Inspiring Story: ఆరు నెలల బాలుడి ప్రాణం కోసం దాతగా మారిన డాక్టర్‌ .. ఏం చేశాడంటే..

ఓ డాక్టర్ తన పేషేంట్ కి ప్రాణం పోయడానికి తానే దాతగా మారారు. అవును ఎవరైనా రోగులకు అవయవ మార్పిడి చేయాల్సి వస్తే దాతల నుంచి అవయవాలను సేకరించి రోగులకు వైద్యం చేస్తారు డాక్టర్లు. కానీ ఓ డాక్టర్‌ తానే దాతగా మారి ఓ చిన్నారికి ప్రాణం పోయడం ఎప్పుడైనా విన్నారా? అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డాక్టర్‌ అలీ అల్‌సమరాహ్‌ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు.

Inspiring Story: ఆరు నెలల బాలుడి ప్రాణం కోసం దాతగా మారిన డాక్టర్‌ .. ఏం చేశాడంటే..
Paediatric Doctor Ali Alsam
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2023 | 3:29 PM

వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు .. అంటే తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారని నమ్మకం. భూమి మీద నడిచే దైవంగా భావించి గౌరవిస్తారు.  రోగుల ప్రాణాలను నిలబెట్టడం కోసం తమ శక్తికి మించి కూడా కష్టపడే వైద్యులున్నారని కరోనా వైరస్ విజృంభణ సమయంలో మరోసారి వైద్య వృత్తి గొప్పదనం వెలుగులోకి తెస్తే.. తాజాగా ఓ డాక్టర్ తన పేషేంట్ కి ప్రాణం పోయడానికి తానే దాతగా మారారు. అవును ఎవరైనా రోగులకు అవయవ మార్పిడి చేయాల్సి వస్తే దాతల నుంచి అవయవాలను సేకరించి రోగులకు వైద్యం చేస్తారు డాక్టర్లు. కానీ ఓ డాక్టర్‌ తానే దాతగా మారి ఓ చిన్నారికి ప్రాణం పోయడం ఎప్పుడైనా విన్నారా? అరుదైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన డాక్టర్‌ అలీ అల్‌సమరాహ్‌ కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి తన ఎముక మజ్జను దానంగా ఇచ్చి ప్రాణం నిలబెట్టారు. ఆలీ పని చేస్తున్న ఆస్పత్రిలో 8 నెలల క్రితం ఓ ఆరునెలల పసివాడు క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం వచ్చాడు. అక్కడ బాబుకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎముక మజ్జ మార్పిడి చేస్తే బ్రతికే అవకాశాలున్నాయని చెప్పారు. వీలైనంత త్వరగా దాతను చూసుకోమని చెప్పారు. కానీ బాలుడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా బోన్‌ మ్యారో మ్యాచ్‌ అయ్యే దాత దొరకలేదు.

ఇవి కూడా చదవండి

బంధువుల్లో ఉన్నాకూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇటు చూస్తే పసివాడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇదంతా గమనించిన డాక్టర్‌ అలీ.. బాబు పరిస్థితికి చలించిపోయారు. బాబుకు చికిత్స చేయాల్సిన వైద్యుల బృందంలో ఒకరైన డాక్టర్‌ అలీ..  పరీక్షలన్నీ చేయించుకొని తన బోన్‌మారో ఆ పసివాడికి మ్యాచ్‌ అవుతుందని నిర్ధారించుకున్నారు. వెంటనే ఎముక మజ్జ దానం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆపరేషన్‌ విజయవంతమై బాబు కోలుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వైద్యుడిగానే కాక దాతగా మారి పసిప్రాణిని కాపాడిన డాక్టర్‌ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఆ పసివాడి తల్లిదండ్రులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రతిఒక్కడూ డాక్టర్‌ను ప్రశంసిస్తున్నారు. డాక్టర్‌ దేవుడితో సమానం అని నిరూపించారని అంటున్నారు.

రోగి కోసం దాతగా మారిన డాక్టర్‌ ఎముక మజ్జ దానం చేసి పసివాడికి ప్రాణం పోసిన డాక్టర్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన