Andhra Pradesh: పక్షి ప్రేమికుడి గొప్ప మనసు.. పక్షుల కోసం ఈ రైతు ఏం చేస్తున్నాడో తెలుసా..?
చాలా మంది తమ స్వార్థం కోసం, బంధువులు లేదా ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తుంటారు. కానీ పక్షులు, జంతువుల ఆకలి తీర్చేందుకు ఎవరూ ఆలోచించరు.. వాటి కోసం కష్టపడే వారు, వ్యయం చేసేవారు చాలా అరుదు. కానీ ఓ చిన్న కారు రైతు మాత్రం పక్షుల కోసం ఎంతో గొప్పపని చేస్తున్నాడు. తనకు ఉన్న అర ఎకరం పొలం లో సజ్జ పంట వేశారు. అలా పండిన పంటంతా పక్షుల కోసమే వదిలేశాడు...మనిషికి మనిషి సహాయ పడని ఈ రోజుల్లో మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాసు కి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తున్నాడు ఓ పక్షి ప్రేమికుడు.గత రెండేళ్లుగా తన సొంత పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పక్షుల కిలకిలరావాలతో మనకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. అంతేకాదు మనిషి హాయిగా బ్రతకాలన్నా, ప్రకృతిని సమతౌల్యంగా ఉండాలన్నా పక్షులు చాలా కీలకం. ప్రస్తుత సమాజంలో పక్షులు కనుమరుగవుతున్నాయి. రేడియేషన్ పవర్ తో పక్షులు మరనిస్తుండగా,ఉన్న కొద్ది పక్షులు సరైన ఆహారం లేక మృత్యువాతపడుతున్నాయి. పక్షి ప్రేమికులు అక్కడ అక్కడ పక్షులను సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒక్కరు.
తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షి ప్రేమికుడు. అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈ తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఊరిలో అంత పత్తి, వరి పంటనే సాగు చేస్తుండడంతో పక్షులకు గింజలు దొరకడం కష్టం గా మారడంతో, దేవదాసు తనకున్న అర్ధ ఎకరా పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు.
కరోనా సమయంలో ఆహారం దొరక్క ఓ బిక్షగాడు ఆకలితో అలమటిస్తుంటే ఆ సమయంలో ఈ దేవదాసు తన ఇంటి నుండి తనకు ఆహారం తెచ్చి ఇచ్చాడు. దింతో ఆ బిక్షగాడు దేవదాసుతో మాట్లాడుతూ తనకు ఈ కరోనాతో తినడానికి ఎక్కడ ఆహారం దొరకడం లేదని నువ్వే రోజు అన్నం పెట్టు అంటూ అనడంతో ఒక్కసారిగా దేవదాసు మనసు చలించిపోయింది. నోరు ఉండి ఆకలి అంటున్న మనుషులకే అన్నము దొరకడం లేదంటే ఇంకా మాటలు రాని పక్షల ఆకలి ఎలా అని తన మదిలో ప్రశ్న మొదలవ్వాగా వెంటనే తనకున్న పొలం లో పక్షలు కోసం అర్ధమ ఎకరా భూమిలో సజ్జ పంట వేశాడు.మనిషికి మనిషి సహాయ పడని ఈ రోజుల్లో మూగ జీవాల సంరక్షణకు పాటు పడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాసు కి అందరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..