AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kambala: బెంగళూరులో అట్టహాసంగా జరిగిన కంబళ పోటీలు.. బహుమతిగా బంగారం, నగదు

బెంగళూరులో కంబళ పోటీలు అట్టహాసంగా జరిగాయి. కంబళ పోటీలతో అన్నిదారులు ప్యాలెస్‌ మైదానం వైపు మళ్లాయి. ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఉచితంగా పోటీలను వీక్షించేందుకు అవకాశం కల్పించారు. నాల్వడి కృష్ణరాజ ఒడెయరు, పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరిట ప్రత్యేక వేదికలను తీర్చిదిద్దారు. గేటు నంబరు 1 నుంచి వచ్చే ఆరు వేల కార్లకు పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.

Kambala: బెంగళూరులో అట్టహాసంగా జరిగిన కంబళ పోటీలు.. బహుమతిగా బంగారం, నగదు
Kambala
Surya Kala
|

Updated on: Nov 26, 2023 | 7:11 AM

Share

కంబళ పోటీలతో బెంగళూరు ప్యాలెస్‌ మైదానానికి వెళ్లే మార్గాలన్నీ కళకళలాడాయి. కంబళ పోటీల నేపథ్యంలో ప్యాలెస్‌ మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, సినీనటుల రాకతో అవసరమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఈ పోటీల్లో 220 జంటలకు పైగా దున్నలు పాల్గొన్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాకుల్లో దున్నపోతులు పరుగుపెట్టాయి. ‘తుళు కూట’కు 50 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కంబళను నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో మొదటిసారి నిర్వహించిన ఈ పోటీల్లో తీర ప్రాంత జిల్లాలో కనిపించే సంస్కృతిని ప్యాలెస్‌ మైదానంలో సృష్టించారు. ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఉచితంగా పోటీలను వీక్షించేందుకు అవకాశం కల్పించారు. నాల్వడి కృష్ణరాజ ఒడెయరు, పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరిట ప్రత్యేక వేదికలను తీర్చిదిద్దారు. గేటు నంబరు 1 నుంచి వచ్చే ఆరు వేల కార్లకు పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.

మొదటి బహుమతిగా 16 గ్రాముల బంగారం, లక్ష నగదు ఇచ్చారు. రెండో బహుమతి 8 గ్రాముల బంగారం, 50 వేల నగదు, మూడో బహుమతిగా 4 గ్రాముల బంగారం, 25 వేల నగదు అందజేశారు నిర్వాహకులు. రాజకీయాలకు అతీతంగా కంబళ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఇక.. కంబళకు 700 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కంబళ పోటీలను తిలకించేందుకు బెంగళూరులో తీర ప్రాంత జిల్లాలతోపాటు స్థానికులు లక్షల్లో వచ్చినట్లు అంచానా వేశారు. ఇక.. కంబళ పోటీల ట్రాకులు సాధారణంగా 147 మీటర్ల పొడవు ఉండగా.. బెంగళూరులో మాత్రం155 మీటర్ల ట్రాక్‌లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..