Youngest MLA: అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీవీ యాంకర్‌.. ఎక్కడో తెలుసా?

ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు అంశాల్లో రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్ పార్టీలు కాకుండా వేరొక పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ రెండు పార్టీలు కాకుండా కొత్త పార్టీని ఎన్నుకోవడం ఇదే మొదటిసారి. 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌-ZPM ఘన విజయం సాధించింది. 27 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. ఎన్నికైన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో..

Youngest MLA: అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీవీ యాంకర్‌.. ఎక్కడో తెలుసా?
Baryl Vanneihsangi
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2023 | 4:08 PM

మిజోరం, డిసెంబర్ 6: ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు అంశాల్లో రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్ పార్టీలు కాకుండా వేరొక పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ రెండు పార్టీలు కాకుండా కొత్త పార్టీని ఎన్నుకోవడం ఇదే మొదటిసారి. 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌-ZPM ఘన విజయం సాధించింది. 27 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. ఎన్నికైన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) పార్టీకి చెందిన బారిల్ వన్నెహ్సాంగి. కేవలం 32 ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైనా అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. .

ఎవరీ బారిల్ వన్నెయిహ్‌సంగి?

బారిల్ వన్నెహసాంగి మాజీ రేడియో జాకీ (RJ), ZPM నాయకురాలు. ఐజ్వాల్ సౌత్-III స్థానానికి పోటీ చేసిన ఆమె మొత్తం 1,414 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అవుట్‌గోయింగ్ మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) అభ్యర్ధి ఎఫ్ లాల్నున్మావియా ఓడించి ముందు వరుసలో నిలిచారు. వన్నెసంగికి మొత్తం 9,370 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి అయిన ఎంఎన్‌ఎఫ్‌కి 7,956 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి రోసియంఘెటా 2,066 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

ఇవి కూడా చదవండి

ZPMకి చెందిన వన్నెసంగి గతంలో ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)లో కార్పొరేటర్‌గా పనిచేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ను పూర్తి చేశారు. గతంలో టెలివిజన్‌ యాంకర్‌గా కూడా పనిచేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 253 వేల వన్నెహ్సాంగికి ఫాలోవర్లు ఉన్నారు. ఆసక్తిగల సోషల్ మీడియా యూజర్‌గా కనిపిస్తోంది. భవిష్యత్తులో మిజోరం అసెంబ్లీలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించడం ఖాయం అని ఆమె మీడియాతో అన్నారు. ఇది మహిళా లోకానికి గర్వకారణమైన క్షణం. అయితే వ్యవస్థను మార్చడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. వారి అంచనాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని అన్నారు.

ఒక వ్యక్తి తన లింగం కారణంగా మనం ఇష్టపడే, కొనసాగించాలనుకునే ఏ పనిని చేయకుండా ఆపదలేదని ఇక్కడి మహిళలందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఏ కమ్యూనిటీ లేదా సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా, ఏదైనా సాధించాలని అనుకుంటే దానికోసమే ముందుకు సాగిపోవాలి అని వన్నెహ్సాంగి అన్నారు. వన్నెహ్సాంగితో పాటు, దక్షిణ టుయిపుయ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ZPM మాజీ భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు జేజే లాల్పెఖ్లూవా కూడా మిజోరంలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.

మిజోరాం అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు

మిజోరాం అసెంబ్లీకి ఎన్నికైన ఇతర మహిళా ఎమ్మెల్యేలు ZPMకి చెందిన లాల్రిన్‌పుయి , MNF పార్టీకి చెందిన ప్రోవా చక్మా. లుంగ్లీ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జోసెఫ్ లాల్‌హింపుయాపై లాల్రిన్‌పుయి 1,646 ఓట్ల తేడాతో విజయం సాధించారు. MNF పార్టీ నుంచి పోటీ చేసిన చక్మా కాంగ్రెస్‌కు చెందిన నిహార్ కాంతి చక్మాపై 711 ఓట్ల తేడాతో వెస్ట్ టుయిపుయ్ స్థానం నుంచి గెలుపొందారు. మాజీ ఐపీఎస్ అధికారి రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మొత్తం 40 స్థానాలకు గాను 27 స్థానాల్లో ఆయన పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. అధికార ఎంఎన్‌ఎఫ్ 10 సీట్లకు పరిమితమైంది. బీజేపీ రెండు స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. నాలుగు స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.