AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Science Behind Fear: భయం వేసినప్పుడు మన శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో తెలుసా? దీని వెనుక సైన్స్‌ రహస్యం ఇదే

అసాధారణ సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ భయం వేస్తుంది. భయం అనేది మన మానసిక, శారీరక నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఒక సహజమైన స్థితి. ఇది ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిసినప్పుడు మనస్సుకు తెలియజేసే సంకేతం. భయానికి మూల కారణం మన మెదడులోనే ఉందని సైన్స్ చెబుతోంది. జీవితంలో ఎదుర్కొనే వివిధ సవాళ్లు, అనియంత్రిత సంఘటనల మూలంగా భయం వేస్తుంది. నిజానికి భయం వివిధ కారణాల వల్ల పుడుతుంది. భయం వేసినప్పుడు మనలో కలిగే..

Science Behind Fear: భయం వేసినప్పుడు మన శరీరంలో ఏయే మార్పులు జరుగుతాయో తెలుసా? దీని వెనుక సైన్స్‌ రహస్యం ఇదే
Science Behind Fear
Srilakshmi C
|

Updated on: Nov 26, 2023 | 12:22 PM

Share

అసాధారణ సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ భయం వేస్తుంది. భయం అనేది మన మానసిక, శారీరక నిర్మాణాన్ని ప్రభావితం చేసే ఒక సహజమైన స్థితి. ఇది ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిసినప్పుడు మనస్సుకు తెలియజేసే సంకేతం. భయానికి మూల కారణం మన మెదడులోనే ఉందని సైన్స్ చెబుతోంది. జీవితంలో ఎదుర్కొనే వివిధ సవాళ్లు, అనియంత్రిత సంఘటనల మూలంగా భయం వేస్తుంది. నిజానికి భయం వివిధ కారణాల వల్ల పుడుతుంది. భయం వేసినప్పుడు మనలో కలిగే మార్పులు ఇవే..

గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది

భయం మనసునే కాదు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని సైన్స్‌ చెబుతోంది. అందుకే భయం వేసినప్పుడు గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. మన శ్వాసను వేగవంతం చేస్తుంది. మెదడును అలర్ట్ మోడ్‌లో ఉంచుతుంది. చాలా సార్లు ఈ భయం వ్యక్తిగత స్థాయిలో కూడా సంభవిస్తుంది. సాంప్రదాయ, మానసిక అనుభవాల ఆధారంగా భయాన్ని అనుభవిస్తాము.

భయం ఏందుకు వేస్తుంది?

సైన్స్‌ ప్రకారం.. మెదడులో భయం అనుభూతిని కలిగించే రెండు సర్క్యూట్లు ఉంటాయి. ఈ సర్క్యూట్‌లలో కాల్సిటోనిన్ జన్యు సంబంధిత పెప్టైడ్‌, మెదడు అమిగ్డాలాలోని న్యూరాన్‌లు ఉంటాయి. ఇవన్నీ కలిసి భయం అనుభూతిని కలిగిస్తాయి. ఒక వ్యక్తి భయపడినప్పుడు, అతని శరీరంలో ప్రత్యేక హార్మోన్లు, రసాయన మూలకాలు విడుదలవుతాయి. వీటిల్లో కార్టిసాల్, ఎపినెఫ్రైన్, నోర్‌పైన్‌ఫ్రైన్, కాల్షియం ఉంటాయి. ఈ హార్మోన్లు, రసాయన మూలకాలు భయం అనుభూతి చెందుతున్న సమయంలో శరీరంలో వివిధ విధులను నియంత్రిస్తాయి.

భయం వల్ల మరణం కూడా..

చాలా సందర్భాలల్లో అధికంగా భయపడినప్పుడు గుండెపోటు లేదా ఇతర సమస్యలు సంభవించవచ్చు. ఫలితంగా మరణం సంభవిస్తుంది. భయం ఎక్కువగా అనుభూతి చెందినప్పుడు శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది. ఈ హార్మోన్ మెదడు నుంచి బలమైన వేవ్ రూపంలో విడుదల చేయబడుతుంది. ఇది మొత్తం శరీరాన్ని పోరాటం లేదా విశ్రాంతి మోడ్‌లోకి తీసుకుంటుంది. దీని కారణంగా గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. కళ్లలోని నరాలు వ్యాకోచిస్తాయి. కండరాలలో రక్త ప్రవాహం వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శరీరం బిగుతుగా మారుతుంది. శరీరంలో ఇవన్నీ వేగంగా పని చేయడం వల్ల గుండె విఫలమయ్యి, మరణం సంభవిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.