Kitchen Tips: కూరగాయలు కొనేప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..

ఇంట్లో భార్య, భర్తలిద్దరూ ఉద్యోగం చేసే రోజులు వచ్చేశాయ్‌. దీంతో వంట పని, ఇంటి పని అనే తేడాలేకుండా భార్యాభర్తలిద్దరూ వర్క్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో పురుషులు సైతం మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కూరగాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

Kitchen Tips: కూరగాయలు కొనేప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
Fresh Vegetables
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2023 | 1:10 PM

మారుతోన్న జీవన విధానం కారణంగా జీవితం బిజీగా మారిపోయింది. ఇంట్లో భార్య, భర్తలిద్దరూ ఉద్యోగం చేసే రోజులు వచ్చేశాయ్‌. దీంతో వంట పని, ఇంటి పని అనే తేడాలేకుండా భార్యాభర్తలిద్దరూ వర్క్‌ను షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో పురుషులు సైతం మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కూరగాయలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* వంకాయలు కొనుగోలు చేసే సమయంలో మడతలు లేకుండా చూసుకోవాలి. మరీ గట్టిగా లేదా మరీ మెద్దగా ఉండే వాటిని కొనుగోలు చేయకూడదు. ఇక ఆకుపచ్చ రంగులో ఉన్న తొడిమతో ఉన్న వంకాయలను కొనుగోలు చేయాలి. తోలు నిగనిగ లాడుతూ, పుచ్చులు లేకుండా ఉన్న వంకాయలను తీసుకోవాలి.

* ఆలు గడ్డలు కొనుగోలు చేసే సమయంలో గట్టిగా ఉండే వాటిని తీసుకోవాలి. పై పొర తీసినప్పుడు లోపలి భాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండేలా చూసుకోవాలి. నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు లేకుండా చూసుకోవాలి. ఆలుపై గుంటలు లేకుండా నున్నగా ఉండేలా చూసుకోవాలి.

* ఇక అల్లం కొనుగోలు విషయంలో.. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండని వాటిని తీసుకోవాలి. ముదురు రంగులో ఉన్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయొచ్చు.

* ఉల్లిపాయలు కొనుగోలు చేసే సమయంలో గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ ఉంటే అసలు కొనుగోలు చేయొద్దు.

* ఇక క్యారెట్ల విషయానికొస్తే.. మంచి ఆకారం కలిగివున్న క్యారెట్టునే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా వున్న క్యారెట్లను కొనుగోలు చేయొద్దు. మెత్తగా ఉన్న క్యారెట్లను కొనుగోలు చేయకూడదు.

* బీట్‌రూట్‌కు కింది భాగంలో వేర్లు ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. ఎలాంటి మచ్చలు, రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.

* ఆకకూరలు కొనుగోలు చేసే సమయంలో వాటిపై తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..