Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదే.. లోక్‌సభలో అమిత్ షా..

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్‌సభలో జోరుగా చర్చ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం, లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ, రిజర్వేషన్‌ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. బిల్లు ప్రకారం కశ్మీర్‌లో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పీఓకేలో 24 సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గతం కంటే కశ్మీర్‌లో అదనంగా ఒకటి, జమ్మూలో ఏడు సీట్లను పెంచింది.

జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదే.. లోక్‌సభలో అమిత్ షా..
Amit Shah
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 06, 2023 | 4:17 PM

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై లోక్‌సభలో జోరుగా చర్చ జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్న కేంద్రం, లోక్‌సభలో జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ, రిజర్వేషన్‌ బిల్లుల్ని ప్రవేశపెట్టింది. బిల్లు ప్రకారం కశ్మీర్‌లో 47, జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పీఓకేలో 24 సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గతం కంటే కశ్మీర్‌లో అదనంగా ఒకటి, జమ్మూలో ఏడు సీట్లను పెంచింది. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదేని లోక్‌సభలో అమిత్‌షా తెలిపారు. చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిల్లు లక్ష్యాలపై అందరూ ఏకీభవిస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ బిల్లు అని అన్నారు. తాను తీసుకొచ్చిన బిల్లు 70 ఏళ్లుగా అన్యాయానికి గురైన, అవమానించిన, పట్టించుకోని వారికి న్యాయం చేసే బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు గత 70 ఏళ్లలో అన్యాయానికి గురైన వారిని ముందుకు తీసుకెళ్లే బిల్లు అంటూ కేంద్ర హోంమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు సొంత దేశంలో నిర్వాసితులైన వారికి గౌరవం, నాయకత్వం అందిస్తుందన్నారు. ఈ బిల్లును ఎవరూ వ్యతిరేకించనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆరు గంటల పాటు చర్చ సాగింది.

బిల్లులపై మాట్లాడుతూ.. నిర్వాసిత కశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్లు ఇస్తే ఏమవుతుందని అడిగే వారు ఆలోచించాలన్నారు. కాశ్మీరీ పండిట్లకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి గొంతు కశ్మీర్ అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ అమిత్ షా పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5-6 తేదీలలో, సంవత్సరాల తరబడి వినిపించని వారి గొంతులను మోడీ జీ వినిపించారని.. నేడు వారు వారి హక్కులను పొందుతున్నారన్నారు. కాశ్మీరీలు నిర్వాసితులైనప్పుడు, వారు తమ దేశంలోనే శరణార్థులుగా మారవలసి వచ్చిందని తెలిపారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన నరేంద్ర మోదీ దేశానికి నాయకుడని.. వెనుకబడిన వర్గాల బాధలు, పేదల బాధలు కూడా ఆయనకు తెలుసంటూ అమిత్ షా పేర్కొన్నారు.

ఈ బిల్లు ద్వారా ఉగ్రవాదం వల్ల తీవ్ర విషాదాన్ని చవిచూసిన ప్రజలకు బలం చేకూరుతుంది. ఉగ్రవాదం కారణంగా 46,631 కుటుంబాలు, 15,7967 మంది తమ నగరాలను విడిచిపెట్టి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నారని షా చెప్పారు.

జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు, కాశ్మీర్‌లో 47, పీఓకేకి 24 అసెంబ్లీ సీట్లు..

పాకిస్తాన్‌తో మొదటి యుద్ధం తర్వాత, 31779 కుటుంబాలు PoK నుంసీ నిరాశ్రయులయ్యాయి. 26319 కుటుంబాలు జమ్మూ, కాశ్మీర్‌లో స్థిరపడ్డాయి, 5460 కుటుంబాలు దేశవ్యాప్తంగా స్థిరపడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..