Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Avinash: నిజమైన ప్రేమ మతం మారమని కోరదు మోహానికి లొంగి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని మాళవిక హితవు..

మోహానికి లొంగి తమ మతాన్ని విడిచిపెట్టవద్దని మాళవిక హిందూ యువతులకు పిలుపునిచ్చారు. మాళవిక పలు కన్నడ సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. లవ్ జిహాద్ గురించి యువతులకు అవగాహన కల్పించేందుకు మాళవిక తన వంతు ప్రయత్నం చేశారు. యువతులు రకరకాల కోరికలు, ప్రలోభాలకు లోనై లవ్ జిహాద్ వలలో పడి మతాన్ని వీడుతున్నారు. మీ మతాన్ని వదిలి మరో మతానికి కట్టుబడే ముందు మీ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించాలంటూ హితవు చెప్పారు.

Malavika Avinash: నిజమైన ప్రేమ మతం మారమని కోరదు మోహానికి లొంగి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని మాళవిక హితవు..
Malavika Avinash
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2023 | 11:22 AM

నేటి యువతులు ప్రేమకు అర్ధం తెలుసుకోవాలని.. నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా స్వీకరిస్తుంది.. అంతేకాని నీ మతం మారమని కోరదు అంటూ లవ్ జిహాద్ గురించి నటి మాళవిక అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పుత్తూరు టెంకిలలో జరిగిన పుత్తూరు జిల్లా మహిళా సదస్సు ‘నారీ శక్తి సంఘం’ కార్యక్రమంలో పాల్గొన్న మాళవిక హిందూ యువతులతో మాట్లాడారు. మోహానికి లొంగి తమ మతాన్ని విడిచిపెట్టవద్దని మాళవిక హిందూ యువతులకు పిలుపునిచ్చారు. మాళవిక పలు కన్నడ సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.

లవ్ జిహాద్ గురించి యువతులకు అవగాహన కల్పించేందుకు మాళవిక తన వంతు ప్రయత్నం చేశారు. యువతులు రకరకాల కోరికలు, ప్రలోభాలకు లోనై లవ్ జిహాద్ వలలో పడి మతాన్ని వీడుతున్నారు. మీ మతాన్ని వదిలి మరో మతానికి కట్టుబడే ముందు మీ భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించాలంటూ హితవు చెప్పారు. హిందూ మతంలో ఏక భార్యత్వం ఉంది. ఇక్కడ భార్యాభర్తలకు సమాన హక్కులు ఉంటాయి’ అని మాళవిక అన్నారు.

ముస్లిం మతంలో బహుభార్యత్వం ఆచారం ఉంది. విదేశీయుడిని వివాహం చేసుకున్న హిందూ యువతి తన హక్కులను కోల్పోతుంది. అంతేకాదు బహుభార్యత్వం కింద ఒంటరిగా జీవించాల్సిన అవసరం వస్తుంది. ఇస్లాంలోకి మారి ప్రేమిస్తే అది ఎలాంటి ప్రేమ? ప్రేమంటే ఏమిటో ప్రతి యువతి అర్థం చేసుకోవాలి’’ అని పిలుపు నిచ్చారు.

ఇవి కూడా చదవండి

మహిళల ఆలయాల ప్రవేశం..

పదేళ్లలోపు బాలికలు, వృద్ధులు మాత్రమే శబరిమలకు వెళ్లవచ్చు. తక్కువ వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం లేని ఆలయం. హిందూ ధర్మంలోని ఆచారాలపై మాట్లాడేవారికి ముస్లిం మహిళలకు ఏ మసీదులో ప్రవేశానికి అనుమతి ఉందని ప్రశ్నించారు. అయితే హిందూ యువత మతం మారితే.. పూజలు , ఆలయ ప్రవేశం వంటివాటన్నిటిని కోల్పోవాల్సిందే అంటున్నారు మాళవిక.

సమాన హక్కు..

చట్టం ప్రకారం.. హిందూ సమాజంలో వివాహం, విడాకుల విషయంలో మహిళలకు అనుకూలంగా ఉంది. అదే షరియత్ చట్టంలో నలుగురు భార్యలు ఉండవచ్చు. ఆస్తి విషయంలో హిందూ చట్టంలో ఆస్తికి సమాన హక్కు ఉంది. లీగల్ గా చెప్పాలంటే మతం మారినప్పుడు హిందూ యువత చాలా నష్టపోతుంది’ అని మాళవిక హెచ్చరించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..