెంజ్ చేశారు. నా కొడుకు తినరు అని అపర్ణ అంటే.. మీ గురించి తక్కువ అంచనా వేశానని కావ్య అంటుంది. ఓ.. నేను ఎంత ట్రై చేసినా మీ అబ్బాయి నన్ను ప్రేమించనిస్తేనే కదా అని కావ్య అనుకుంటుంది. నీ ప్రేమకి ఎవరైనా దిగొస్తారు కావ్య అని గుడ్ నైట్ చెప్పి వెళ్లి పోతుంది ధాన్య లక్ష్మి.
కావ్యే ప్లాన్ వేసి అన్నం తినిపించిందని తెలుసుకున్న రాజ్:
ఇక గదిలోకి వచ్చి పడుకుంటుంది కావ్య. ఏందుకు నవ్వుతున్నావ్.. నాకు తెలుసులే నువ్వు ఎందుకు నవ్వుతున్నావో.. నువ్వ తీసుకొస్తే నేను తినలేదని.. మా అమ్మ చేత తీసుకొచ్చి ఇస్తే తిన్నాననే కదా అని రాజ్ అంటే.. అయ్యో రామ ఆ విషయం నాకు అస్సలు తెలీదండి. అత్తయ్య గారు వచ్చి మీకు భోజనం పెట్టారా.. ఈ ఓవరాక్షనే తగ్గించు కోవాలి. అయ్యో నువ్వే మా అమ్మకి చెప్పి పంపించావ్ అన్న విషయం నాకు తెలుసని రాజ్ అంటాడు. మీ అమ్మ గారే వంట చేసి తీసుకొచ్చారనుకుంట అని కావ్య అంటే.. ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో తెలీనంత పిచ్చి వాడిని ఏమీ కాదని అంటాడు. మా అమ్మ తీసుకొచ్చింది.. తినక పోతే ఫీల్ అవుతుంది కాబట్టి తిన్నాను అని రాజ్ అంటాడు. ఇక కావ్య లోలోపల నవ్వుకుంటుంది.
వీలు నామా రాయించిన పెద్దాయన.. ఆస్తి పేపర్స్ చించేసిన రాజ్:
ఆ తర్వాత ఇంట్లోని అందర్నీ రమ్మని పిలుస్తాడు సీతా రామయ్య. మీరు చెప్పినట్టుగా వీలు నామా ఇందులో పొందు పరిచానని లాయర్ చెప్తాడు. సుభాష్, ప్రకాష్, ఇందిరా దేవి ఇలా ఇంట్లోని వారందరూ అడ్డుకుంటారు. కానీ సీతా రామాయ్య ఒప్పుకోడు. అయితే ఇప్పుడు ఈ వీలునామా బయట పెడితే అసంతృప్తులు వస్తాయి. దీంతో కుటుంబంలో గొడవలు స్టార్ట్ అవుతాయి. దీన్ని లాకర్ లో భద్రంగా దాచి పెడతాను. అవసరం అయినప్పుడు బయట పెడితే బావుంటుందని ఇందిరా దేవి అంటుంది. పెద్దావిడ సలహాను ఇంట్లోని వారందరూ మద్దతు ఇస్తారు. మరోవైపు రుద్రాణి, రాహుల్ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అయినా ఒప్పుకోని పెద్దాయన.. వీలునామాను చదవమంటాడు. లాయర్ చదివే సమయానికి సరిగ్గా రాజ్ వచ్చి.. ఆ పేపర్స్ తీసుకుని చించేస్తాడు. ఇప్పుడు ఈ వీలునామాతో ఎవరికీ అవసరం లేదు. దయచేసి మీరు వెళ్లండి అని రాజ్ అంటాడు. అది చూసిన ఇంట్లోని వారందరూ షాక్ అవుతారు. రాజ్ అని సీతా రామయ్య గట్టిగా అరుస్తాడు. తాతయ్యా దయ చేసి ఇది ఇంతటితో ఆపేయండి అని రాజ్ అంటాడు. ఏంటి నువ్వు చేసింది? అని పెద్దాయన అడిగితే.. రాజ్ ఒప్పుకోడు. ఎవరికి ఎక్కువ.. ఎవరికి తక్కువ అని ఆలోచన చేయడానికి.. మేము మనుషులం.. బండ రాళ్లం కాదని రాజ్ అంటాడు. శభాష్.. నువ్వే ఈ దుగ్గిరాల వంశానికి అసలైన వారసుడివి అని ఇందిరా దేవి కొనియాడుతుంది. రాజ్ చేసిన పనితో అందరూ సంతోషిస్తారు.