Andhra pradesh: యాత్రికులకు భద్రత కరువు.. ప్రమాదం అంచున భక్తుల ప్రయాణం.. పట్టించుకోని అధికారులు!
Vijayawada: గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో పడవ ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంనే వ్యవహరిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం కృష్ణ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 23 మందికి పైగా మరణించారు. అలాంటి సంఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పర్యాటక అధికారులే నిర్లక్ష్యం చేస్తుంటే యాత్రికుల భద్రత, జాగ్రత్తలు ఎవరు పట్టించుకోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ, నవంబర్26; కార్తీక మాస పర్వదినాలలో నది స్నానం చేసేందుకు స్థానిక ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు వస్తున్నారు. కానీ, యాత్రికుల కొరకు ఎలాంటి భద్రతా చర్యలను పట్టించుకోని పర్యాటక అధికారులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారు.. పడవ ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో.. అంతే ప్రమాదకరం కూడా. విజయవాడ ఇంద్రాకీలాద్రి ఆలయాన్ని దర్శించి పుణ్య నది స్నానానికి వచ్చిన భక్తులు సరదగా పడవ ప్రయాణం చేస్తుంటారు. కానీ, యత్రికుల భద్రతా, సౌకర్యార్థం భవాని ఐల్యాండ్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పకుండా, పడవలో ప్రయాణిస్తున్న యత్రికులకు లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వకుండా యత్రికులను అలుసుగా తీసుకుంటున్నారు.
గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో పడవ ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంనే వ్యవహరిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం కృష్ణ నదిలో జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 23 మందికి పైగా మరణించారు. అలాంటి సంఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పర్యాటక అధికారులే నిర్లక్ష్యం చేస్తుంటే యాత్రికుల భద్రత, జాగ్రత్తలు ఎవరు పట్టించుకోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కార్తీక మాస పర్వదినాల్లో భవాని ఐలాండ్ యత్రికుల సంఖ్య పెరుగుతుంది. పడవ ప్రయాణం చేసేవారు యాత్రికుల భద్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవాని ఐల్యాండ్ చూసేందుకు వచ్చిన యత్రికులు అనుకోని పడవ ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఒక్కో పడవలో సుమారు 20 మంది నుంచి 30 మంది యాత్రికులు ప్రయాణం చేస్తున్నారు. కానీ, ఒక్కరికి కూడా లైఫ్ జాకెట్ ఇవ్వకపోగా, ధరించాలి అనే అవగాహనా కూడా ఎవరు చెయ్యట్లేదు. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే ఎన్నో ప్రాణాలు జల సమాధి అవ్వాల్సిందే అంటున్నారు. ప్రయాణికుల భద్రతపై పర్యాటక అధికారులే పట్టించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకునేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉందంటున్నారు.
పడవ ప్రయాణం చేయాలి అనుకున్న యాత్రికుల దగ్గర అధిక మొత్తంలో ఛార్జ్ వసూలు చేస్తున్న నిర్వాహకులు.. ప్రయాణం చేసే యత్రికుల ప్రాణాలకు మాత్రం ఎటువంటి భద్రత కల్పించ లేకపోతుంది. యాత్రికులు అధిక సంఖ్యలో వస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలిసిన పర్యాటక అధికారులే నిర్యక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రజలు, యాత్రికులు వాపోతున్నారు. డబ్బులు వదిలించుకోవటానికే వస్తున్నాం.. కానీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి కాదంటూ యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు తక్కువ ఛార్జీలు మాత్రం ఎక్కువ అంటూ యత్రీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.