Toothbrush: విచిత్ర ఘటన.. పొరపాటున టూత్‌ బ్రష్‌ మింగేసిన యువతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే

సాధారణంగా పిల్లలు నోట్లో ఎదైనా పెట్టుకుని ఆడుకుంటూ దానిని పొరపాటున మింగేస్తుంటారు. ఆ తర్వాత వైద్యుల వద్దకు వెళ్తే.. నానా తంటాలు పడి వాటిని బయటకు తీస్తారు. అలా కాయిన్స్‌, తాళం చెవి వంటి చిన్నచిన్న వస్తువులు మింగేస్తుంటారు. అయితే ఓ మహిళ బ్రష్ చేస్తూ పొరపాటున ఏకంగా బ్రష్‌నే మింగేసింది. అందేంటి? అంతపెద్ద బ్రష్‌ను ఎలా మింగేసిందనే అనుమానం మీకూ వచ్చిందా? అసలేం జరిగిందంటే...

Toothbrush: విచిత్ర ఘటన.. పొరపాటున టూత్‌ బ్రష్‌ మింగేసిన యువతి! ఆ తర్వాత ఏం జరిగిందంటే
Woman Swallows Toothbrush
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 06, 2023 | 3:14 PM

స్పెయిన్, డిసెంబర్‌ 6: సాధారణంగా పిల్లలు నోట్లో ఎదైనా పెట్టుకుని ఆడుకుంటూ దానిని పొరపాటున మింగేస్తుంటారు. ఆ తర్వాత వైద్యుల వద్దకు వెళ్తే.. నానా తంటాలు పడి వాటిని బయటకు తీస్తారు. అలా కాయిన్స్‌, తాళం చెవి వంటి చిన్నచిన్న వస్తువులు మింగేస్తుంటారు. అయితే ఓ మహిళ బ్రష్ చేస్తూ పొరపాటున ఏకంగా బ్రష్‌నే మింగేసింది. అందేంటి? అంతపెద్ద బ్రష్‌ను ఎలా మింగేసిందనే అనుమానం మీకూ వచ్చిందా? అసలేం జరిగిందంటే..

స్పెయిన్‌లోని గల్డకావోకు చెందిన హీజియా (21) అనే మహిళ నవంబర్ 29న మాంసాహారం తినింది. అయితే మాంసం ముక్క ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఆమె తండ్రి సాయం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె టూత్‌ బ్రష్‌ని ఉపయోగించింది. బ్రష్‌తో గొంతులో ఇరుక్కుపోయిన పదార్ధాన్ని తొలగించడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో హీజియా తన చేతిలో టూత్ బ్రష్‌ పట్టుకుని గొంతులో ఇరుక్కుపోయిన దానిని బయటకు తీస్తుండగా.. టూత్ బ్రష్ ఆమె చేయి పట్టు నుంచి ఒక్కసారిగా జారిపోయింది. అంతే అది అమాంతంగా గొంతులోకి సాఫీగా వెళ్లిపోయింది.

దీంతో వెంటనే హీజియాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాక అక్కడి సిబ్బందికి తన సమస్యను వివరించింది. దీంతో వారందరూ షాక్‌కు గురయ్యారు. ఎక్స్ చూసేంత వరకు ఆమె చెప్పిన మాటలను నమ్మలేకపోయారు. ఆమె మింగేసిన టూత్ బ్రష్‌ను తొలగించడానికి వైద్యులకు మూడు గంటల సమయం పట్టింది. హీజియాకి మత్తు ఇచ్చి సర్జన్లు దంత పరికరం సహాయంతో విజయవంతంగా వెలికితీశారు. వారు టూత్ బ్రష్‌ని లూప్ చేసి, అన్నవాహిక ద్వారా బయటకు తీశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సర్జరీ సమయంలో తనకు ఎలాంటి నొప్పి కలగలేదని హిజియా చెప్పుకొచ్చింది. కళ్లు తెరిచేటప్పటికీ తన పక్కన మింగేసిన టూత్ బ్రష్‌ కనిపించిందని తెల్పింది. ప్రస్తుతం హిజియా సజావుగా ఊపిరి పీల్చుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట